Ennallo Vechina Hrudayam Serial Today May 7th: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: బాలకి విషం తాగించేసిన రమాప్రభ.. ఆస్తి కోసం గాయత్రీ కుట్రని అందరూ నమ్ముతారా!
Ennallo Vechina Hrudayam Today Episode గాయత్రీ బాలకి విషం తాగించిందని వాసుకి నింద మోపడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ennallo Vechina Hrudayam Serial Today Episode బాలకి పెళ్లి అయిన వరకు ఫస్ట్‌నైట్ వద్దని గాయత్రీ, అనంత్ అనుకుంటారు. ఉదయం లేచిన గాయత్రీ తమకు ఫస్ట్‌నైట్ అయిందని అనందరూ అనుకోవాలని జుట్టు పీక్కొని బయటకు వస్తుంది. త్రిపుర గాయత్రీని చూసి అప్పుడే లేచేశావేంటే త్వరగా రెడీ అయి రా ఇంటి కోడలు ప్రసాదం చేయాలంట అని అంటుంది.
గాయత్రీని చూసిన వాసుకి, నాగభూషణంలు అనవసరంగా తమ ప్లాన్ వేస్ట్ అయిపోయిందని తిట్టుకుంటారు. ఇంతలో అక్కడికి రమాప్రభ వచ్చి బాల, త్రిపుర, గాయత్రీ ముగ్గురకు ఒకే సారి స్కెచ్ వేసి పైకి పంపేద్దామని అంటుంది. ప్లాన్ ఏంటి అని వాసుకి అడుగుతుంది. దానికి రమాప్రభ అక్షయ తృతీయ రోజు కొత్త కోడలు లక్ష్మీ దేవికి ప్రసాదం చేస్తారు. గాయత్రీ ప్రసాదం చేస్తుంది కాబట్టి మనం టైం చూసి విషం కలిపేద్దామని అనుకుంటారు. గాయత్రీని, త్రిపురని గెంటేస్తారని అంటారు. ఐడియా ఇప్లిమెంట్ చేయాలని అనుకుంటారు.
అక్షయ తృతీయ పూజకు అన్నీ ఏర్పాట్లు పూర్తవుతాయి. పంతులు వచ్చి పూజ ప్రారంభిస్తారు. బామ్మ గాయత్రీకి పాయసం ప్రసాదం చేయమని చెప్తారు. బాల గాయత్రీతో నాకు పాయసం అంటే ఇష్టం ఎక్కువ చేయు గాయత్రీ అంటాడు. గాయత్రీ పాయసం తీసుకొని వచ్చి దేవుడి ముందు పెడుతుంది. ఇక అనంత్, గాయత్రీలు పూజలో కూర్చొంటారు. ప్రసాదంలో రమాప్రభ విషం కలిపేస్తుంది. పూజ తర్వాత పంతులు ప్రసాదం పంచమని అంటారు. గాయత్రీ, త్రిపుర అందరికీ ప్రసాదం ఇస్తారు. బాలకి ప్రసాదం ఇస్తున్న టైంకి గాయత్రీ కాళ్లలో రమాప్రభ కాలు పెట్టేస్తుంది. దాంతో కింద పడిపోతుంది. ఇక బాల కోసం మళ్లీ ప్రసాదం తీసుకురావడానికి గాయత్రీ వెళ్తుంది. బాల కోసం తీసుకొచ్చిన ప్రసాదంలో విషం కలిపి ఉండటంతో ఆ విషయం తెలియని గాయత్రీ బాలకి ఇస్తుంది.
బాల ఆ పాయసం తిని ఇబ్బంది పడతాడు. అందరూ కంగారు పడతారు. తర్వాత బాల కళ్లు తిరిగి పడిపోతాడు. బామ్మ, యశోద ఏడుస్తారు. డాక్టర్ వచ్చి చూసి విషం వల్ల పడిపోయినట్లున్నారని అంటారు. అందరూ షాక్ అయిపోతారు. హాస్పిటల్‌కి తీసుకెళ్లే టైం లేదని ముందు వాంతులు చేయించాలని అంటారు. దానికి త్రిపుర వెంటనే పరుగులు పెట్టి తన దగ్గర ఉన్న మూలికు కషాయం చేస్తుంది. వాసుకి వాళ్లు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ తనకు ఆ వైద్యం తెలుసు అని త్రిపుర తాగిస్తుంది. కషాయం తాగిన వెంటనే బాలకి వాంతులు అవుతాయి. తర్వాత డాక్టర్ చూసి బాలకి ప్రమాదం తప్పిందని అంటారు. కొద్ది సేపటి తర్వాత బాల కళ్లు తెరుస్తాడు. అంతా సంతోషిస్తారు.
బాల తనకు ఏమైందని అడిగితే ప్రసాదంలో ఎవరో విషం కలిపారని వాసుకి అంటుంది. అందరం తిన్నాం మనకు ఏం కాలేదు కదా అంటే బాల మీద మాత్రమే చేశారని తర్వాత ఆ ప్రసాదం తీసుకొచ్చిన గాయత్రీనే ఇదంతా చేసిందని వాసుకి, నాగభూషణం అంటారు. అందరూ షాక్ అయిపోతారు. నేను అలా ఎందుకు చేస్తానని గాయత్రీ అంటుంది. గాయత్రీ అలా ఎప్పటికీ చేయదు అని అనంత్ అంటాడు. గాయత్రీని ఒకసారి తప్పు పట్టి పెద్ద తప్పు చేశాం మరోసారి ఆ పని చేయొద్దని అంటారు. గాయత్రీ అలా చేయదు అని అందరూ నమ్ముతారు. కానీ వాసుకి మాత్రం నిరూపించాలని ప్రయత్నిస్తుంది. గాయత్రీకి సంబంధించిన డౌరీ తీసుకొస్తారు. అందులో గాయత్రీ ఆస్తికి వారసుడు బాలగారు అయితే నా పరిస్థితి ఏంటి నాకు చివరకు మిగిలేది ఏంటి అని బాలగారు లేకపోతే నా భర్త ఇంటికి వారసుడు ఆస్తులన్నీ మావే అని గాయత్రీ రాసినట్లు ఉంటుంది. అది చూసి అంతా షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథున జడలో పూలపెట్టిన దేవా.. భాను గుండె ముక్కలైపోయిందా!





















