Ennenno Janmalabandham March 8th: బెస్ట్ హజ్బెండ్ గురించి తెలిసి మురిసిన వేద- వసంత్ ని ట్రాప్ లో పడేసేందుకు మాళవిక స్కెచ్
వసంత్ గతం గురించి బయట పడటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
పెళ్లి మండపంలో వేదమంత్రాల మధ్య మళ్ళీ వసంత్, చిత్రకి పెళ్లి చేయాలని సులోచన వాళ్ళు నిర్ణయిస్తారు. దీంతో అందరూ సంతోషిస్తారు. యష్ వేద దగ్గరకి వెళ్ళి థాంక్స్ చెప్తాడు. సమస్యని అర్థం చేసుకుని పరిష్కరించావ్ అని అంటాడు. మన ఇద్దరం అండగా ఉన్నంత వరకు వసంత్, చిత్రని ఏ శక్తి వేరు చేయలేదని వేద చెప్తుంది. అందరూ హోలీ సంబరాల్లో మునిగి తేలుతూ ఉంటారు. పెళ్లి తర్వాత కూడా మన జీవితం కలర్ ఫుల్ గా ఉండాలని చిత్ర వసంత్ ని కోరుకుంటుంది. ఖుషి రంగులు పూసి వేదకి హోలీ శుభాకాంక్షలు చెప్తుంది. నీతో అమ్మ అని పిలిపించుకోవడం ఆనందంగా ఉందని వేద మనసులో అనుకుంటుంది. అందరూ ఒకరికొకరు రంగులు పులుముకుంటూ సంతోషంగా ఉంటారు.
అందరూ కింద హోలీ చేసుకుంటున్నారు నువ్వు కూడా వెళ్ళవచ్చు కదా అని యష్ ని రత్నం అడుగుతాడు. కానీ యష్ మాత్రం తనకి రంగులు అంటే అలర్జీ అని చెప్తాడు. వైట్ డ్రెస్ వేసుకున్నావ్ జాగ్రత్త రంగులు కొట్టేస్తారని రత్నం అంటే అంత ధైర్యం ఎవరికి ఉంటుంది, ఇదే డ్రెస్ వేసుకుని కిందకి వెళ్ళి మళ్ళీ ఒక్క రంగు కూడా పడకుండా పైకి వస్తానని చెప్తాడు. బెస్ట్ హజ్బెండ్ ఎక్కడ అని శశిధర్ వేద దగ్గరకి వచ్చి అడుగుతాడు. బెస్ట్ హజ్బెండ్ ఎవరు మన ఫ్లాట్స్ లో అలాంటి వాళ్ళు ఎవరు లేరని అంటుంది. నేను అనేది మీ ఆయన అనేసరికి వేద బిత్తరపోతుంది. యశోధర్ మొన్న తన దగ్గరకి వచ్చి బెస్ట్ హజ్బెండ్ ఎలా ఉండాలని అడిగాడని చెప్తాడు. ఖుషి కోసం నువ్వు యశోధర్ ని పెళ్లి చేసుకున్నావ్. కానీ ఇప్పుడు తనలో మార్పు వచ్చింది నీ గురించి ఆలోచిస్తున్నాడని అంటాడు.
Also Read: కావ్యని పెళ్లిచేసుకుంటానన్న రాజ్- పెళ్ళికాకుండానే ఒక్కటైన రాహుల్, స్వప్న
ఖుషికి తల్లిని అవడం కోసం యశోధర్ ని పెళ్లి చేసుకున్నా ఇప్పుడు భార్య స్థానం కోసం ఆశపడుతున్నా తనలో కూడా మార్పు వస్తుందని ఆశిస్తున్నా. ప్రతి భార్యకి భర్త మీద ఉన్న ఒక కంప్లైంట్ ఏంటో తెలుసా? భార్య మీద కోపం, అలక, ప్రేమ ఏదో ఒకటి ఉండాలని శ్రద్ధ చూపించాలని కోరుకుంటారని చెప్తుంది. అయితే నువ్వు అదృష్టవంతురాలివి నీ భర్తకి నీ మీద శ్రద్ద వచ్చిందని చెప్తాడు. అది విని వేద సంతోషిస్తుంది. మా శ్రీవారు ముద్దు పెట్టింది ప్రేమతోనే, మీరు మారుతున్నారు. నాకు తెలుస్తుంది. థాంక్యూ శ్రీవారు. మీలో ఈ మార్పు గమనిస్తున్నా. మిస్టర్ యారగెంట్ మిమ్మల్ని మిసెస్ న్యూసెన్స్ జీవితంలోకి మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నానని అంటుంది. మాళవిక సంతోషంగా రంగులు తెచ్చి అభికి పూస్తుంది. అక్క మన పెళ్లి జరగాలంటే మీ పుట్టింటి వాళ్ళు ఎవరో ఒకరు రావాలని కండిషన్ పెడుతుంది నాకు నిన్ను ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందామా అని ఎదురుచూస్తున్నా, మీ తమ్ముడిని నీ దారిలోకి తెచ్చుకోవాలని మాళవికని అభి రెచ్చగొడతాడు.
Also read: లాస్యకి వార్నింగ్ ఇచ్చిన నందు- విక్రమ్ ని అపార్థం చేసుకున్న దివ్య
వసంత్ ని తన దారిలోకి తెచ్చుకోమని మాళవిక చేతికి గన్ ఇస్తాడు అభి. విన్నీ వచ్చి వేదకి కలర్స్ రాసి హోలీ శుభాకాంక్షలు చెప్తాడు. ఎవరికోసం చూస్తున్నావ్ మీ ఆయన కోసమా అంటాడు. అవును చుట్టూ ఎంతమంది ఉన్నా ఆయన లేకపోతే వెలితిగా ఉందని చెప్తుంది. ఖుషి వచ్చి డాడీకి రంగులు అంటే పడదని చెప్తుంది. ఇంతకముందు వేద లేనప్పుడు ఒక లెక్క ఇప్పుడు ఇంకొక లెక్క యష్ తిక్క కుదురుస్తానని అంటుంది.