అన్వేషించండి

Gunde Ninda Gudi Gantalu December 12 Episode: మీనాకు క్షమాపణలు చెప్పాల్సిందే! శీలా డార్లింగ్ దగ్గరకు చేరిన ప్రభావతి పంచాయతీ - గుండెనిండా గుడిగంటలు డిసెంబర్ 12 ఎపిసోడ్!

Gundeninda GudiGantalu Today episode: ఇంట్లో ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సత్యం-ప్రభావతి మాట్లాడుకోవడం లేదు. దీంతో రంగంలోకి దిగింది సుశీలమ్మ. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 12 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2025 December 12 Episode

కారు కొనేందుకు షోరూమ్ కి వెళ్లిన బాలుకి అక్కడ రెండు కార్లు నచ్చుతాయి. వాటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసేందుకు మీనాను రమ్మని కాల్ చేస్తాడు. వెళ్లిన మీనా..కారు సెలెక్ట్ చేస్తుంది కానీ ఇప్పుడు కొనొద్దు అంటుంది. ఎందుకు? ఇది నీ ఆలోచనే కదా అంటాడు బాలు. అవును నా ఆలోచనే కానీ ఇంట్లో పరిస్థితబాలేననప్పుడు కారు కొంటే.. అత్తగారు నాపై కారాలు మిరియాలు నూరుతారు అంటుంది మీనా. ఇది కూడా నిజమే అంటాడు రాజేష్. ఎలాగైనా వాళ్లిద్దరూ మాట్లాడుకున్న తర్వాతే అడుగు ముందుకువేద్దాం అంటుంది. ఎనం ఎన్నిప్రయత్నాలు చేసినా సాధ్యం కావడం లేదు..అందుకే ఏం చేయాలా అని ఆలోచిస్తారు. నేను చూసుకుంటాలే వదిలెయ్ అంటాడు బాలు.

 మరోవైపు  శ్రుతి స్టూడియోకి వెళుతుంది. డబ్బింగ్ లో భాగంగా డెలివరీ అవుతున్న మహిళ పాత్రకు వాయిస్ ఇస్తుంది. నొప్పులు పడే డబ్బింగ్ అది. తెరపై ఆమె నొప్పులు పడుతుంటుంది..ఈమె వాయిస్ ఇవ్వాలి. అంటే నొప్పులు పడాలన్నమాట. ఆ డబ్బింగ్ చెబుతూనే ఏడ్చేస్తుంది శ్రుతి. వెంటనే తల్లికి కాల్ చేసి Sorry చెబుతుంది. అమ్మా నేను పుట్టినప్పుడు నువ్వు ఎంత బాధపడి ఉంటావ్ అని తల్చుకుని మరీ కన్నీళ్లు పెట్టుకుంటుంది. తల్లి ఓదార్చుతుంది.  ఇవన్నీ చూసి పిల్లల్ని కనాలనే ఆలోచన చేయవేమో అలాంటి పని చేయొద్దు అంటుంది తల్లి.

అలసటగా అనిపించి ఇంటికి వచ్చేస్తుంది రోహిణి. ఆ వెనుకే వస్తుంది శ్రుతి. ఏంటి శ్రుతి వచ్చేశావ్ అని అడిగితే  నేను వెళ్లాలి నొప్పులు పడాలి అంటుంది. నొప్పులు పడడం ఏంటి అని అడిగితే..ఆఫీసులో డబ్బింగ్ సంగతి చెబుతుంది. పిల్లల్ని కనాలి అనుకున్నా కానీ ఇంతగా నొప్పులు పడాలని తెలియదు అంటుంది. స్పందించిన రోహిణి... నువ్వు నొప్పుల గురించి మాట్లాడుతున్నావ్... ఆ 9 నెలలు అంతకుమించి అనిపిస్తుంది. 

 మొదటి 3 నెలలు వాంతులు చేసుకుంటూనే ఉంటాం,  పుల్లపుల్లగా తిననాలి అనిపిస్తుంది, కానీ ఏమీ తినలేం..ఏమీ చేయలేం... ఆరు నెలలు దాటితే నడవలేం, లేవలేేేం, కూర్చోలేం అని చెప్పుకుంటూ వెళ్లిపోతుంది. మీనా , శ్రుతి ఇద్దరూ అలా చూస్తుంటారు.  ఏమైందని అడిగితే... అదేంటి ఇవన్నీ నువ్వే ఫేస్ చేసినట్టు..నొప్పులు పడి బిడ్డను కన్నట్టు చెబుతున్నావ్ అంటుంది శ్రుతి.  నువ్వు ఇంతకముందే బిడ్డను కన్నావా ఏంటి రోహిణి అని అడుగుతుంది మీనా.  షాక్ అయిన రోహిణి..బిడ్డను కంటేనే తెలుస్తాయా ఏంటి? మా క్లయింట్స్ చెబుతుంటే విన్నా అని కవర్ చేస్తుంది. 

పిల్లల్ని కనడం ఓ వరం..అదో అందమైన అనుభూతి. బిడ్డ కడుపులో పడినప్పటి నుంచీ ఆ బిడ్డను ఎప్పుడెప్పుడు చూద్దామా అని తల్లి ఎదురుచూస్తుంటుంది. ఆ అనుభూతి గురించి బిడ్డను కనాలి అనుకున్న తల్లిమాత్రమే చెబుతుంది అంటుంది. అమ్మో నేను నొప్పులు పడను అంటుంది శ్రుతి. రవి పిల్లల్ని కావాలంటే అని క్వశ్చన్ చేస్తుంది మీనా... వాడు నొప్పులు పడితే నేను కంటా అంటుంది శ్రుతి.

బాలు వెళ్లి సుశీలమ్మను తీసుకొస్తాడు.  ఈ సమస్య తీర్చేస్తావ్ కదా అంటే ముందే చెబితే ఇంతవరకూ వచ్చేది కాదుకదా అంటుంది.   సుశీలమ్మకి ఎదురు వస్తుంది మీనా... మంచి శకునం, చల్లగా చందమామలా ఎదురొచ్చింది అంటుంది సుశీలమ్మ. నువ్వైనా ఎందుకు చెప్పలేదు అంటే...మీరు పుట్టినరోజు జరుపుకుని సంతోషంగా ఊరెళ్లారు...ఆ సంతోషాన్ని ఆవిరి చేయడం ఎందుకని చెప్పలేదు అంటుంది మీనా. మీరు బాధపడుతుంటే..నేను సంతోషంగా ఉంటానని ఎలా అనుకుంటున్నావ్ అంటుంది. అసలు మిమ్మల్ని కాదు.. ఈ గొడవలకు ఆద్యురాలు నా కోడలి సంగతి చెప్పాలి ముందు అంటుంది. ప్రభావతీ అని పిలవగానే...ఎందుకు వచ్చారని అడుగుతుంది... నా కొడుకు ఇంటికి రావడానికి పర్మిషన్ అడగాలా? అంటుంది.

 సమస్య ఉందని తెలిసే వచ్చాను.. నీ బాధ ఏంటో చెప్పు అంటుంది సుశీలమ్మ. మీనావైపు కోపంగా చూస్తుంది ప్రభావతి. నాకు చెప్పింది అది కాదు దానివైపు కోపంగా చూస్తావేంటని నిలదీస్తుంది. ఆ మనోజ్ గాడిని నెత్తిన పెట్టుకోకు అని ఎన్నోసార్లు చెప్పాను...అయినా నువ్వు వినలేదు. వాడు వ్యాపారంలో మోసపోయాడు కదా..అందులోంచి బయటపడేందుకు వేరేదారిలేక ఇలా చేశాను అంటుంది. నువ్వు వాడిని వెనకేసుకుని రావొద్దు ..పిల్లలు ప్రయోజకులు అవ్వాలని ఏ తల్లి అయినా కోరుకుంటుంది..కానీ నువ్వు మనోజ్ గాడిని ఎందుకూ పనికిరానివాడిలా చేశావ్...వెళ్లి నా కొడుకుని పిలువు అంటుంది. 

వాళ్ల మధ్య మాటలు లేవుకదా అంటాడు బాలు. అయితే నేనే వెళతాను..మీరెవ్వరూ పైకి రావొద్దు అంటుంది.  నువ్వు చెప్పకపోతే సమస్య తెలియదు అనుకుంటున్నావా? నువ్వేమైనా పాతికేళ్ల కుర్రాడివా భార్యతో మాట్లాడడం మానేయడానికి...ప్రభావతికి కొత్తా ఏంటి..నువ్వే చూసిచూడనట్టు పోవాలి అంటుంది. తను నగలు తీసుకోవడం కూడా తప్పుబట్టను...కానీ నిజం ఒప్పుకోకుండా ఆ నిందను మీనాపై, వాళ్ల అమ్మపై వేసింది..ఈ దొంగ తెలివితేటలు మనవాళ్లపైనే చూపిస్తే ఎలా అంటాడు. అదే దాని గుణం నువ్వే సర్దుకుపో అంటుంది. పెళ్లైన దగ్గర్నుంచీ అదే చేస్తున్నా...ఇప్పుడు కూడా భరించాలంటే ఓపిక నశిస్తోంది..ఈ జన్మకు మారదు అందుకే తనతో మాట్లాడడమే వృధా అని ఓ నిర్ణయానికి వచ్చేశాను అంటాడు సత్యం.   ఒకర్నొకరు అర్థం చేసుకోవాలంటే ఒకర్నొకరు క్షమించాలి అంటుంది. ముందు ప్రభావతి వెళ్లి మీనాకు క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేస్తాడు. అదెందుకు చెప్పాలి అని అడుగుతుంది. మీనా మొహంపైకి గాజులు విసిరిన విషయం కూడా చెబుతాడు సత్యం..షాక్ అవుతుంది సుశీలమ్మ..

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
Advertisement

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Trimukha Movie Release Date: సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
Tata Sierra Dealership: టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
Embed widget