Ennallo Vechina Hrudayam Serial Today February 7th: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన బాల.. త్రిపుర కష్టాన్ని తీర్చేది ఎవరు?
Ennallo Vechina Hrudayam Today Episode బాల పిన్ని బాబాయ్ డబ్బులు దొంగలించడం బాల అది చూసి ప్రశ్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ennallo Vechina Hrudayam Serial Today Episode త్రిపుర షేట్‌తో మాట్లాడి తల్లితో మాట్లాడాలని బతిమాలుతుంది. దాంతో షేట్ సరే అని త్రిపుర తల్లికి ఫోన్ ఇస్తాడు. త్రిపుర తల్లి ఏడుస్తుంది. త్రిపుర కూడా ఏడుస్తుంది. మన కష్టాలు తొలగిపోతాయని ఇలా వస్తే నేను నీకు భారం అయ్యానని అంటుంది. త్రిపుర తల్లితో నేను అంతా చూసుకుంటాను అమ్మా అని చెప్తుంది. ఇక షేట్ ఫోన్ లాక్కొని కట్ చేసేస్తాడు.
త్రిపుర తాతయ్యతో 15 లక్షలు కడితేనే అమ్మని పంపిస్తాను అన్నారని అమ్మని ఎలా కాపాడాలని ఏడుస్తుంది. ఆ మాటలు విన్న తాతయ్య, చాటుగా విన్న రమాదేవి షాక్ అయిపోతుంది. ఇక త్రిపుర ఈ విషయం గాయత్రీకి చెప్పొద్దని అంటుంది. రమాదేవి తనలో తాను గంగక్క లాక్ అయిందా ఈ విషయం అడ్డు పెట్టుకొని ఆడుకుంటానని అంటుంది. మరోవైపు బాల చిన్నాన్న పిన్నిలు.. నాగ భూషణం, వాసుకిలు రాత్రి మాస్క్‌లు వేసుకొని సైట్ కొనడానికి ఉంచిన డబ్బు దొంగతనం చేయడానికి వెళ్తారు. బామ్మ గదిలో డబ్బు సంచి చూస్తారు. ఇంతలో బామ్మ లేవడంతో వెనక్కి దాక్కుంటారు. బామ్మ నీరు తాగి మళ్లీ పడుకుంటుంది. ఇద్దరూ మెల్లగా వెళ్లి డబ్బు బ్యాగ్ తీసుకుంటారు. ఆరు బయటకు వెళ్లి గొయ్యి తీసి అందులో డబ్బు దాచేస్తారు. డబ్బు సంచి మీద ఇసుక కప్పుడానికి పార అడిగితే బాల వచ్చి పారలు ఇస్తాడు. డబ్బు ఉన్న బ్యాగ్ ఎందుకు భూమిలో పాతి పెడుతున్నావ్ అని బాల అడిగితే దానికి నాగభూషణం మనీ దాచిపెడితే మనీ ప్లాంట్ వస్తుంది. ఎక్కువ డబ్బు వస్తుందని అని చెప్తాడు. బాల అది విని వావ్ సూపర్ అని నీరు పోయమని అంటాడు. బాలకి ఏం చేప్పాలా అని మొగుడు పెళ్లాలు తికమకపడతారు.
త్రిపుర తల్లికి వచ్చిన సమస్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో గాయత్రీ వచ్చి ఇక్కడేం చేస్తున్నావు అక్క అని అడుగుతుంది. అమ్మకి ఫోన్ చేస్తుంటే అవడం లేదు అక్కా అంటే త్రిపుర అమ్మ ఫోన్ పోయిందని అంటుంది. అమ్మతో మాట్లాడాలి ఏమైనా నెంబరు ఉంటే ఇవ్వు అని అంటుంది. అమ్మని ఇప్పుడు ఇబ్బంది పెట్టొద్దని అంటుంది త్రిపుర. దాంతో త్రిపురని పడుకోడానికి గాయత్రీ తీసుకెళ్తుంది. ఇక ఉదయం అనంత్ బాల పెట్టిన లాస్ట్ చెక్ చూసి ఎమోషనల్ అవుతాడు. ఇదొక్కటే సెటిల్ చేయలేకపోయానని అంటాడు.
ఫ్లాష్ బ్యాక్
త్రిపురని తన తండ్రి బాల చిట్ ఫండ్ కంపెనీ ఆఫీస్‌కి తీసుకెళ్తాడు. త్రిపుర తండ్రి బాలతో మాట్లాడుతాడు. బాల ఆయనతో మీ చీటీ ఇప్పుడు పాడితే చాలా లాస్ వస్తుందని కొంచెం ఆగితే మంచి డబ్బు వస్తుందని అంటాడు. దాంతో త్రిపుర తండ్రి కూతురు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిందని ఇప్పుడు డబ్బు అవసరం అని అడుగుతాడు. దాంతో బాల 50 లక్షల చెక్కు మీద సంతకం పెట్టి ఇప్పుడు అయితే మీకు 41 లక్షలు మాత్రమే వస్తుందని చెప్పి బాగా ఆలోచించి కూతురు చదువు అంటున్నారు కదా మొత్తం 50 లక్షలు మీకు ఇస్తాను. కార్పొరేట్ కంపెనీ కింద మీకు సాయం అనుకోండి అని చెప్తాడు. త్రిపుర తండ్రి చాలా సంతోష పడతాడు. మొదటి సారి త్రిపుర, బాల అక్కడే ఉన్నా ఒకరిని ఒకరు చూసుకోరు. త్రిపుర తండ్రితో మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు కదా అని అడుగుతుంది.
అనంత్ ఆ చెక్ ఇప్పుడు చూసి ఆ ఆడ్రస్ కోసం ఎంత వెతికినా దొరకడం లేదు అన్నయ్య తల పెట్టిన ఈ కార్యం ఎలా అయినా పూర్తి చేస్తానని అంటాడు. నా కన్నయ్య చాలా మంచోడు.. గుణంలో రాముడు. త్యాగంలో కర్ణుడు బలంలో భీముడు అని ఇప్పుడు నా కన్నయ్యని బాలుడిన్ని చేసేశాడు ఆ దేవుడు అని ఏడుస్తుంది. ఇంతలో ఇంటికి ఆఫీస్ నుంచి శంకర్ వస్తాడు. ప్రతీ సంవత్సరం లిస్ట్‌డ్ బిజినెస్‌లో మీ షేర్ మెన్సన్ చేస్తూ ఫైల్ చేస్తున్నాం అని ఈ ఏడాది కూడా షేర్ పర్సంట్ డిటైల్స్ ఇస్తే మెన్షన్ చేస్తానంటారు. దాంతో అనంత్ తన ల్యాప్‌టాప్‌లో ఉన్నాయని తెచ్చి చెప్తానని అంటాడు. దాంతో ఒక్క సారిగా బాల అక్కర్లేదు అని ఏం కానట్లు అంటాడు. ఎప్పటిలా బాల రాజసంగా నడిచి వచ్చి శంకర్ ఎదుట కూర్చొంటాడు. మిస్టర్ శంకర్ మా డాడీ వాసుదేవ్ పేరు మీద 12 పర్సెంట్ మా అమ్మ యశోద పేరు మీద 8 పర్సెంట్ బామ్ మీద, పిన్ని, బాబాయ్, అనంత్ కృష్ణ పేరు 10 పర్సెంట్ మిగతా 48 పర్సెంట్ నా పేరు మీద ఉన్నాయి నా పేరు బాలకృష్ణ అని అంటాడు. అందరూ బిత్తర పోతాడు. నా కన్నయ్యలో మార్పు వచ్చిందని బామ్మ మురిసి పోతుంది. ఇక ఉన్నట్టుండి దేవాలో మార్పు వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది
Also Read: సత్యభామ సీరియల్: ఫస్ట్ నైట్ ఆటల్లో సత్యకి అవమానం.. చివరి నిమిషంలో మెలిక.. సంజయ్ ఆశలు అడియాసలేనా!





















