Gruhalakshmi October 12th: నందుని పిచ్చివాడిని చేసి ఆడిస్తున్న లాస్య- విక్రమ్, జానూ పెళ్లికి ఒకే చెప్పిన దివ్య!
Gruhalakshmi Serial Today Episode: లాస్య రీ ఎంట్రీ ఇవ్వడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
Intinti Gruhalakshmi Latest Episode: నందు నిద్రపోతుంటే రత్నప్రభ ఫోన్ చేస్తుంది. హనీని ఇంటికి పంపించకపోతే ప్రమాదం జరుగుతుందని హెచ్చరించినా ఏమి పట్టనట్టు గురక పెట్టి నిద్రపోతున్నావా? ఎలా నిద్రపడుతుంది కాస్త కూడ భయం అనిపించలేదా అంటుంది. ఎంత చెప్పినా కూడ తులసి కన్వీన్స్ అవడం లేదని చెప్తాడు.
రత్నప్రభ: నీకున్న ఓపిక నాకు లేదు. తులసి నీ మాట వినకపోతే ఏం చేస్తావ్. బలవంతంగా హనీని తులసి నుంచి వేరు చేసి నాకు అప్పగిస్తావా? నీకు అంత దమ్ము ఉంటే ఇప్పుడే చేసేవాడివి. జీవితకాలం టైమ్ ఇచ్చిన నువ్వు తులసిని కన్వీన్స్ చేయలేవు. నావి ఉత్తుత్తి బెదిరింపులు కావు. మీ అమ్మని, హనీని తీసుకుని తులసి గుడికి వెళ్ళింది. ఇంకొద్ది క్షణాల్లో వాళ్ళు ఆయుష్హు తీరబోతుంది, వెళ్లి వాళ్లని కాపాడుకో చూద్దాం, బుద్ధిగా చెప్పినప్పుడు వినకపోతే ఇలాగే ఉంటుంది. మీ వాళ్ల మీద ఆశలు వదులుకో.
లాస్య: ఈ భయమే నందులో నేను చూడాలని అనుకుంది. కాస్త బ్రేక్ తీసుకున్నా ఇక నుంచి బ్రేకింగ్ న్యూస్ లు ఇస్తూనే ఉంటాను.
Also Read: కొత్త డ్రామాకి తెరతీసిన స్వప్న- కావ్య ప్రేమలో రాజ్, క్షమాపణలు చెప్పిన కనకం
నందు కంగారుగా పరంధామయ్యని పిలిచి తులసి వాళ్లు ఎక్కడికి వెళ్లారని అడుగుతాడు. గుడికి వెళ్లారని చెప్పేసరికి కంగారుగా తనకి ఫోన్ చేస్తాడు. ఏమైంది అంత కంగారుపడుతున్నావ్ అంటే తులసి వాళ్లు ప్రమాదంలో ఉన్నారని చెప్పేసి వెళ్లిపోతాడు. ముందు ముందు కథ నడిపించాలని లాస్య అనుకుంటుంది.
లాస్య: నన్ను ఒంటరిని చేసిన నందు మీద పగ తీర్చుకోవాలి. టార్గెట్ నెంబర్ 2 తులసి నుంచి నందుని శాశ్వతంగా వేరు చేయాలి. నాకు దగ్గర అవడం తప్ప నందుకి వేరే మార్గం లేకుండ చేయాలి.
హనీ గుడిలో తన తాతయ్య కోసం ఎదురుచూస్తుంది. అంతగా చూడాలని అనిపిస్తే మీ తాతయ్యతో ఇంటికి వెళ్ళవచ్చు కదా అనసూయ అంటుంది. కానీ తులసి మాత్రం హనీని పంపించనని అంటుంది. నందు టెన్షన్ గా వెళ్తుంటే రత్నప్రభ మళ్ళీ కాల్ చేస్తుంది. హడావుడిలో తప్పుగా చెప్పాను. తులసి వాళ్లు రామాపురం గుడికి వెళ్లారు. వెళ్సి కాపాడుకో అంటుంది. నందుని పిచ్చివాడిని చేసి గుడులన్నీ తిప్పిస్తుంది. తులసి వాళ్లు గుడిలో పూజ చేసుకుని బయటకి వస్తారు. సరిగా అదే టైమ్ కి రౌడీలు, నందు వస్తారు. నందుని చూసి రౌడీలు పారిపోతారు.
నందు: అసలు బుద్ధి ఉందా? ఏ గుడికి వెళ్తున్నారో చెప్పే పని లేదా?
తులసి: ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు.
నందు: మీరు చెప్పా పెట్టకుండా బయట తిరగొద్దు.
రాజ్యలక్ష్మి ఇంట్లో విక్రమ్ రచ్చ జరుగుతుంది. దివ్య కావాలని విక్రమ్ ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిందని జానూ జీవితం నాశనం చేయాలని ఇలా చేసిందని బసవయ్య నోరు పారేసుకుంటాడు. దివ్య మాత్రం తన భర్త తప్పు చేయలేదని వెనకేసుకొస్తుంది.
దివ్య: ఎందుకు జానూని హద్దులో పెట్టుకోలేదు
రాజ్యలక్ష్మి: చనువు జానూ మాత్రమే కాదు విక్రమ్ కూడా ఇచ్చాడు. వాడు ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటాడు అనుకోలేదు.
విక్రమ్: తాగిన మత్తులో ఉన్నా ఏం జరిగిందో గుర్తు రావడం లేదు.
దివ్య: తాగిన మత్తులో విక్రమ్ ఉంటే పెళ్లి కాని ఆడదానివి నీ జాగ్రత్తలో నువ్వు ఉండవా. విక్రమ్ అసలు నీకు మందు అలవాటు లేదు నీతో తాగించింది ఎవరు?
జానూ: అయినా మందు తాగడంలో తప్పు ఏముంది ఇది కల్చర్.
Also Read: అంతా ప్రేమమయం - నిజం తెలుసుకుని వసుకి ప్రామిస్ చేసిన రిషి!
దివ్య: ఎందుకు విక్రమ్ ని బ్లెమ్ చేస్తున్నారు?
బసవయ్య: నా కూతురికి న్యాయం చేయమని అడుగుతున్నా.
రాజ్యలక్ష్మి: జరిగిన తప్పు సరి చేస్తాను. ప్రసూనాంబ పసుపు తాడు తీసుకురా..
దివ్య: నేను ఒప్పుకోను.
రాజ్యలక్ష్మి: నా రెండో కొడుకు తప్పు చేశాడని ప్రియ మెడలో తాళి కట్టించావ్. న్యాయం ఎవరికైనా న్యాయమే. జానూని విక్రమ్ కి రెండో భార్య చేయడం తప్పే కానీ తప్పడం లేదు. నా కొడుకు తాగిన మత్తులో చేసిన తప్పు సరదిద్దుకోవాల్సిందే, నువ్వు ఒప్పుకోవాల్సిందే.
దివ్య: సరే ఒప్పుకుంటాను. నా భర్త చేసిన తప్పుకి శిక్ష నేను అనుభవిస్తాను కాకపోతే శిక్ష పడాలి అంటే నేరం రుజువు కావాలి కదా.