Gunde Ninda Gudi Gantalu July 7th Episode : మీనాకు ఘోర అవమానం, తల్లిదండ్రులకు షాకిచ్చిన శ్రుతి - గుండె నిండా గుడి గంటలు జూలై 07 ఎపిసోడ్
Gundeninda GudiGantalu Today episode: శ్రుతి, రోహిణి తాళి మార్చే వేడుకలో అంతా కలసి బాలుని టార్గెట్ చేస్తారు. ఎట్టకేలకు టార్గెట్ చేరుకున్నారు. గుండెనిండా గుడిగంటలు ఈరోజు ఎపిసోడ్ లో ఏంజరిగిందంటే

గుండెనిండా గుడిగంటలు జూలై 07 ఎపిసోడ్
తాళి మార్చే ఫంక్షన్ పేరుతో.. శ్రుతి, రవిని శాశ్వతంగా ఇంటికి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు శ్రుతి పేరెంట్స్ శోభ-సురేంద్ర. అది జరగాలంటే ఫంక్షన్లో గొడవ జరగాలి..శ్రుతికి తన అత్తింటివారిపై ఆగ్రహం రావాలి. కోపంగా రవిని తీసుకుని పుట్టింటికి వచ్చేయాలి ఇదే ప్లాన్. వారం రోజులుగా ఈ ఫంక్షన్ హడావుడి నడుస్తోంది.
బాలుని రెచ్చగొట్టడమే టార్గెట్
తన కళ్లముందు అన్యాయం జరిగినా, తల్లిదండ్రులను మీనాను ఎవరు ఏమన్నా, అవమానించేలా ప్రయత్నించినా బాలు ఒంటికాలిపై లేస్తాడు. అది తన సహజగుణం. అందుకే ఇద్దరు మనుషులను అరెంజ్ చేసి మరీ బాలుని రెచ్చగొట్టేందుకు ప్లాన్ చేశారు శోభ-సురేంద్ర. వాళ్లిద్దరూ కావాలని వెళ్లి బాలు కాలు తొక్కి గొడవకు దిగారు, అరేయ్ అంటూ వీపుపై గట్టిగా కొట్టి నా ఫ్రెండ్ అనుకున్నా అయితే ఏంటి అని మరోసారి గొడవ చేశారు. ఇలా ఎన్నిసార్లు గొడవచేసినా బాలు మాత్రం మౌనమే నా భాష అని అన్నీ భరించాడు కానీ నోరెత్తలేదు. ఇదంతా చూసి రగిలిపోయిన శోభ-సురేంద్ర..భోజనానికి పిలిచి కూర్చోబెట్టి తినేటప్పుడు అక్కడ వీఐపీలు వస్తారని లేపి పంపించేసి అవమానిద్దాం అనుకుంటారు. అంతా సిద్ధం చేస్తారు. ఇంతలో సత్యం, బాలు అక్కడకు వచ్చిన పిల్లల్ని కూర్చోబెట్టి వడ్డించి ఆ ప్లాన్ కి చెక్ పెడతారు. ఫంక్షన్ మొత్తం ప్రశాంతంగా జరిగిపోతే తమకు ఖర్చు తప్ప ప్లాన్ సక్సెస్ అవదనే ఆలోచనలో పడతారు శ్రుతి పేరెంట్స్
రోహిణి బాధ రోహిణిది
ఇంటికి వెళ్లేలోగా ఏదైనా పెద్ద గొడవ జరిగితే అత్తయ్య కాన్సన్ ట్రేషన్ తనపై ఉండదనే ఆలోచనలో ఉంటుంది రోహిణి. తన తండ్రి గురించి చెప్పిన అబద్దం బయటపడకుండా ఉండాలంటే బాలు ద్వారా గొడవ చేయిస్తే చాలని ఫిక్సవుతుంది. అందుకే ఓ తాగుబోతుని అరెంజ్ చేసి బాలుతో ఫుల్లుగా తాగించమంటుంది. తాగితి బాలు గొడవ ఎలాగూ చేస్తాడు..అప్పుడు ఫంక్షన్ రచ్చ రచ్చ అవుతుంది..ప్రభావతి కాన్సన్ ట్రేషన్ తపై ఉండదని రోహిణి -తన ఫ్రెండ్ తో కలసి ప్లాన్ చేస్తుంది. కానీ ప్లాన్ ఫెయిలవుతుంది బాలు తాగడు.
ప్రభావతి గోల ప్రభావతిది...
నగలతో ధగధగలాడిపోతున్న శ్రుతిని చూసి కడుపునింపేసుకుంటుంది ప్రభావతి. రోహిణి తండ్రి మలేషియ నుంచి వస్తే కిలోల కొద్దీ బంగారం తెస్తాడనే ఆలోచనలో ఉంటుంది. కానీ ఫంక్షన్ ఎంతసేపు గడిచినా రోహిణి తండ్రి రాకపోవడంతో విశ్వరూపం చూపిస్తుంది. మనోజ్ ని తనవైపు తిప్పుకుంటే పరిస్థితి చెక్ పెట్టొచ్చని రోహిణి అనుకుంటుంది కానీ ప్రభావతి తగ్గేదేలే అన్నట్టు రెచ్చిపోతుంటుంది.
బయటకు చెక్కేసిన శ్రుతి రవి
ఫంక్షన్లో ఎవరి గోల వాళ్లది అన్నట్టు.. శ్రుతి మాత్రం చాలా రోజుల తర్వాత లీవ్ పెట్టాను. ఇక్కడుంటే పద్ధతులు పాడు అంటూ మా మమ్మీ చంపేస్తుంది ఎక్కడికైనా వెళ్లి సరదాగా తిరిగి వద్దాం అంటుంది. సరే అని చెప్పి రవి తీసుకెళ్లిపోతాడు. మెడలో ఉన్న దండ తీసి మంచంపై పడేసి వెళ్లిపోతుంది శ్రుతి. చూసుకోదు...
సురేంద్ర-శోభకి గొడవ చేసే టాపిక్ దొరికేసింది
ఫంక్షన్ మొత్తం జరిగిపోయినా గొడవ చేసేందుకు అవకాశం రాలేదని ఎదురుచూసిన సురేంద్రకు..మీనా రూపంలో ఆ అవకాశం వచ్చింది. వేడుక ముగిసిన తర్వాత అంతా కలసి గుడికి వెళదాం అని అందర్నీ పిలుస్తారు శోభ-సురేంద్ర. వెళ్లి శ్రుతిని పిలవమని మీనాకు చెబుతుంది ప్రభావతి. రూమ్ లోపలకు వెళ్లిన మీనాకు శ్రుతి కనిపించదు. మంచంపై దండ కనిపిస్తుంది..దానికి చైన్ చిక్కుకుని ఉంటుంది. ఇలా పడేసింది ఏంటి అనుకుంటూ చిక్కుకున్న చైన్ తీస్తుంటుంది మీనా..అప్పుడే లోపలకు వచ్చిన సురేంద్ర..శోభను పిలిచి మరీ కావాలని గొడవ చేస్తారు
సత్యం కుటుంబానికి తీవ్ర అవమానం
మొగుడు రౌడీ..భార్య దొంగ అని బాలు-మీనాను అవమానిస్తారు. మీనా ఎంత చెప్పేందుకు ప్రయత్నించినా కానీ నోరు పారేసుకుంటారు శ్రుతి పేరెంట్స్. ఎక్కువ మాట్లాడుతున్నావ్ అని అడ్డుకున్న సత్యాన్ని నానా మాటలు అంటాడు. ఇలాంటి బతుకు బతికే కన్నా చావడం మేలు అన్న సురేంద్రపైకి దూసుకెళ్తాడు బాలు. లాగిపెట్టి కొట్టడంతో సురేంద్ర పడిపోతాడు.
మొత్తానికి సురేంద్ర-శోభ ప్లాన్ చేసినట్టే ఫంక్షన్లో రచ్చ రచ్చ చేశారు. తమ కూతుర్ని ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు అని సంతోషంలో ఉన్నారు..
శ్రుతి సపోర్ట్ మీనాకే
సాధారణంగా మీనా అంటే శ్రుతికి చాలా ఇష్టం. మీనాపై ఒక్క మాట కూడా పడకుండా అడ్డుకుంటూ ఉంటుంది శ్రుతి. గతంలో మౌనికకు తాళి మార్చే ఫంక్షన్ టైమ్ లోనూ మీనాపై దొంగతనం నిందవేస్తే శ్రుతి కారణంగానే బయపడింది. ఇప్పుడు కూడా శ్రుతి ఎంట్రీతోనే మీనా నిర్దోషిగా తేలనుంది. ఏం జరుగుతుందో ఫుల్ ఎపిసోడ్ లో చూద్దాం...






















