Gruhalakshmi April 27th: షాకింగ్ ట్విస్ట్, దివ్యని ఉద్యోగానికి వెళ్ళకుండా చేసిన రాజ్యలక్ష్మి- లాస్య గుట్టురట్టు
దివ్య, విక్రమ్ పెళ్లి జరగడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
వ్రతం అవగానే మొదటి రాత్రి జరిపిద్దామని అన్నారు కదా. మా పంతులుని అడిగితే ఈ రాత్రికే మంచి ముహూర్తం ఉందని చెప్పారు మేము అన్నీ ఏర్పాట్లు చేసుకున్నామని తులసి అంటుంది. అంటే ఏంటి నీ ఉద్దేశం మా అక్క కావాలని పంతులతో ఇలా చెప్పించిందని అనుమానిస్తున్నారా అని బసవయ్య అంటాడు. మా అమ్మ ఇప్పుడు ఏమన్నదని అందరూ విరుచుకుపడుతున్నారని దివ్య ఎదురుతిరుగుతుంది. లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోమని తులసి అంటే లేదు ఇక్కడే ఉంటానని చెప్తుంది. మావయ్య మీరు సైలెంట్ గా ఉండమని విక్రమ్ కూడా అడ్డు పడతాడు. ముహూర్తాలు మన చేతిలో లేవు కదా వాటి ప్రకారం మనం నడుచుకోవాలి ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది. ముహూర్తాలతో పని లేదు ఈరోజు జరిపిద్దామని పెద్దవాళ్ళతో చెప్పమనండి జరిపిద్దామని రాజ్యలక్ష్మి అంటుంది.
Also Read: విడాకుల పేపర్స్ ఇచ్చిన వసంత్- వేద, యష్ మళ్ళీ కలుసుకుంటారా?
నేను చెప్తున్నా జరిపిద్దామని నందు కోపంగా అంటాడు. మీ మాట కూడా ఆదేనా అంటే మీరు ఏం చెప్పినా ఎందుకు ఏమిటని అడగమని తులసి చెప్తుంది. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకి వస్తారు. అల్లుడు కోటీశ్వరుడని మురిసిపోతున్నారు వాడి ఇప్పుడు కింద కూర్చుంటే వాళ్ళ మొహాలు మాడిపోతాయని రాజ్యలక్ష్మి సంబరపడుతుంది. దివ్య అవమానంగా ఫీల్ అయి టేబుల్ మీద కూర్చోబెడుతుందని బసవయ్య అంటాడు. దివ్య వచ్చి టేబుల్ దగ్గర కూర్చుంటుంది. విక్రమ్ వచ్చి టేబుల్ మీద కాకుండా పక్కన పీట వేసుకుని నేల మీద కూర్చుంటాడు. అది చూసి దివ్య కుటుంబం షాక్ అవుతుంది. రాజ్యలక్ష్మి నవ్వుకుంటుంది.
దివ్య: ఒక్కడివే కింద కూర్చున్నావ్ ఏంటి
విక్రమ్: నాకు ఇది అలవాటే
నందు: కొత్త జంట పక్కపక్కన కూర్చుని తినాలి ఇలా వేరువేరుగా కాదు
బసవయ్య; ఎందుకు నిజం దాచడం చెప్పేయ్. మా మేనల్లుడి దేవుడి కంటే ఎక్కువగా అమ్మని ఆరాధిస్తాడు. అమ్మ తర్వాత ఎవరైన. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాగోలేదు. జీవితాంతం అలా నేల మీద కూర్చుని భోజనం చేస్తానని మొక్కుకున్నాడు అందుకే అలా
అల్లుడు కింద కూర్చుని భోజనం చేస్తుంటే మేము తినలేము తర్వాత తింటామని తులసి బాధగా చెప్తుంది. దివ్య కూడా వెళ్ళి విక్రమ్ పక్కనే కూర్చుంటుంది. ఇదేంటి రెచ్చగొడుతున్నా రెచ్చిపోకుండా విక్రమ్ కి వలేస్తున్నారని రాజ్యలక్ష్మి మనసులో అనుకుంటుంది. తులసి వాళ్ళు కారులో వెళ్తూ కూతురి జీవితం గురించి మాట్లాడుకుంటారు. దివ్య స్థానంలో వేరే ఎవరైనా ఉంటే అరిచి గోల చేసేవాళ్ళు కానీ తను మాత్రం భర్త దగ్గరకి వెళ్ళి భోజనం చేసిందని పరంధామయ్య మెచ్చుకుంటాడు. ఫస్ట్ నైట్ జరగకుండా రాజ్యలక్ష్మి అడ్డుపడుతుందేమోనని నందు అనుమానపడతాడు. దీని గురించి ఆలోచిస్తూ నందు ఎదురుగా వచ్చిన కారుని చూసుకోకుండా డ్రైవ్ చేస్తాడు. నందు ఇంట్లోకి వచ్చి కళ్ళు తిరిగి పడబోతాడు. ఎప్పుడు లేనిది ఇలా జరిగింది ఏంటి అక్కడ ఏమైనా గొడవ జరిగిందా అని అనుమానంగా అడుగుతుంది. జరగాలని కోరుకుంటున్నావా అని అనసూయ దంపతులు గడ్డి పెడతారు.
Also Read: కృష్ణ తలకి గన్ గురిపెట్టిన భవానీ- మురారీ బాధ తీరే దారి లేదా?
దివ్య రాజ్యలక్ష్మి దగ్గరకి వస్తుంది. రేపటి నుంచి హాస్పిటల్ కి వెళ్తాను డ్యూటీలో జాయిన్ అవుతానని అడుగుతుంది. కాళ్ళ పారాణి ఆరకముందే డ్యూటీ ఏంటని అంటారు. పదహారు రోజుల పండగ అయ్యేంత వరకు ఇంటి గడప దాటకూడదని చెప్తుంది.