Gunde Ninda Gudi Gantalu June 03 Episode: ప్రభావతితో ఆడుకున్న శ్రుతి - బాలు మీనా టామ్ & జెర్రీ వార్ - గుండె నిండా గుడి గంటలు జూన్ 03 ఎపిసోడ్
Gundeninda GudiGantalu Today episode: శివ కారణంగా బాలు - మీనా మాట్లాడుకోవడం మానేస్తారు. మనసులో ప్రేమ దాచుకుని బయటపడకుండా ప్రవర్తిస్తుంటారు. గుండెనిండా గుడిగంటలు ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

గుండెనిండా గుడిగంటలు జూన్ 03 ఎపిసోడ్
రవి శ్రుతి ఇద్దరూ ఏసీ ఆఫ్ చేసి ఆన్ చేసి గొడవపడడంతో ఫ్యూజ్ పోయి ఇంట్లో కరెంట్ పోతుంది. అందరూ ఒక్కొక్కరుగా బయటకువస్తుంటారు. ప్రభావతి ఫేస్ ప్యాక్ చూసి దయ్యం దయ్యం అని భయపడి పారిపోతారు. కాసేపు అందరూ కలసి ప్రభావతిని ఆటపట్టిస్తారు. ఫ్యూజ్ పోయిందని చెప్పిబాలు సెట్ చేస్తాడు. కరెంట్ వస్తుంది. కరెంట్ వచ్చినా కానీ భయం వేస్తోంది అమ్మా ఫేస్ కడుక్కుని రా అంటాడు. ఫేస్ కడుక్కోకుండా రూమ్ లోకి రానివ్వను అంటాడు సత్యం.
రూమ్ లోకి వెళ్లినవెంటనే వెనుకే వచ్చిన శ్రుతితో డోర్ ఎవరు వేస్తారని అడుగుతాడు. నీకు మీ అమ్మలాగే అంటాడు. నీకు మీ అమ్మ బుద్ధులే వచ్చినట్టున్నాయ్..మీనా ఎంత పనిచేసినా అరుస్తూనే ఉంటుంది ఆ బుద్ధులే నీకు వచ్చాయ్ అంటుంది. ఇదంతా విన్న ప్రభావతి వీళ్లు వీళ్లు కొట్టుకుని మధ్యలో నన్ను లాగుతున్నారు అనుకుంటుంది. నాకు బుద్ధిలేక పెళ్లిచేసుకున్నా అని రవి అంటే..నీకే బుద్ధిలేదని ఫైర్ అవుతుంది. ఈ గొడవలు ఇలాగే జరిగితే నా డబ్బున్న కోడలు పుట్టింటికి వెళ్లిపోతుందేమో సమస్యేంటో అడిగి తీర్చాలి అనుకుంటుంది ప్రభావతి
బాలు ఇచ్చిన వార్నింగ్ కి సంజూ తాగుతుంటాడు. నా ఇంటికి వచ్చి నా కాలర్ పట్టుకుంటాడా అని రగిలిపోతుంటాడు. వాడు నా కాళ్లపై పడిన ప్రతిసారీ వాడే గెలుస్తున్నాడు..వాడిని చంపేయాలి అంటాడు. వీడు పెట్టిన హింసకి మౌనిక ఏదైనా చేసుకుని ఉంటే అందరం జైల్లో ఉండేవారం అని ఫైర్ అవుతుంది సంజూ తల్లి. సంజూ తండ్రి బెదిరించి పంపించేస్తాడు. ప్రతి ఇంట్లో ఇలాంటి నస క్యారెక్టర్ ఉంటుందంటాడు సంజూ. నీ పెళ్లా తొందరపడి ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే మనం ఇరుక్కుంటాం ..ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేయి అంటాడు సంజూ తండ్రి. క్యారెక్టర్ మీద కొట్టినా దానిలో మార్పులేదంటే ఏదో గట్టి దెబ్బ కొట్టాలి అంటాడు. నేను ఢిల్లీ వెళుతున్నా వచ్చేసరికి బాలు గాడిమీద, ఆ కుటుంబం మీద పగ తీర్చుకోవాలి అంటాడు. వాడి కళ్లముందే నీకు ఘనంగా మినిస్టర్ కూతురితో పెళ్లి చేస్తాను అంటాడు.
పూలమాలలు కొనేందుకు వెళతారు మీనా-బాలు. ఇద్దరూ వాదనకు దిగుతారు. నువ్వు నన్ను తిడుతుంటే పడాల్సిన అవసరం లేదు నీ ఆర్డర్ వెనక్కు తీసుకో అంటుంది మీనా. ఆ రాజకీయ నాయకులు ఇచ్చిన వార్నింగ్ గుర్తుచేసుకుని అమ్మో వద్దు వద్దు ఆర్డర్ మీరే ఉంచుకోండి నేను కేవలం డ్రైవర్ మాత్రమే అంటాడు. ఆటోని నో పార్కింగ్ ఏరియాలో పెట్టడంతో పోలీస్ వచ్చి ఫైన్ వేస్తాడు. ఫైన్ కష్టమరే కట్టాలని బాలు, ఆటో డ్రైవర్ కట్టాలని మీనా అంటారు. పోలీస్ దగ్గర కావాలనే ఇరికిస్తుంది మీనా. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి ఏంటి మీనా ఇక్కడే ఉన్నావ్ అనడంతో .. అక్కా సరైన టైమ్ కి వచ్చావ్ ఈవిడ ఎవరో చెప్పు అని అడుగుతాడు బాలు. నీ భార్య కదా అని చెప్పడంతో పోలీస్ వదిలేస్తాడు. ఇక్కడి నుంచి మా ఇంటికి వెళ్లి సుమతిని ఎక్కించుకుని రావాలి అంటుంది. మీ ఇంటికి రాను సుమతిని దార్లో నిలబడమను అంటాడు.
మధ్యలో ఆటో ఆపి టీ తాగేందుకు వెళతారు.మీనా రమ్మంటుంది కానీ బాలు రానంటాడు. టీ ఇప్పిస్తాను అంటుంది అక్కర్లేదు అంటాడు బాలు. రెండు టీ ఇవ్వండి అని అడిగి తీసుకుంటుంది. డ్రైవర్ కి టీ ఇప్పించడం అంటే గొప్ప విషయమే అంటాడు టీ షాప్ ఓనర్. దేవత లాంటి పాసింజర్ అనడంతో వాళ్లిద్దరూ భార్య భర్తలు అని పక్కనుండేవారు అంటారు. ఇంత మంచి భార్య ఎంతమందికి దొరుకుతుంది అంటాడు.
శృతి రవి ఇద్దరు పోటాపోటీగా రెడీ అవుతుంటారు. ఇద్దరూ గొడవ పడుతుంటే ప్రభావతి కలుగజేసుకుంటుంది. భార్య భర్త గొడవ అది సత్యం కలుగజేసుకోవద్దని చెప్తాడు. ఏమైనా కానీ శ్రుతి రవిని అడిగి తెలుసుకోవాలి అనుకుంటుంది. ఇద్దరూ రాగానే అదే విషయం అడుగుతుంది ప్రభావతి. శ్రుతి మాత్రం మేం గొడవపడడం లేదు చిన్న చిన్న సరసాలు ఆడుకుంటాం అంతే అంటుంది. రవి కూడా సేమ్ సమాధానం చెప్పడంతో షాక్ అవుతుంది ప్రభావతి.
గుండెనిండా గుడిగంటలు జూన్ 04 ఎపిసోడ్ లో..మీనా కట్టిన పూల మాలలు మండపానికి చేరకుండా చేయాలని ప్లాన్ చేస్తాడు గుణ. ఏం జరుగుతుందో చూడాలి






















