Eto Vellipoindi Manasu End Today: 'ఏటో వెళ్ళిపోయింది మనసు' సీరియల్‌కు సడన్‌గా ఎండ్ కార్డ్... మగధీర కాన్సెప్ట్ తీసుకుని 383 ఎపిసోడ్‌లకు ముగించేశారు
Star Maa Serial Eto Vellipoindi Manasu: స్టార్ మా ఛానల్ సంచలన నిర్ణయం తీసుకుంది. 'ఏటో వెళ్ళిపోయింది మనసు'కు ఎండ్ కార్డు వేసింది. ఏప్రిల్ 19తో ఆ సీరియల్ రన్ ముగిసింది.

తెలుగు బుల్లితెర వీక్షకులకు స్టార్ మా ఛానల్ (Star Maa Telugu Channel) షాక్ ఇచ్చింది. గత 64 వారాలుగా టెలికాస్ట్ అవుతున్న 'ఎటో వెళ్లిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu Serial)కు ఎండ్ కార్డు వేసింది. ఈ రోజు (ఏప్రిల్ 19)తో ఆ సీరియల్ రన్ ముగిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే...
ఎటో వెళ్లిపోయింది మనసు...
'స్టార్ మా'లో ఇక ఉండదు బాబు!
సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు మధ్యాహ్నం మూడున్నర గంటలకు 'స్టార్ మా'లో టెలికాస్ట్ అయ్యే సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు'. ఏప్రిల్ 19తో ఈ సీరియల్ 383 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. 'కార్తీక దీపం 2 నవ వసంతం', 'ఇల్లు ఇల్లాలు పిల్లలు', 'బ్రహ్మముడి' తరహాలో ఈ సీరియల్ భారీ హిట్ కాకపోయినా... కొంత ఫ్యాన్ బేస్ అయితే సొంతం చేసుకుంది. అటువంటి సీరియల్ అర్ధాంతరంగా ఈ రోజుతో ముగిసింది. ఆ సీరియల్ 383వ ఎపిసోడ్ చివరి ఎపిసోడ్.
'మగధీర' కాన్సెప్ట్ తీసుకుని...
మధ్యలోనే వదిలేసి షాక్ ఇచ్చారు!
Eto Vellipoindi Manasu Serial Concept: 'ఎటో వెళ్లిపోయింది మనసు' సీరియల్ కథ విషయానికి వస్తే... ఇది పునర్జన్మల నేపథ్యంలో సాగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే... 'మగధీర' తరహా కాన్సెప్ట్ అన్నమాట. వెండితెరపై మాత్రమే కాదు బుల్లితెరపై కూడా పునర్జన్మల కాన్సెప్ట్ సూపర్ హిట్. జీ తెలుగు సూపర్ హిట్ సీరియళ్లలో ఒకటైన 'ప్రేమ ఎంత మధురం' కూడా పునర్జన్మల నేపథ్యంలో రూపొందిన ధారావాహిక.
Also Read: పంది, బర్రెతో కంపేరిజన్... విడాకులు ఇవ్వలేదా? బాడీ షేమింగ్ చేసే ఫ్రెండ్స్ వద్దు... అలేఖ్య అక్క సుమ
'ఎటో వెళ్లిపోయింది మనసు' కథ విషయానికి వస్తే... గత జన్మ కాన్సెప్ట్ తీసుకుని సీరియల్ స్టార్ట్ చేశారు. హీరో మరణించిన 20 ఏళ్ల తర్వాత హీరోయిన్ కూడా మరణిస్తుంది. ఇద్దరూ మళ్లీ ఈ జన్మలో పుడతారు. హీరోకి గత జన్మ గుర్తుకు వస్తుంది. అయితే తనకు గుర్తు వచ్చినట్లు ఎక్కడా బిహేవ్ చేయలేదు. హీరోయిన్ విషయానికి వస్తే ఆవిడకు గత జన్మ అసలు గుర్తుకు రాలేదు. ఈ జన్మలో ఆమెకు గతం గుర్తుకు రాకుండా కథను అర్ధాంతరంగా ఆపేశారు. కథానాయికకు గత జన్మ గుర్తు రాకుండా సీరియల్ ఎండ్ కార్డు పడటం వల్ల బుల్లితెర వీక్షకులు తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మాత్రం దానికి సీరియల్ తీయడం ఎందుకు అంటూ విమర్శలు చేస్తున్నారు.
Also Read: మూడు నెలలుగా మిస్సింగ్... ఇప్పుడు శవమై కనిపించాడు... పాతికేళ్లు నిండక ముందే ఇలా జరగడంతో...





















