Ennallo Vechina Hrudayam Serial Today March 18th: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: యశోదమ్మలా అదరగొట్టిన త్రిపుర.. రాక్షసుడిలా వచ్చేసిన గిరి!
Ennallo Vechina Hrudayam Today Episode బాల ఫ్యామిలీ మొత్తం నాటిక కోసం రావడం ఫణి అక్కడ టైం బాంబ్ ఏర్పాటు చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ennallo Vechina Hrudayam Serial Today Episode యశోద ఇంటి పని చేస్తుంటే బామ్మ వచ్చి నువ్వెందుకు పని చేస్తున్నావ్ యశోద అంటుంది. ఇక వాసుకి అక్క నువ్వు పని చేస్తే పనోలకు పని చెప్పకుండా జీతం ఇస్తామా అని అంటుంది. ముగ్గురు నవ్వుకుంటారు. ఇంతలో బాల, ఫణి, బాల తండ్రి అక్కడికి వచ్చి ఎవరి తల్లి కళ్లు వాళ్లు మూసి తీసుకెళ్లి మదర్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ముగ్గురితో కట్ చేయిస్తారు.
ముగ్గురు కొడుకుల సర్‌ఫ్రైజ్‌కి చాలా సంతోషపడతారు. బాల మంచి కొటేషన్ చెప్తాడు. నువ్వు చూపించిన ప్రేమలో కొంత అయినా నీకు చూపించి నీ రుణం తీర్చుకుంటానమ్మా అని అంటాడు. ఇక తర్వాత మీకు మరో సర్‌ఫ్రైజ్ ఉందని చెప్పిన బాల ఈవినింగ్ స్కూల్‌లో యశోద శ్రీకృష్ణుల నాటకం ఉందని అందరూ రెడీ అయిపోండి అంటాడు. ఫణి తండ్రితో ఈ రోజు వాడి పని అయిపోతుందని అక్కడే వాడి చావుకి ముహూర్తం పెట్టానని చెప్తాడు. మరోవైపు గిరిత్రిపుర కోసం రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. ఎంత వెతికినా దొరకదు. కోపంతో తన మనిషికి కొట్టేస్తాడు. సరిగ్గా అప్పుడే త్రిపుర యశోద గెటప్ వేసుకొని వ్యాన్‌లో వెళ్లడం చూస్తాడు. తిప్పు తిప్పు అని వ్యాన్ వెనక పరుగులు తీస్తాడు.
బాల ఫ్యామిలీ మొత్తం నాటక ప్రదర్శన దగ్గరకు వచ్చేస్తారు. ఫణి ఓ బొమ్మలో టైం బాంబ్ ఏర్పాటు చేస్తాడు. గిరి కూడా అక్కడికి వస్తాడు. నాటకం కోసం రెడీ అయిన త్రిపురని చూస్తాడు. ఫణి తల్లిదండ్రులు ఫణికి తన ప్లాన్ అడిగితే బొమ్మ చూపించి అందులోనే బాంబ్ పెట్టానని చెప్తాడు. బొమ్మ చాలా అడ్వాన్స్‌డు బొమ్మ అని దాన్ని పట్టుకొని తిరిగే వాళ్లే చనిపోతారని చెప్తాడు. ఫణి వాళ్లు మాట్లాడుకోవడం ప్రియ అనే పాప వినేస్తుంది. బాంబ్ బాంబ్ అని పాప అనడంతో ఫణి ఆ పాపని తీసుకెళ్లి స్టోర్ రూంలో పెట్టేస్తాడు. అమ్మా అమ్మా ప్రియ ఏడుస్తుంది. నాటకం మొదలవుతుంది. ఈ నాటిక ప్రదర్శనకు కారణం అయిన బాలకృష్ణ ఫ్యామిలీకి వెల్ కమ్ చెప్తారు. యశోదలా త్రిపుర నాటకం మొదలు పెడతారు.
శ్రీకృష్ణుడి అల్లరిని అందరూ యశోదకు కంప్లైంట్ ఇవ్వడం ఇలా యశోద కొడుకుని క్యూట్‌గా దండించడం నాటిక చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అందరూ కన్నుల విందుగా నాటిక చూస్తారు. ఆ నాటిక దగ్గరకు గిరి ఓ రాక్షసుడిలా గెటప్ వేసుకొని వస్తాడు. నాటిక మధ్యలోకి వచ్చేస్తాడు. శ్రీకృష్ణుడి గెటప్‌లో ఉన్న బాబు రాక్షసుడా మా అమ్మని వదిలేయ్ అని నాటికలో ఇన్వాల్స్ అయి డైలాగులు చెప్తుంటే గిరి ఆ బాబుని తోసేసి తన్నబోతే త్రిపుర గిరిని తోసేస్తుంది. వచ్చింది గిరి అని త్రిపురకు అర్థమైపోతుంది. త్రిపుర స్వామీ కాపాడు అనగానే కృష్ణుడు గిరిని ఒక్కటి తంతే గిరి గిలగిలా కొట్టుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీకి ఓ అవకాశం.. మనీషాకి తెలీకుండా HCG టెస్ట్ చేసేదెలా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

