Gunde Ninda Gudi Gantalu June 19th : హాల్లో తిప్పలు పడుతున్న బాలు మీనా .. సత్యం కుటుంబానికి శ్రుతి తల్లి నుంచి మరో ముప్పు - గుండె నిండా గుడి గంటలు జూన్ 19 ఎపిసోడ్
Gundeninda GudiGantalu Today episode: బాలుకి కారు కొనిచ్చి సర్ ప్రైజ్ చేస్తుంది మీనా. ఇదంతా చూసి రగిలిపోయిన ప్రభావతి రోహిణిని టార్గెట్ చేస్తుంది. గుండెనిండా గుడిగంటలు ఈరోజు ఎపిసోడ్ లో ఏంజరిగిందంటే

గుండెనిండా గుడిగంటలు జూన్ 19 ఎపిసోడ్
నా కొడుకు దుర్మార్గుడు వాడిని వదిలేసి వెళ్లిపో..నీకు పెద్ద కుటుంబం ఉంది. ధైర్యంగా నీ కాళ్లపై నువ్వు నిలబడు, చదువుకున్నదానివి ఏదైనా ఉద్యోగం చేసుకో. జరిగింది మర్చిపోయి మళ్లీ పెళ్లిచేసుకుని సంతోషంగా ఉండు అంటుంది సంజయ్ తల్లి. నేను పెళ్లిచేసుకుని వచ్చినప్పుడు తెలిసింది ఓ దుర్మార్గుడిని చేసుకున్నా అని. చాలా బాధలు పడ్డాను వదిలేసి వెళ్లిపోదాం అనుకున్నా ఆ టైమ్ లోనే సంజయ్ కడుపులో పడ్డాడు. ఇక్కడే ఉండాల్సి వచ్చింది. వాడు పట్టిన తర్వాత నాపై ఆ రాక్షసుడి తీరులో మార్పు వచ్చింది. ఇప్పుడు వాడిలానే తయారయ్యాడు సంజయ్ అందుకే వెళ్లిపో అంటుంది. మా అన్నయ్య కూడా మా వదినను ఇష్టం లేకుండానే పెళ్లిచేసుకున్నాడు..తాగేవాడు, తగాదా పెట్టుకునేవాడు కానీ ఇప్పుడు మారాడు. మా వదిన సహనంగా మార్చుకుంది. నేను పుట్టింటికి వెళితే నా అన్నయ్య ఇక్కడకు వస్తాడు..మీ అబ్బాయిని చంపేస్తాడు. కాలం ఏదైనా కాపురం కాపురమే..మంచో చెడో కష్టమో సుఖమో నాకు నా భర్త కావాలి, కాపురం నిలబడాలి అంటుంది మౌనిక. నా కడుకు మారుతాడని నేను నమ్మడం లేదు కానీ భార్యగా నువ్వు నమ్ముతున్నావు. నీ జీవితం చక్కబడితే నాకు కావాల్సింది ఏమీ లేదంటుంది.
మీనా దగ్గరకు వెళ్లిన రోహిణి..చాలా తలనొప్పిగా ఉంది టీ పెట్టి ఇస్తావా అని అడుగుతుంది. కొత్త కారు ఎలా వచ్చిందని అడుగుతుంది. కారు మీరు ఎలా కొన్నారని అడుగుతున్నా అంటుంది. సెకెండ్ హ్యాండ్ కారు కొనాలన్నా 3 లక్షలు అవుతుంది కదా అంత డబ్బు ఎక్కడిది అని అడుగుతుంది రోహిణి. మాలలు కొన్న డబ్బులు వచ్చాయని మీనా చెప్పినా కానీ రోహిణి చాలా డౌట్స్ వ్యక్తం చేస్తుంది. బాలు నీ వాల్యూ పెరగాలని ఎక్కడో అరెంజ్ చేసి నువ్వు కొన్నావని చెప్పాడా అంటుంది. నిజంగానే నువ్వే కొనిచ్చావా అని అడుగుతుంది. ఇక్కడ నువ్వు ఏదైనా చేస్తే నాపై వేరేలా రిఫ్లెక్ట్ అవుతుంది..నువ్వు కారు కొనివ్వడం నాకు సమస్యగా మారింది అంటుంది రోహిణి. నువ్వు అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నావ్ అని మీనా అడుగుతుంది. మీరిద్దరూ గొడవపడుతూనే ఉంటారు కదా అయినా కారు కొనిచ్చావా అంటుంది . మామధ్య ఎన్ని గొడవలు ఉన్నా అంతకుమించిన ఇష్టం నాపై ఉంది అంటుంది మీనా. అందుకే పూలకొట్టు పెట్టించారంటుంది.
ఇంతలో రోహిణి వచ్చి..అసలేంటి క్వశ్చన్స్ సంధిస్తున్నావ్. దేనికైనా హద్దు ఉండాలి అంటుంది శ్రుతి. బాలు మీనా మధ్య మంచి అనుబంధం ఉంది ..నువ్వు జలస్ ఫీలవుతున్నట్టు అర్థమవుతోంది. నీలాంటి థింకింగ్ ఉన్న క్యారెక్టర్స్ ని నేను చాలామందిని చూస్తుంటా..నువ్వు అలాగే కనిపిస్తున్నావ్ అని ఇచ్చిపడేస్తుంది. ఇకపై ప్రశ్నకు వేయొద్దని చెప్పి వెళ్లిపోతుంది శ్రుతి.
ప్రభావతి ఇంటికి శ్రుతి తల్లి వచ్చి నల్లపూసల కార్యక్రమం ఏర్పాటు చేద్దాం అంటుంది. రోహిణికి కూడా అదే సమయంలో మార్పించేద్దాం అంటుంది ప్రభావతి. ఇదంతా తామే సెలబ్రేట్ చేస్తానని చెప్పడంతో ప్రభావతి సంతోషిస్తుంది.
శ్రుతితో కలిపి నీక్కూడా ఫంక్షన్ చేయాలంటే ఈసారి మీనాన్న రావాల్సిందే అంటుంది ప్రభావతి. ఇంకా ఎన్నేళ్లు బిజిగా ఉంటారు ఇక ఓపికపట్టను..మీ నాన్న రావాల్సిందే మెడలో పుస్తెల తాడు తేవాల్సిందే..లేదంటే ఇదేదో గట్టిగా తేల్చుకోవాల్సిన వ్యవహారమే అవుతుందని వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి. రోహిణి కంగారుపడుతుంది.
మొన్న పార్లర్ మేటర్ బయటపడినప్పటి నుంచీ చాలా తేడాగా ప్రవర్తిస్తోందని ఫ్రెండ్ కి చెబుతుంది రోహిణి. ముందు ముందు నీకు విశ్వరూపం చూపించేలా ఉందంటుంది రోహిణి ఫ్రెండ్. తాళి మార్చే ఫంక్షన్ కి మా నాన్న రావాల్సిందే అంటోంది..ఏం చేయాలో అర్థంకావడం లేదంటుంది రోహిణి.
శ్రుతి, రవి శాశ్వతంగా ఇంటికి వచ్చేలా ప్లాన్ చేశాను అంటుంది శ్రుతి తల్లి. ఫంక్షన్ లో గొడవ చేసేలా బాలుని రెచ్చగొట్టి ఆ ఇంటి నుంచి మన అమ్మాయిని తీసుకొచ్చేద్దాం అంటుంది.
గుండెనిండా గుడిగంటలు జూన్ 20 ఎపిసోడ్ లో.. హాల్లో బాలు మీనా తిప్పలు పడుతుంటారు. ఎవరో ఒకరు హాల్లోకి వచ్చి తిరుగుతుంటారు...






















