Gruhalakshmi October 2nd: దివ్య మీద విక్రమ్ ఫైర్- సామ్రాట్ కంపెనీ లాకర్ వివరాలు మొత్తం చెప్పేసిన తులసి
దివ్య, విక్రమ్ ఒక్కదటి కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
వినాయక చవితి పూజ చేసుకునేందుకు కూర్చోగానే తులసి ఇంటికి రత్నప్రభ దంపతులు వచ్చేసరికి అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. కొత్తగా కంపెనీ బాధ్యతలు తీసుకున్నారని తెలిసింది అందుకే బిజీగా ఉన్నారు ఏమోనని పిలవలేదని తులసి అంటుంది. మీతో పాటు హనీని కూడ తీసుకొస్తే బాగుండేదని అడుగుతుంది.
రత్నప్రభ: తీసుకురావడం బాగానే ఉంటుంది కానీ తీసుకెళ్ళేటప్పుడు కష్టం. తను ఏడుస్తుంది మేం కొప్పడతాం. ఇవన్నీ అవసరమా
తులసి: తీసుకురావడం తీసుకురాకపోవడం మీ ఇష్టం మేం మామూలుగా అడిగాం
ఇటువైపు వెళ్తూ పలకరిద్దామని ఆగామని ధనుంజయ్ కవర్ చేసుకుంటాడు. అటు విక్రమ్ ఇంట్లో వినాయక పూజ మొదలువుతుంది. దివ్య, విక్రమ్ ని చూసి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేలా ఉన్నారని ప్రియ మెచ్చుకుంటుంది. జానూని చూసి పెళ్లెప్పుడని విక్రమ్ తాతయ్య అడుగుతాడు. తాను పెళ్ళికి రెడీ అని అబ్బాయిని అత్తయ్య చూస్తుందని చెప్తుంది. పూజ చేసే వాళ్ళని వచ్చి పీటల మీద కూర్చోమని అంటే దివ్య, విక్రమ్ కూర్చుంటారు. విక్రమ్ కి మరొక వైపు జాహ్నవి వెళ్ళి కూర్చునేసరికి అందరూ షాక్ అవుతారు. బావ పక్కన కూర్చోకూడదా ఏంటని అడుగుతుంది. ల్యాండ్ డాక్యుమెంట్స్ తీసుకురమ్మని విక్రమ్ దివ్యకి చెప్తాడు. పూజ చేసుకోకుండానే చవితి చంద్రుడిని చూశాను ఏం జరుగుతుందో ఏమోనని దివ్య టెన్షన్ పడుతుంది. గదిలోకి వెళ్ళి డాక్యుమెంట్స్ కోసం వెతుకుతుంది కానీ కనిపించవు.
Also Read: కృష్ణ మీద అసూయతో రగిలిపోతున్న ముకుంద- చిరాకు పెట్టించేసిన ప్రభాకర్
మాట మీద నిలబడటం చేతకాదా అని నందు ధనుంజయ్ వాళ్ళ మీద సీరియస్ అవుతాడు. ఎందుకు వచ్చారని నిలదీస్తాడు. తులసి కోసం వచ్చామని చెప్తారు. తులసితో పని ఉంది వచ్చామని అనవసరంగా రెచ్చిపోవద్దని రత్నప్రభ కోపంగా చెప్తుంది. దివ్య టెన్షన్ గా కిందకి వచ్చి డాక్యుమెంట్స్ కనిపించలేదని చెప్పేసరికి విక్రమ్ సీరియస్ అవుతాడు.
విక్రమ్: అవి ఎంత ముఖ్యమైన డాక్యుమెంట్స్ అని చెప్పాను కదా అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావ్
నేను తీయక, దివ్య తీయక డాక్యుమెంట్స్ ఎక్కడికి పోయాయని రాజ్యలక్ష్మి మనసులో అనుకుంటుంది.
దివ్య: కనిపించడం లేదు ఎవరో తీసినట్టు ఉన్నారు అని అందరూ బసవయ్య వైపు చూస్తారు
బసవయ్య: చవితి చంద్రుడిని చూశానని నన్ను బలి ఇచ్చే మేకని చూసినట్టు చూస్తారు ఏంటి? ఏదో ఒకసారి జరిగిందని ప్రతి సారి నామీద వేస్తారా? ఎవరో తీసారంటే మా అక్క తీసినట్టా
రాజ్యలక్ష్మి: అలా అని వాళ్ళు ఏమి అనలేదు కదా
బసవయ్య: నువ్వు వాటిని దాచి పెట్టి కావాలని అలా చేశావని అంటారు. అయినా డాక్యుమెంట్స్ ఇచ్చింది ఎందుకు చిత్తు కాగితాలు మాదిరిగా పడేయడానికా
విక్రమ్: పండగ పూట నా మూడ్ చెడగొట్టావ్. అవి ఎంత ముఖ్యమో నీకు తెలుసు. పూజలో వాటిని పెట్టుకోవాలని అనుకుంటున్నా అని తెలుసు అయినా ఇంత నిర్లక్ష్యమా
తాతయ్య: అవి ఇంట్లోనే ఉంటాయి ఎక్కడికి పోవు. పూజ పూర్తయిన తర్వాత వెతకొచ్చు కదా తప్పు చేసిన దానిలా నిందించడం ఎందుకు
Also Read: కావ్య బుట్టలో పడిపోయిన తింగరి అత్త అపర్ణ- కొడుకు చెంప పగలగొట్టిన రుద్రాణి
విక్రమ్: తను ఈ ఇంటి పెద్ద కోడలు ఆఅ మాత్రం జాగ్రత్త ఉండకపోతే ఎలా
సంజయ్: ముందు పూజ చేసుకోండి
విక్రమ్: నాకు పూజ చేసే మూడ్ లేదు దివ్యని చేసుకోండి
పంతులు: డాక్యుమెంట్స్ ఎక్కడికి పోవు ఇంట్లోనే ఉంటాయి. ఒక కాగితం మీద ఓం అని రాస్తాను డాక్యుమెంట్స్ దొరికిన తర్వాత పూజ చేసిన కాగితం దానికి జత చేయండి సరిపోతుంది అనేసరికి పూజ చేస్తారు. తన ప్లాన్ ఫెయిల్ అయ్యిందని జానూ కోపంగా ఉంటుంది. అటు ఇంట్లో తులసి వినాయకపూజ చక్కగా జరుగుతుంది. నందు పూజ పనులు బాగా చేశాడని మెచ్చుకుంటుంది. విక్రమ్ కోపంగా దివ్యని ఆశీర్వదించకుండా వెళ్ళిపోతాడు.