By: ABP Desam | Updated at : 27 Apr 2023 07:39 AM (IST)
Image Credit: Disney Plus Hotstar/ Star Maa
నేను లేకపోయినా నీకు ఏ ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు చేశాను. నీకు ఏం కావాలన్నా వసంత్ ని అడుగు చేస్తాడు. ఖుషి, అమ్మానాన్న జాగ్రత్త వాళ్ళకి నువ్వే ధైర్యం చెప్పాలి. నువ్వు సంతోషంగా ఉండాలి. అలాగే నీ లైఫ్ బాగుండాలని అంటాడు. అప్పగింతల్లా మాట్లాడుతున్నారు ఏంటి ఏమైంది మీకు అని వేద ఆశ్చర్యంగా అంటుంది. యష్ వేద కన్నీళ్ళు తుడిచి ఎప్పటికీ కన్నీళ్ళు పెట్టుకొనని నాకు మాట ఇవ్వమని అడుగుతాడు. మాట ఇచ్చి భర్తని కౌగలించుకుంటుంది. విన్నీకి అభిమన్యు ఫోన్ చేసి యష్ అమెరికాకి పారిపోతున్నాడంట కదా, ఆఫీసు మొత్తం వసంత్ కి అప్పగించి కాసేపటిలో ఫ్లైట్ ఎక్కబోతున్నాడని చెప్పేసరికి విన్నీ షాక్ అవుతాడు.
అభి: ఫ్యామిలీ అందరినీ కన్నాకూతురితో సహా అమెరికా వెళ్తున్నాడంట కదా పర్మినెంట్ గా అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడంట. కారణం మాత్రం నువ్వే వేద విషయంలో వాడిని కెలికావ్. వాడి జాతకమే అంత అప్పట్లో నేను మాళవికని ఇప్పుడు నువ్వు వేదని. రెండో పెళ్ళాని కూడా వదిలేసి పారిపోతున్నాడు. వాడు పోతే పోయాడు నువ్వు జాగ్రత్తగా చూసుకో
Also Read: 'ఇంట్లో ఇల్లాలు, వీధిలో ప్రియురాలా' అంటూ నందుకి అవమానం- ఫస్ట్ నైట్ జరగకుండా అడ్డుపడిన రాజ్యలక్ష్మి
ఆ మాటలకు షాకైన విన్నీ వెంటనే వేద దగ్గరకి బయల్దేరతాడు. వసంత్ అసలు నిజం వదినకి చెప్పి తీరాలని మనసులో అనుకుంటాడు. రత్నం వాళ్ళు యష్ కి సెండాఫ్ ఇవ్వడానికి ఎయిర్ పోర్టుకి ఎవరూ రావద్దని చెప్తాడు. పైకి నేను మామూలుగా కనిపించినా లోలోపల చాలా కంట్రోల్ చేసుకుంటున్నా. మిమ్మల్ని వదిలేసి అంత దూరం వెళ్ళడం ఈజీ కాదు కదా. నేను వెళ్తుంటే మీరు బాధపడుతూ ఏడుస్తారు అది చూసి నేను తట్టుకోలేనని ఎమోషనల్ అవుతాడు. సరే మేము ఇక్కడే బాయ్ చెప్తామని అంటారు. యష్ వెళ్లబోతుంటే ఇంకొక్కసారి ఆలోచించమని అడుగుతాడు. నువ్వు తిట్టినా సరే నేను నిజం చెప్పేస్తానని అంటే యష్ సీరియస్ అవుతాడు. ఏమైంది వసంత్ ఎప్పడూ లేనిది ఆయనకి ఎదురు చెప్తున్నావ్. నువ్వు ఏం చెప్పినా నేను వినను. ఆయన డెసిషన్ ఫైనల్. కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నారని విషయం తెలియకుండా యష్ ని వెనకేసుకొస్తుంది.
యష్ వెళ్తూ గుమ్మం దగ్గర పడబోతుంటే వేద పరుగున వచ్చి పట్టుకుంటుంది. యష్ వెళ్ళిపోతాడు. ఏమైంది ఈ యశోధర్ కి మొత్తం క్లారిఫై చేశాను కదా. అటువంటిది తన విషయంలో ఎలా ఈ నిర్ణయం తీసుకున్నాడు. వేద విషయంలో పాపం చేస్తున్నావని విన్నీ అనుకుంటాడు. వసంత్ విడాకుల పేపర్లు తీసుకుని వేద దగ్గరకి వచ్చే టైమ్ కి విన్నీ ఎంట్రీ ఇస్తాడు. యష్ మీ అందరికీ అబద్ధం చెప్పాడని అనేసరికి అందరూ షాక్ అవుతారు.
విన్నీ: యశోధర్ పది రోజుల్లో వస్తానని చెప్పి అందరినీ మోసం చేశాడు నిజానికి తను ఎప్పటికీ తిరిగి రాడు శాశ్వతంగా అమెరికా వెళ్లిపోతున్నాడు. ఇక్కడ ఆఫీసు వర్క్ మొత్తం వసంత్ కి హ్యాండోవర్ చేశాడు
వేద: వసంత్ నిజమా ఇదంతా అసలు ఏం జరిగింది చెప్పు
Also Read: కృష్ణ తలకి గన్ గురిపెట్టిన భవానీ- మురారీ బాధ తీరే దారి లేదా?
వసంత్: నన్ను క్షమించు వదిన ఇందాక నేను చెప్పబోయింది ఇదే యష్ చెప్పనివ్వలేదు. ఇంకోక విషయం కూడా చెప్పాలి యష్ నీకు డైవర్స్ పేపర్స్ ఇచ్చాడని వాటిని చూపిస్తాడు
వేద జరిగినవన్నీ తలుచుకుని ఏడుస్తుంది. వెంటనే అందరం వెళ్ళి యష్ ని వెనక్కి తీసుకుని వద్దామని మాలిని వాళ్ళు అంటారు. ఫ్లైట్ కి ఇంకా టైమ్ ఉంది వెళ్దాం పద అంటారు. ఇది నా భర్తకి నాకు సంబంధించినది. నేను ఒక్కదాన్నే వెళ్తాను. మాట్లాడాల్సింది మాట్లాడి తేల్చుకుంటానని వేద ఎయిర్ పోర్ట్ కి బయల్దేరుతుంది.
‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్
Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!
ప్రభాస్ తనలో రాముడిని బయటకు తెచ్చారు, నేటితరానికి ఈ మూవీ అవసరం: చిన్న జీయర్ స్వామి
రామ్ చరణ్ సినిమా కోసం 'RRR' ఫార్ములాను ఫాలో అవుతున్న బుచ్చిబాబు!
వివాదంలో ‘2018’ మూవీ - జూన్ 7 నుంచి థియేటర్స్ బంద్, ఎందుకంటే..
Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్ క్యాలెండర్ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!
Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక
Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!
Kakinada MP Vanga Geetha: వైసీపీ ఎంపీ వంగా గీత నుంచి ప్రాణహాని! స్పందనలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఆడపడుచు