Gunde Ninda Gudi Gantalu October 16th Episode: రోహిణి కొత్త డ్రామా, దుబాయ్ నుంచి లొకేషన్ షేర్ చేయమన్న బాలు - గుండెనిండా గుడిగంటలు అక్టోబర్ 16 ఎపిసోడ్!
Gundeninda GudiGantalu Today episode: అనుకోకుండా మేకమామ మళ్లీ కథలోకి వచ్చి మీనాకు దొరికిపోయాడు..అయినప్పటికీ బాగా కవర్ చేసింది రోహిణి... ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

గుండె నిండా గుడి గంటలు అక్టోబర్ 16 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2025 October 16h Episod
మటన్ కొట్టు మాణిక్యాన్ని చూసేసింది మీనా. ఆ వెనుకే ఫాలో అవుతూ వెళ్లింది. ఫర్నిచర్ షోరూమ్ కి వెళ్లిన మాణిక్యాన్ని దాచేస్తారు విద్య, రోహిణి. మీనా వెళ్లిపోయే సమయానికి బాలు వస్తాడు. తన ఫ్రెండ్ రాజేష్ కి బీరువా కావాలని అడుగుతాడు. అదే బీరువాలో మాణిక్యాన్ని దాచేయడంతో అది విద్య కొనేసిందని అబద్ధం చెబుతుంది రోహిణి. విద్యకూడా తప్పని పరిస్థితుల్లో సపోర్ట్ చేస్తుంది. అక్కడి నుంచి వెళ్లిపోతారు మీనా, బాలు, రాజేష్. మనోజ్ కి కూడా పని ఉందని చెప్పి బయటకు పంపించేస్తుంది రోహిణి. హమ్మయ్య అనుకుని మాణిక్యాన్ని వెళ్లిపోమని చెబుతుంది. మీరు డ్రామా ఆడుతున్నారని నాకు తెలుసు..మీరే బయటపడతారని వెయిట్ చేస్తున్నా..అయినా మీరు ఏదో సమస్యలో ఉన్నారని అర్థమై ఊరుకున్నా అంటాడు. అదంతా నిజమే అని ఒప్పుకుంటుంది రోహిణి. మీకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటానని మాట ఇచ్చి వెళ్లిపోతాడు మాణిక్యం.
ఇంటికి వచ్చిన మీనా...అదే విషయాన్ని ఆలోచిస్తూ కూర్చుంటుంది. బాలు గలగలా మాట్లాడుతుంటాడు కానీ ఏదో ఆలోచనలో ఉంటుంది. గమనించిన బాలు ఏం జరిగిందని అడుగుతాడు. తనకు రోహిణి మేనమామ ఎదురుపడిన విషయం..తాను ఆగమని అరుస్తున్నా కానీ పట్టించుకోకుండా వెళ్లిపోయిన విషయం చెప్పేస్తుంది మీనా. నేను రోహిణితో ఇదే విషయం మాట్లాడుతుంటే కంగారుపడింది. నాకుమాత్రం అనుమానం ఉంది అనగానే... అవునా నిజమా..నువ్వు ఎవర్ని చూశావో అంటాడు బాలు. మీనా స్ట్రాంగ్ గా చెప్పడంతో నిజమే అయి ఉండొచ్చు..మొదట్నుంచీ నాకు పార్లలమ్మపైనా...ఆ మేకమామపైనా అనుమానం ఉంది.. అదే నిజంఅని నువ్వు ఇప్పుడు చెప్పడంతో అర్థమైంది అంటాడు. పార్లలమ్మ ఎప్పటినుంచో ఏదో దాస్తోంది.. అదేంటో అర్థంకావడం లేదు. ఈ విషయాన్ని మావయ్యతో చెబుతాదా అని మీనా అంటుంది. ఈ మాటలు వింటుంది రోహిణి. ఎలా రుజువుచేద్దాం అని మీనా అడిగితే.. సంక్రాంతికి వాడితో కలసి దిగిన ఫొటోను మా గ్రూపులో షేర్ చేస్తాను.. ఎవరైనా చెబుతారు కదా అంటాడు. వీళ్ల డౌట్ పోయేలా ఏదో చేయాలి అనుకుంటుంది రోహిణి
ఎత్తుకు పై ఎత్తు వేసే రోహిణి...ఈ సారి మరో కొత్త డ్రామాకి తెరతీసింది. తనకు సహాయం చేస్తానని మాటిచ్చిన మాణిక్యాన్ని మరోసారి మేనమామగా రంగంలోకి దించింది. ఈ సారి ఇంటికి తీసుకురాకుండా ...కాల్ చేయించింది. అది కూడా వీడియో కాల్. ఫారెన్ బ్యాగ్రౌండ్ లో నిల్చుని కాల్ చేస్తాడు మటన్ కొట్టు మాణిక్యం. ప్రభావతికి వీడియో కాల్ చేస్తాడు ఇంట్లో అందర్నీ పలకరిస్తాడు. ఇంతలో బాలు వచ్చి ఏంటి ఇదంతా వాడు నీకు నిన్న కనిపించాడని చెప్పావ్ అని అడిగితే..ఏమో అని ఊరుకుంటుంది మీనా. ఇంతకీ రోహిణి వాళ్ల నాన్న జైలు నుంచి ఎప్పుడొస్తారని అడిగితే.. మరో నెలరోజుల్లో బయటకు వచ్చేస్తారని చెప్పేస్తాడు.. ఇలా ఇరికించాడేంటి అని రోహిణిలో కంగారుపెరుగుతుంది. ఇంతలో ఆ పోన్ బాలు తీసుకుని..మీరిప్పుడు ఎక్కడున్నారని అడుగుతాడు. దుబాయ్ లో ఉన్నానని చెబుతాడు మాణిక్యం. అవునా.. మీరున్న ప్లేస్ నుంచి లొకేషన్ షేర్ చేయండి..మా డబ్బుడమ్మ మీరెక్కడున్నారో చెప్పేస్తుంది అని అంటాడు. షాక్ అవుతారు మాణిక్యం రోహిణి. మరి లొకేషన్ షేర్ చేస్తే దొరికిపోవడం ఖాయం.. లొకేషన్ పంపకపోతే మీనా చెప్పినమాటే నిజం... మరి ఈ గండం నుంచి ఎలా గట్టెక్కుతారో చూడాలి...






















