Gunde Ninda Gudi Gantalu August 14th Episode: సంజయ్ నిజస్వరూపం బయటపెట్టేసిన మౌనిక, మీనాకు రోహిణి వార్నింగ్ - గుండెనిండా గుడిగంటలు ఆగష్టు 14 ఎపిసోడ్!
Gundeninda GudiGantalu Today episode: తండ్రి డబ్బులిచ్చాడని అబద్ధం చెప్పిన రోహిణి, మౌనికను బర్త్ డే పార్టీకి తీసుకెళ్లి అవమానించిన సంజయ్.. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

గుండెనిండా గుడిగంటలు ఆగష్టు 14 ఎపిసోడ్ (Gunde Ninda Gudi Gantalu August 14th Episode)
మనోజ్ మాజీ ప్రేయసి నుంచి వసూలు చేసిన డబ్బుని తన తండ్రి ఇచ్చాడని అబద్ధం చెబుతుంది రోహిణి. ప్రభావతి తప్ప అందరకీ డౌట్ వస్తుంది. శ్రుతి, బాలు వరుస ప్రశ్నలు సంధిస్తారు. నిజం బయటపడుతుందేమో అని భయపడిన రోహిణి..ఏంటి అత్తయ్యా డబ్బు రానంతవరకూ రాలేదన్నారు ఇప్పుడేమో ఇలా అని ఫైర్ అవుతుంది. అంతా ఏమీ మాట్లాడకుండా ఆగిపోతారు.
మరోవైపు సంజయ్ బర్త్ డేని గ్రాండ్ గా చేయాలని ప్లాన్ చేస్తుంది మౌనిక. కానీ ఆమెను ఏడిపించాలని ఫిక్సవుతాడు సంజయ్. సాయంత్రం పార్టీకి వెళదాం రెడీ అవు అని చెప్తాడు. సంజయ్ తో పాటూ సంతోషంగా బయలుదేరుతుంది మౌనిక. అక్కడంతా మందుతాగే బ్యాచ్ ఉంటారు. సంజయ్ రాగానే హగ్గు ఇచ్చి మరీ కేక్ కట్ చేయిస్తారు. ట్రెండీ డెస్సుల్లో ఉన్న సంజయ్ ఫ్రెండ్స్ అంతా చీరకట్టుకున్న మౌనికను అవమానిస్తారు. పార్టీ సెన్స్ లేదు, ఇలాంటి పార్టీలకు ఎప్పుడూ రాలేదా? ఈమెను ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నిస్తారు. మౌనిక అవమానాన్ని భరిస్తూ దూరంగా నిల్చుని ఉండిపోతుంది. ఒకరికొకరు మందు తాగించుకుంటూ రచ్చ రచ్చ చేస్తారు.
సంజయ్ ఫ్రెండ్ మౌనిక దగ్గరకు వచ్చి అసభ్యంగా మాట్లాడుతాడు. ఇది పార్టీ తీసుకోవాల్సిందే అంటూ మందు గ్లాస్ చేతికిస్తాడు. నాకు అలవాటు లేదని చెప్పాకదా అని గట్టిగా చెప్తుంది మౌనిక. తాగాల్సిందే అని పట్టుబడతాడు. మౌనిక చేయి పట్టుకోగానే..ఎందుకు టచ్ చేశావ్ అంటూ లాగిపెట్టి కొడుతుంది. ఇంతలో సంజయ్ వచ్చి ఏంటే అరుస్తున్నావ్ అంటూ మౌనికపై చేయి చేసుకుంటాడు. తాగాల్సిందే అని బలవంతంగా మౌనికతో తాగించేందుకు ట్రై చేస్తాడు. గ్లాస్ తోసేయడంతో కిందపడి పగిలిపోతుంది. అవమానించి ఇక్కడి నుంచి పో అంటాడు సంజయ్.
పదే పదే బాలు ప్రశ్నలు వేస్తే బండారం బయటపడుతుందని భావించిన రోహిణి..మీనాను టార్గెట్ చేస్తుంది. మా విషయాలు మీకెందుకు అంటుంది. నేను మా ఆయనకు కారు కొన్నప్పుడు మీరంతా నన్ను నిలదీయలేదా అని రివర్స్ లో క్వశ్చన్ చేస్తుంది మీనా. నేను బుద్ధిలేక అలా చేశాను..ఇకపై నా విషయాలు మీకు అనవసరం మీ విషయాలు నాకు అనవసరం అంటుంది. అదే విషయం వెళ్లి బాలుకి చెప్పొచ్చుకదా అంటే..గొడవను పెంచాలి అనుకోవడం లేదు నువ్వే అర్థమయ్యేలా చెప్పు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది రోహిణి.
ఏడ్చుకుంటూ పార్టీనుంచి వచ్చేసిన మౌనిక..రోడ్డుపై అలా నడుచుకుంటూ వెళ్లిపోతుంటుంది. వెనుక నుంచి వెహికల్ హారన్ కొడుతున్నా పట్టించుకోదు..సరిగ్గా యాక్సిడెంట్ అయ్యే సమయంలో మీనా వచ్చి మౌనికను పక్కకు లాగుతుంది. ఏం చేస్తున్నావ్? ఇక్కడున్నావేంటి? చూసుకోవా అని అరుస్తుంది. ఇన్నాళ్లూ అంతా బాగానే ఉంది, నేను బాగానే ఉన్నానని చెప్పిన మౌనిక నిజం చెప్పేస్తుంది. సంజయ్ ని పెళ్లి చేసుకుని వెళ్లినప్పటి నుంచీ ఒక్కరోజు కూడా సంతోషంగా లేనంటూ ఇన్నాళ్లుగా జరిగినవన్నీ మీనాతో చెప్పేస్తుంది. షాక్ అయిన మీనా ఇప్పుడే మీ అన్నయ్యకు చెప్తాను ఆగు ఈరోజు వాడి అంతు చూడాల్సిందే అంటుంది మీనా. కానీ ఆపేస్తుంది మౌనిక. నీ అంత ఓపికగా ఉంటాను.. సంజయ్ కోపం నాపై కాదు మన కుటుంబంపై...అందుకే ఎప్పుడో ఎప్పుడు మారుతాడు అంటుంది. మీనా ఏమీ మాట్లాడకుండా ఆగిపోతుంది.






















