Gruhalakshmi July 25th: 'గృహలక్ష్మి' సీరియల్: తులసమ్మ ఇంట్లో వెల్లివిరిసిన నవ్వులు- రాజ్యాలక్ష్మి ముందే మొగుడ్ని లాక్కుని వెళ్ళిపోయిన దివ్య
రాజ్యలక్ష్మి ఇంట్లో లాస్య పాగా వేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
నందు పుట్టినరోజని అత్తామామలకు గుర్తు చేసేందుకు తులసి తెగ తిప్పలు పడుతుంది. ఎంత చెప్పినా కూడ ముసలోళ్ళు చెప్పకపోవడంతో రాములమ్మ నందు పుట్టినరోజని చెప్తుంది. మీ అబ్బాయి పుట్టినరోజు కదా ఆయనకి ప్రత్యేకంగా ఏమైనా చేయమంటారా? అని అడుగుతుంది. అడగటానికి నందు బాబు ఇంట్లో లేడని పొట్ట తగ్గించుకోవడం కోసం రోడ్ల మీద పడ్డాడని రాములమ్మ చెప్తుంది. ఇక మాజీ మొగుడు పుట్టినరోజని బట్టలు తెప్పిస్తుంది తులసి. వాటిని అత్తమామలని ఇవ్వమని అడుగుతుంది. దీంతో వాళ్ళు సరే అంటారు. నందు జాగింగ్ చేయలేక తనని తాను తిట్టుకుంటాడు. విక్రమ్ తో మాట్లాడటానికి అసలు కుదరడం లేదని లాస్య రాజ్యలక్ష్మితో చెప్పుకుని వాపోతుంది. రేపో మాపో దివ్య మనవడిని తీసుకొచ్చి చేతిలో పెడుతుందేమో అని భయపడతారు. ఈలోపు విక్రమ్ ఆస్తి చేజిక్కించుకుని ఇంట్లో నుంచి తరిమేయాలని అనుకుంటారు.
Also Read: ముకుంద కుట్రతో సన్మానం నుంచి వెళ్ళిపోయిన మురారీ - కృష్ణ దూరం కాక తప్పదా?
విక్రమ్ రాగానే లాస్య హనీ మూన్ ట్రిప్ గురించి మొత్తం చెప్తుంది. అది విని తెగ సంతోషాపడతాడు. అప్పుడే దివ్య వస్తే మన ప్రోగ్రామ్ డీటైల్స్ చెప్తుందని చక్కగా ప్లాన్ చేసిందని విక్రమ్ అంటాడు. తమకి వేరే ప్రోగ్రామ్ ఉందని పుట్టింటికి వెళ్తున్నట్టు దివ్య చెప్పేసరికి ఇద్దరికీ ఫ్యూజులు ఎగిరిపోతాయి.
లాస్య: అదేంటి విక్రమ్ హనీ మూన్ కి వెళ్లాలసింది రేపే కదా అత్తారింటికి వద్దని అనుకున్నాం కదా
దివ్య: అవును మూడు రోజులు ఉండటానికి కుదరదని వద్దని అనుకున్నాం. కానీ ఈరోజు మా నాన్న బర్త్ డే గ్రాండ్ గా సెలెబ్రేట్ చేద్దామని ప్లాన్ చేశాం
విక్రమ్: రాత్రి పార్టీ అవగానే వచ్చేస్తాం మీరేం కంగారు పడొద్దు. మీరు కూడా వస్తారా?
రాజ్యలక్ష్మి: లేదు మాకు పని ఉంది
దివ్య టైమ్ అవుతుందని చెప్పి విక్రమ్ చేతిని పట్టుకుని లాక్కుని వెళ్ళిపోతుంది. దివ్య తులసికి ఫోన్ చేసి ఇంటికి వస్తున్నాం, నాన్న పుట్టినరోజు కదా అంటుంది. ఇంట్లో చెప్పే వస్తున్నారు కదా అంటే అది విక్రమ్ డ్యూటీ తనకి సంబంధం లేదని దివ్య చెప్తుంది. ఇక నందు ఇంటికి వచ్చేసరికి ఎవరి పనుల్లో వాళ్ళు సీరియస్ గా ఉన్నట్టు నాటిస్తారు. పరంధామయ్య ఫోన్లో హ్యాపీ బర్త్ డే విషెష్ పెట్టి సర్ ప్రైజ్ చేస్తాడు. ఇక కొడుకుని పడిన కష్టాలు తలుచుకుని అనసూయ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. తనకి కుటుంబం అండగా ఉందని నందు తల్లికి ధైర్యం చెప్తాడు. ఇక తులసి తను కొన్న బట్టలు అనసూయ వాళ్ళ చేతుల మీదుగా ఇప్పిస్తుంది. ఇక రాములమ్మ కూడా విషెష్ చెప్పి కాకరకాయ రసం పెద్ద జగ్గుకి తీసుకొచ్చి తీసుకోమని అంటుంది. అది చూసి ఫేస్ అదోలా పెట్టి కష్టపడి తాగేస్తాడు.
Also Read: కావ్యని పాతాళానికి తొక్కేసిన రాజ్ - స్వప్నని ఇంట్లో నుంచి గెంటేస్తారా?
నందు తులసి తెచ్చిన డ్రెస్ వేసుకుని పేపర్ అడ్డం పెట్టుకుని దొంగ చూపులు చూస్తూ ఉంటాడు. అది కాస్త రాములమ్మ గమనిస్తుంది. అప్పుడే విక్రమ్, దివ్య ఎంట్రీ ఇస్తారు. తండ్రిని కౌగలించుకుని విషెష్ చెప్తుంది. ఈరోజు ఏంటి ప్రోగ్రామ్ అంటుంది. కూతురు, అల్లుడు వచ్చారు అదే తనకి పెద్ద పండగని నందు అంటాడు.
దివ్య: నీ బర్త్ డే గ్రాండ్ గా సెలెబ్రేట్ చేద్దామని వచ్చాం. నీ క్లోజ్ ఫ్రెండ్స్ ని పిలవండి గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుందాం
నందు: వద్దు ఇంట్లో పార్టీ చేసుకుందాం
మాధవి: అంటే చెల్లెల్ని కూడా పిలవవా
ఇక అందరూ సంతోషంగా మాట్లాడుకుంటారు. పార్టీ సెలెబ్రేట్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తానని విక్రమ్ చెప్తాడు. పార్టీకి ఏ డ్రెస్ వేసుకోవాలా అని చూస్తూ ఉంటాడు. దివ్య వచ్చి కొత్త డ్రెస్ ఇచ్చి వేసుకోమని ఇస్తుంది.