Ennallo Vechina Hrudayam Serial Today May 8th: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: గాయత్రీ, అనంత్‌లను గెంటేసిన యశోద.. తల్లడిల్లిపోతున్న బాల!
Ennallo Vechina Hrudayam Today Episode గాయత్రీ తప్పు చేసిందని యశోద ఇంటి నుంచి గెంటేయడం అనంత్ కూడా వెళ్లిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ennallo Vechina Hrudayam Serial Today Episode గాయత్రీ ఆస్తి కోసం బాలని చంపాలని అనుకుందని వాసుకి, నాగభూషణం నింద వేస్తారు. గాయత్రీ డైరీలో బాలని చంపాలని గాయత్రీ రాసుకున్నట్లు ఉంటుంది. దాన్ని బాల తండ్రి చదువుతాడు. పాపం గాయత్రీ ఆ రాతలు చదివి షాక్ అయిపోతుంది. అందరూ అదంతా గాయత్రీ పనే అని అనుకుంటారు. నేనేం రాయలేదని గాయత్రీ ఎంత చెప్పినా ఎవరు వినరు. ఆ రాతలు ఎవరివి ఆ రైటింగ్ నీది కాదా అని వాసుకి అడుగుతుంది.
మత్తులో ఉన్న బాల పిన్ని పది సార్లు ప్రయత్నిస్తే నేను కూడా నీలా రాసేస్తా అని అంటాడు. గాయత్రీ తాను అలా రాయలేదు అని అంటుంది. అసలు అలాంటి ఆలోచనే లేదని అంటుంది. అనంత్ అందరితో గాయత్రీ ఎన్నటికీ అలా చేయదు. అన్నయ్యకు విషం పెట్టాలి అని కలలో కూడా అనుకోదు అని చెప్తాడు. నువ్వు నీ భార్య మాయలో ఉన్నావ్ కాబట్టి నీకు అలాగే అనిపిస్తుందని వాసుకి అంటుంది. పెద్దాయన వాళ్లతో మా పిల్లలకు మంచి బుద్ధులున్నాయ్మా ఆస్తి కోసం ఎప్పుడూ ఆశ పడరు అని చెప్తారు. ఇంతలో కొరియర్ వస్తుంది. వాసుకి అది తన ప్లానే అని భర్తకి సైగ చేస్తుంది.
కొరియర్ గాయత్రీకి వచ్చిందని జగదీష్ ప్రసాద్ అనే లాయర్ పంపారని చెప్తారు. బాల తండ్రి అది తీసుకొని చూసి షాక్ అయిపోతారు. ఏమైందని అందరూ అడిగితే పవర్ ఆఫ్ అటర్నీ కోసం గాయత్రీ ఎంక్వైరీ చేసి లాయర్‌ని అడిగితే ఆయన ఆ సెక్షన్లు అన్నీ గాయత్రీకి పంపారని అంటారు. ఇప్పటికైనా గాయత్రీ ఉద్దేశం అర్థమైందా అని వాసుకి వాళ్లు అంటారు. ఆ సాక్ష్యంతో గాయత్రీ నిజంగా తప్పు చేసిందని అందరూ అనుకుంటారు. త్రిపుర ఏడుస్తుంది. గాయత్రీ అలా చేయదు అని అంటుంది. అనంత్ కూడా ఎవరో గిట్టని వాళ్లు అలా చేశారు గాయత్రీ అస్సలు అలా చేయదు అని అంటాడు.
బామ్మ గాయత్రీతో అంత స్పష్టంగా నీ తప్పు ఉందని తెలుస్తుంది కదా అని అంటుంది. ఇక యశోద గాయత్రీతో చేయాల్సింది అంతా చేసి నీకు మళ్లీ రోషమా.. నా కొడుకు మీద ఇంత కుట్ర చేస్తావా.. నా కొడుకుని చంపాలి అనుకున్న నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు అని యశోద చెప్తుంది. పెద్దాయన నచ్చచెప్పబోతే నాకేం చెప్పకండి నా కొడుకు విషయంలో నేను ఏం వినను అని అంటుంది. గాయత్రీని ఉన్నపళంగా ఇళ్లు విడిచి వెళ్లిపో అని అంటుంది. నా భార్య ఇళ్లు విడిచి వెళ్లాల్సి వస్తే నేను తనతో పాటు వెళ్లిపోతా అని అనంత్ అంటాడు. అవన్నీ అబద్ధాలు అని నేను నమ్ముతున్నా నా భార్య ఎలాంటిదో నాకు తెలుసు అని అంటాడు. బాల మత్తులో అనంత్ నువ్వు వెళ్లొద్దురా నువ్వు వెళ్తే నేను ఉండలేనురా బామ్మ అనంత్‌ని వెళ్లొద్దని చెప్పు అని అంటాడు.
అనంత్ అన్నయ్యతో అన్నయ్య నా భార్య మీద నింద వేశారు తను ఎలాంటి తప్పు చేయలేదు అని నిరూపించే వస్తా అని గాయత్రీని తీసుకొని వెళ్లబోతే బామ్మ ఆపుతుంది. నీ భార్య ఏ తప్పు చేయలేదు అంటున్నావ్ కదా.. నువ్వు నీ భార్య అవుట్ హౌస్‌లో ఉండండి తను ఏ తప్పు చేయలేదు అని నిరూపించాకే ఈ ఇంట్లోకి రండి అంటుంది. అనంత్ సరే అని గాయత్రీని తీసుకొని వెళ్లిపోతాడు. రమాప్రభ, ఊర్వశి వాళ్లు నవ్వుకుంటారు. రాత్రి బాల బుంగమూతి పెట్టుకొని పాపం అనంత్, గాయత్రీ అవుట్ హౌస్‌కి వెళ్లిపోయారు నాతో ఆడుకునే వాళ్లు ఎవరు ఉంటారు అని ఏడుస్తాడు. యశోద అత్తయ్య కాళ్ల మీద పడి ఇంట్లో వెలతి కనిపిస్తుంది. బాలకి పెద్ద ప్రమాదం తప్పిపోయిందని సంతోషపడాలో అది చేసింది కోడలే అని బాధ పడాలో నా చిన్న కొడుకు ఇంటి నుంచి వెళ్లిపోయాడని బాధ పడాలో అర్థం కావడం లేదని ఏడుస్తుంది. ఆ సాక్ష్యాలు వల్ల నిజం అని నమ్మాం కానీ తర్వాత ఆలోచిస్తే తను అలాంటి మనిషి కాదని నాకే అనిపిస్తుందని అంటుంది. ఎవరైనా కావాలనే చేసిన దాన్ని నమ్మి నా కొడుకు కోడల్ని నేనే గెంటేశానేమో అని ఏడుస్తుంది.
బామ్మ యశోదని ఓదార్చుతుంది. కన్నయ్యకు గాయత్రీ వల్ల నిజంగా ప్రమాదం ఉంటే మనం చిన్న అవకాశం కూడా తీసుకోం కదా అలా చూసిన మనం గాయత్రీని పంపి కరెక్టే చేశాం అంటుంది. బాల అనంత్, గాయత్రీ బట్టలు తీసుకోకుండా వెళ్లిపోయారని వాళ్లకి ఇచ్చి వస్తానని అనుకుంటాడు. అవుట్ హౌస్ దగ్గర గాయత్రీ, అనంత్‌లు బాధగా కూర్చొని ఉంటారు. గాయత్రీ ఏడుస్తుంటే అనంత్ ఓదార్చుతాడు. నువ్వేం తప్పు చేయలేదు గాయత్రీ మా వాళ్లు తప్పు చేశారని అంటాడు. ఇంతలో బాల వచ్చి అనంత్, గాయత్రీలకు సంచుల్లో బట్టలు ఇస్తాడు. మీరు ఏం తెచ్చుకోలేదు కదా అంటాడు. ఇంతలో వాసుకి పెద్దగా అరిచి బ్యాగ్ తీసుకొని నిన్ను చంపాలి అనుకున్న వాళ్లకి నువ్వు సాయం చేస్తున్నావా అని అంటుంది. ఇక్కడ మంచి వాళ్లు అనంత్, గాయత్రీ చెడ్డ వాళ్లు నువ్వు అని అంటాడు. వాళ్లకి సౌకర్యాలు అన్నీ అందుబాటులో ఉంటే వాళ్లకి శిక్ష పడినట్లు ఎలా అని అత్తయ్యని అడుగుతుంది. నిజం నిరూపించుకోండి అంటే సౌకర్యాలు తీసుకొని ఎంజాయ్ చేయడం ఏంటి అని బామ్మ అడుగుతుంది. దానికి అనంత్ మేమేం ఏం మీ నుంచి ఆశించడం లేదు అన్నయ్య తెచ్చాడు అంటాడు. బాల తెస్తే తీసుకోవడానికి మీకు సిగ్గు ఉందా అని వాసుకి అడుగుతుంది. అనంత్, గాయత్రీ షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: చిన్ని రాజు కూతురని దేవాకి తెలిసిపోతుందా.. అన్న సంతోషం చూసి పొంగిపోయిన కావేరి!





















