Gruhalakshmi September 5th: దివ్యకి సోరి చెప్పిన విక్రమ్- నందు ఇచ్చిన లెటర్ చూసి షాకైన తులసి
లాస్య బండారం విక్రమ్ ముందు బయట పడటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
లాస్య తులసిని ఇబ్బంది పెట్టాలని రాజ్యలక్ష్మికి చెప్పిన ప్లాన్ మొత్తం దివ్య వింటుంది. వెంటనే తులసికి ఫోన్ చేసి పూజకి రావొద్దని అంటుంది. ఎందుకని ఆశ్చర్యంగా అడుగుతుంది. లాస్య ఆంటీ ఏదో లిక్విడ్ పట్టుకుని వచ్చింది. దాన్ని నీ చీర కొంగుకి రాసి నిప్పు అంటుకునేలా చేయాలని చూస్తున్నట్టు చెప్తుంది. పూజకి రావొద్దని ఏదో ఒక అబద్ధం చెప్పమని అంటుంది. కానీ తులసి మాత్రం లాస్యకి భయపడి రాకుండ ఉండలేనని ప్లాన్ తిప్పి కొడతానని కూతురికి ధైర్యం చెప్తుంది. నిజానికి ఇది మనకి దొరికిన బంగారు అవకాశం. లాస్య ఎలాంటిదో అందరికీ తెలిసేలా చేద్దాం అప్పటి వరకు ఏం తెలియనట్టే ఉండమని సలహా ఇస్తుంది.
లాస్య: శ్రావణ శుక్రవారం పూట వ్రతం చేసుకుంటూ తోడి ఆడదాని మీద నిందలు వేయడానికి మనసు ఎలా వచ్చింది. నువ్వు వ్రతం చేసుకుంటున్నావని మీ అత్త రమ్మని పిలిస్తే ఇష్టం లేకపోయినా వచ్చాను. వచ్చినందుకు తగిన శాస్తి చేశారు
విక్రమ్: మీ మధ్య ఎన్ని పాత పగలు ఉన్నా బయట చూసుకోండి. ఈ ఇంట్లో పూజ జరుగుతున్నప్పుడు ఆవిడ మీద నిందలు వేస్తే ఊరుకొను. పెద్దవారు మీరు కూడా చెప్పరు ఏంటి అత్తయ్య
Also Read: 'నీ భర్త ఎవరంటూ' ముకుంద మీద భవానీ ఫైర్- మనసులో మాట చెప్పిన మురారి!
దివ్య: మా అమ్మతో కాదు నాతో మాట్లాడు. లాస్య ఆంటీ నాటకం ఆడుతుంది. అత్తయ్యలా నువ్వు కూడా లాస్య ట్రాప్ లో పడుతున్నావ్
రాజ్యలక్ష్మి: ఈ ఇంటి అతిథిని అవమానించడం కరెక్ట్ కాదు
లాస్య: వాళ్ళ అమ్మ మాయలో పడి ఏదో మాట్లాడింది వదిలేయ్ విక్రమ్. ప్రశాంతంగా పూజ పూర్తి చేసుకోండి
విక్రమ్: సోరి చెప్పాల్సిందే నేను ఒప్పుకోను. ఇది ఈ ఇంటి మర్యాదకి సంబంధించిన విషయం
దివ్య: దేవత లాంటి అత్తయ్య నాతో వ్రతం చేయిస్తుంటే లాస్య ఆంటీ కావాలని చెడగొట్టాలని చూస్తున్నారు. అత్తయ్య మీరు విక్రమ్ లాగా అమాయకులు ఎవరిని పడితే వారిని నమ్ముతారు
రాజ్యలక్ష్మి: ఇంత అవమానం జరిగిన తర్వాత నువ్వు ఇక్కడ ఉండటం ఎందుకు వెళ్లిపో లాస్య
తులసి లాస్య వెళ్తుంటే అడ్డుపడుతుంది. తప్పు లేదని రుజువు చేసుకుని వెళ్ళమని చెప్పమని చెప్తుంది. తన కొంగు చాటున తన చేతిలో ఉన్న కవర్ లో ఏముందో చూపించి వెళ్తే చాలని తులసి అంటుంది. లాస్య తనకి అవమానం జరిగిందని కన్నీళ్ళు పెట్టుకుని నటిస్తుంది. తనని తప్పించడం కోసం బసవయ్య ట్రై చేస్తాడు. కానీ విక్రమ్ మాత్రం కొంగులో ఏముందో చూపించనివ్వు ఏమైందని అంటాడు. లాస్య వెళ్లబోతుంటే తులసి అడ్డుపడగానే లిక్విడ్ బాటిల్ కింద పడుతుంది. అది దివ్య తీసుకుని ఈ లిక్విడ్ మా అమ్మ చీరకి రాసిందని చెప్తుంది. అది లాస్య రాయలేదని చెప్పమని చెప్పండని అందరూ అంటారు. లాస్యని సపోర్ట్ చేస్తే అడ్డంగా దొరికిపోతామని రాజ్యలక్ష్మి ప్లేట్ ఫిరాయిస్తుంది.
రాజ్యలక్ష్మి: తనతో మాటలు ఏంటి బయటకి గెంటేయండి
విక్రమ్: కష్టంలో ఉన్నావని మా అమ్మ చెప్తే దివ్యకి ఇష్టం లేకపోయినా హాస్పిటల్ లో ఉద్యోగం ఇచ్చాను. కొడుకు కోసం ఆత్మహత్య చేసుకుంటే మా అత్తకి ఇష్టం లేకపోయినా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి సపోర్ట్ చేశాను. ఇలాంటి పని చేయడానికి సిగ్గు లేదా? మామూలుగా అయితే పోలీసులకు పట్టించాలి. ఆవిడ కొడుకు అన్యాయం అవుతాడని ఆలోచిస్తున్నా గెటవుట్. సోరి దివ్య లాస్య ఆంటీ గురించి చాలా సార్లు కంప్లైంట్ చేశావ్ కానీ పట్టించుకోలేదు
తులసి వాళ్ళు సంతోషంగా ఇంటికి వస్తారు. నందు గదిలోకి వెళ్ళిపోతాడు. వెనుకే పరంధామయ్య వెళ్ళి మనసులో మాట చెప్పమని అంటాడు. ఈ వయసులో ఇలాంటి పనులు ఏంటని ఆలోచిస్తున్నానని చెప్తాడు.
Also Read: కావ్య మనసులో కొత్త ఆశలు- రాజ్ నమ్మకద్రోహం, కొడుకు ప్రవర్తనతో షాక్లో అపర్ణ
పరంధామయ్య: మేం బతికి ఉండగానే నిన్ను తులసిని ఒకటిగా చూడాలని ఆశ. మేం చేతులు పట్టుకుని బతిమలాడితే తులసి ఒప్పుకుంటుంది. కానీ నీకు నువ్వుగా తనకి దగ్గర కావాలి అది మాకు కావలసింది. తులసి హ్యాపీ మూడ్ లో ఉంది వెళ్ళి లెటర్ ఇవ్వు
తులసి ఫోన్ చూసుకుంటూ ఉండగా నందు తన దగ్గరకి భయంగా భయంగా వెళతాడు. పరంధామయ్య కొడుకుని ప్రపోజ్ చేయమని తోస్తా ఉంటాడు. తులసికి ఏదో చెప్పాలని అనుకున్నావ్ చెప్పావా అని కావాలని ముసలాయన అడుగుతాడు. పొద్దున పూజ జరగడానికి ముందే చెప్పారని తులసి అంటుంది. ప్రేమ సంగతి చెప్పాడని అనుకుని ముసలోళ్ళు సంకలు గుద్దుకుంటారు. తులసి ఏమో కాంట్రాక్ట్ గురించి అనుకుంటుంది.. వీళ్ళు ఏమో నా మనసులో మాట గురించి అనుకుంటున్నారని నందు బిక్క మొహం వేసుకుని తిక్క చూపులు చూస్తూ నిలబడతాడు. కాసేపటికి నందు చెప్పింది కాంట్రాక్ట్ సంగతని పరంధామయ్య వాళ్ళకి అర్థం అవుతుంది.