By: ABP Desam | Updated at : 24 Sep 2022 09:18 AM (IST)
Edited By: Soundarya
image credit: Disney Plus Hotstar/ Star Maa
ప్రస్తుతం మనం బయటకి వెళ్తే గడ్డి పోచకింద కూడా పనికిరాము. పరిస్థితులు మనకి అనుకూలంగా మార్చుకోవడానికి ట్రై చేద్దాం అని లాస్య నచ్చజెబుతుంది. తులసికి పాతికేళ్లు మొగుడు పోస్ట్ లో ఉన్నాను.. ఇప్పుడు తులసి నాకు మొగుడై కూర్చుంటే ఎలా అనిపిస్తుందో తెలుసా, కాలికి వేసుకోవాల్సిన చెప్పుని నెత్తిన పెట్టుకుని మోస్తున్నట్టు అనిపిస్తుంది అంతాకంటే మన చెప్పు తీసుకుని మనమే కొట్టుకుంటే బెటర్ అని నందు చిరాకుగా చెప్తాడు. తులసికి చదువు రాదు అదే మనకి ప్లస్ పాయింట్ పక్కనే ఉంటే సిన్సియర్ ఉన్నట్టు నటిస్తూ గోతులు తవ్వుతూ తప్పు చేసేలా చేద్దాం ఆ తప్పుని సామ్రాట్ ముందు హైలైట్ చేద్దాం అని లాస్య చెప్తుంది. ఇదంతా జరిగే పనేనా అని నందు అంటే తులసి చేసిన తప్పుని సామ్రాట్ ముందు నువ్వు సరిదిద్దితే మేనేజర్ పోస్ట్ నీ సొంతం అయిపోతుందని ఎక్కిస్తుంది లాస్య.
అంకిత, ప్రేమ్, శ్రుతి అభిని పిలిపించి మాట్లాడేందుకు చూస్తారు. అమ్మకి జనరల్ మేనేజర్ గా పని చేసే అవకాశం లభించింది. అమ్మని ప్రశాంతంగా పని చేసుకొనిద్దాం అని ప్రేమ్ అభికీ చెప్పేందుకు చూస్తాడు. నేను ఎలా కనిపిస్తున్నా నీకు అమ్మని పని గట్టుకుని తనాతో యుద్ధం చేసే వాడిలా కనిపిస్తున్నాన, మామ్ మీద నీకె కాదు నాకు ప్రేమ ఉంది. ఆస్తి నాకు రాకుండా చేసిందని నాకు కోపం ఉంది కానీ అలాగని ద్వేషం లేదు అర్థం చేసుకోరా అని అభి అంటాడు. నీ మాటలు కఠినంగా ఉన్నాయని అంకిత అంటుంది. ప్రస్తుతం మామ్ తెలియకుండా ఎక్కడ చిక్కుల్లో పడుతుందో అని నా భయం అని చెప్తాడు. ఆంటీ ఏదైనా ఆలోచించే చేస్తుంది, అవసరం అయితే సామ్రాట్ గారిని కూడా దూరం పెట్టింది కదా అని శ్రుతి చెప్తుంది. మామ్ విషయంలో ఇంత ఆరాటపడుతున్నారు కదా మరి డాడ్ విషయంలో ఎందుకు పట్టించుకొరని అభి అడుగుతాడు. నాన్న విషయంలో నా అభిప్రాయం నాకు ఉంది దాని గురించి డిస్కస్ చేయకు అని ప్రేమ్ అంటాడు.
Also Read: 'అక్క నా సొంత అక్క కాదు కదా తనేమైపోతే నాకేంటి' అనుకున్న సత్య- దేవుడమ్మకి అబద్ధం చెప్పిన ఆదిత్య
తులసి ఇంట్లో వాళ్ళ అందరికీ అన్నం ముద్దలు పెడుతూ ఉంటే తింటూ ఉంటారు. అదంతా సామ్రాట్ చూస్తాడు. తులసిగారు ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం ఉంటుంది. అలాంటి తులసిగారికి ఎందుకు ఇంత అన్యాయం చేశాడని సామ్రాట్ బాధపడతాడు. డాక్టర్ వచ్చి హనీ చేతికి కట్టు తీసేస్తుంది. ఇప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చని తులసి అంటే నాకు హ్యాపీగా లేదు నాకు తగ్గిపోయిందని మీరు అందరూ వెళ్లిపోతారు కదా ఇంకా నేను ఎవరితో ఆడుకోవాలి అని హనీ బాధగా అంటుంది. ఆ మాటలకి ఇంట్లో వాళ్ళు కూడా ఎమోషనల్ అవుతారు. వెంటనే ప్రెస్ మీట్ ఆరెంజ్ చెయ్యమని తులసికి చెప్తాడు. మన మధ్య మనస్పర్థలు వచ్చాయని మ్యూజిక్ స్కూల్ ఆగిపోయిందని ప్రచారం జరుగుతుంది కదా అది తప్పని అందరికీ తెలియాలి కదా అని సామ్రాట్ అంటాడు. పనులు మొదలైతే అందరికీ తెలిసిపోతుంది కదా మళ్ళీ ఈ ప్రెస్ మీట్ అవసరమా అని తులసి అంటే నా అభిప్రాయం కూడా అదే అని నందు అంటాడు. కానీ లాస్య మాత్రం తులసిని అవమానిస్తూ సామ్రాట్ కి సపోర్ట్ చేస్తుంది.
అసలు మీ మధ్య జరిగిన విషయం బయటకి ఎలా వెళ్లిందో తెలుసుకోవాలి దొంగని పట్టుకోవాలి అని ఇంట్లో అందరూ అంటారు కానీ తులసి మాత్రం వద్దని అంటుంది. అలా చేస్తే టైమ్ వృధా అవుతుందని చెప్తుంది. సరే తులసి గారు మీ ఇష్టం నా వరకు ప్రెస్ మీట్ అవసరం, లాస్య అన్నట్టు మా కంపెనీ రిపిటేషన్ కూడా వస్తుందని సామ్రాట్ చెప్తాడు. నందు గదిలోకి వచ్చి చిరాకు పడతాడు. మ్యూజిక్ స్కూల్ కట్టడానికి కూడా ఇంత హంగామా అవసరమా అని నందు తిడతాడు. తులసి సామ్రాట్ లైఫ్ లోకి రాకుండా మనం చెయ్యాలి అది మన టార్గెట్ అని లాస్య అంటుంది. ప్రెస్ వాళ్ళని పిలువు అని లాస్య సామ్రాట్, తులసి పరువు పోయే విధంగా ప్లాన్ వేస్తుంది.
Also Read: మాటలతో వసు మనసుకి మరో గాయం చేసిన రిషి, బయటపడిన దేవయాని-సాక్షి కుట్ర!
నందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాడు. అందులో ఉన్న ఒక విలేకరితో లాస్య చిన్నగా చెప్పింది అంతా గుర్తుంది కదా చెప్పినట్టే చెయ్యండి అని చెప్తుంది. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్ అని నందు అడుగుతాడు. నువ్వు ఏం ప్లాన్ చేశావ్ చెప్పు అని నందు అడుగుతాడు.
తరువాయి భాగంలో..
మా మామ్ ఇక మీతో కలిసి పని చేయదు. తన భార్య గురించి నిజం చెప్పమనండి లేచిపోయిందా.. వదిలేశారా.. చంపేశారా చెప్పండి అని అభి అడుగుతాడు. సామ్రాట్ ఆ మాటలకి చాలా బాధగా కూలబడిపోతాడు.
Brahmamudi February 4th: రాజ్ కి నిజం చెప్పమన్న కావ్య- స్వప్న మీద కన్నేసిన రాహుల్
Janaki Kalaganaledu February 4th: రామతో కన్నీళ్లు పెట్టించిన అఖిల్- వంట రాక తిప్పలు పడుతున్న మలయాళం
Guppedantha Manasu February 4th Update: ఆఖరి శ్వాసవరకూ రిషి సార్ ప్రేమకోసమే తపిస్తానన్న వసు, దేవయాని స్కెచ్ పసిగట్టేసిన జగతి-మహేంద్ర
Gruhalakshmi February 4th: నందు కేఫ్కి సామ్రాట్ సాయం- విడాకులిస్తానంటూ అంకితని బెదిరించిన అభి
బుల్లితెరపై ఇక ‘ఆనందం’ హీరో ఆకాశ్ సందడి - సీరియల్స్లోకి ఎంట్రీ?
Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా
Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!
AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!