Ennallo Vechina Hrudayam Serial Today February 19th: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: త్రిపురకి వార్నింగ్ ఇచ్చిన గిరి.. బాలతో విషం తాగించేసిన ఫణి!
Ennallo Vechina Hrudayam Today Episode గిరిని పెళ్లి చేసుకోవద్దని గాయత్రీ అక్కని బతిమాలడం త్రిపుర చేసుకుంటానని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ennallo Vechina Hrudayam Serial Today Episode త్రిపుర ఫోన్ లిఫ్ట్ చేయలేదని గిరి త్రిపుర కోసం వెయిట్ చేస్తుంటాడు. ఇంతలో గాయత్రీ ఆఫీస్ నుంచి వచ్చి ఏం పనీ పాట లేదా మళ్లీ వచ్చావ్ అని గిరిని తిడుతుంది. ఇంతలో త్రిపుర వస్తుంది. గిరిని చూసి కంగారు పడుతుంది.
గిరి: నా ఫోన్ నువ్వు ఎందుకు ఎత్తలేదు.
త్రిపుర: ఆ టైంలో ఒక పేషెంట్‌కి ట్రీట్మెంట్ జరుగుతుంది. బిజీగా ఉండి ఎత్తలేదు.
గిరి: నువ్వు ఎంత బిజీగా ఉన్నా నా ఫోన్ లిఫ్ట్ చేయాలి.
గాయత్రి: ఏంటి మా అక్కని బెదిరిస్తున్నావ్. అక్క నువ్వు ఎవరికీ భయపడకు.
గిరి: ఇక నుంచి ఆ సేవలు ఆపేయ్. ఈ గిరికి కాబోయే పెళ్లాం బయటకు వెళ్లి ఎవరీకీ సేవలు చేయొద్దు.
త్రిపుర: సేవలు చేయడం పుణ్యం కదా.
రమాప్రభ: అల్లుడు చెప్పేది చేయాలి కదా అవన్నీ మానేయ్.
గిరి: ఇప్పుడు నుంచి నేను ఏం చెప్తే నువ్వు అది చేయాలి. నేను నిన్ను కాలు కింద పెట్టనివ్వకుండా మహారాణిలా చూసుకుందాం అనుకుంటే నువ్వు ఈ సేవలు అంటూ తిరగడం ఏంటి. ఈ చేతికి ఏమైంది.
త్రిపుర: ఇదా ట్రీట్మెంట్ చేస్తుంటే వేలు తెగింది.
గిరి: అక్కర్లేదు ఇక నుంచి నువ్వు అన్నీ ఆపేయ్.
గాయత్రీ: మా అక్కని ఆర్డర్ వేయడానికి నువ్వు ఎవరు. ఇంకా పెళ్లి జరగలేదు కదా.
గిరి: అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరుగుతుంది ఇది ఫిక్స్.
త్రిపురఅన్న: పెళ్లి తర్వాత నువ్వు ఎన్ని అయినా చేసుకో ఇప్పుడు నువ్వు చెప్పిందేం చేయదు.
రమాప్రభ: రేపే పసుపు దంచడం కదా ఇంటి నుంచి మరి ఎక్కడికీ వెళ్లదు.
గిరి: ఏంటి నొప్పిగా ఉందా డాక్టర్‌ని పంపిస్తా ట్రీట్మెంట్ చేయించుకో.
గాయత్రీ: ఏంటి పిన్ని అక్కకి ఆ రౌడీతో పెళ్లి అంటే అందరి కంటే నువ్వే సంతోషపడుతున్నావ్.
రమాప్రభ: త్రిపురకు గొప్పింటి సంబంధం వచ్చిందని సంతోషం అంతే.
ఊర్వశి: అక్కకి ఇంత కంటే మంచి సంబంధం రాదు.
గాయత్రీ: అవునా అయితే మేనత్తని ఒప్పిస్తా నువ్వే గిరి బావని పెళ్లి చేసుకుంటావా.
రమాప్రభ: ఆపండి మీరు త్రిపుర మీద గిరి ప్రేమ పెంచుకున్నాడు.
త్రిపురని అన్న చెల్లి పెళ్లి వద్దని ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. త్రిపుర మాత్రం ఏడుస్తూ ఏం సమాధానం చెప్పకుండా వెళ్లిపోతుంది. మరోవైపు అనంత్ కొత్తగా కొనబోయే ల్యాండ్‌కి బాల పేరు పెట్టిస్తానని అందుకు డాక్యుమెంట్స్ ఏర్పాటు చేస్తున్నానని అంటాడు. ఇక బాల పిన్ని బాబాయ్‌లను కాశ్మోరాదెయ్యం, తాటకి అంటాడు. అందరూ నవ్వు కుంటారు. ఇక నాగభూషణం బాలకి కషాయం తాగించాలని చెప్పి బాలని చూసి గెంతులేస్తాడు. బాల తాగను అని మారాం చేస్తాడు. ఎంత మంది చెప్పినా బాల వినడు. నాగభూషణం, వాసుకిలు వెంట పడి తాగమంటే బాల పరుగులు పెట్టిస్తాడు. తమ వల్ల కాదని చేతులెత్తేస్తారు. ఇంతలో నాగభూషణం, వాసుకిల కొడుకు ఫణేంద్ర వస్తాడు.
సడెన్‌గా వచ్చావేంట్రా అని అనంత్ ఫణీని అడిగితే రేపు అన్నయ్య పుట్టిన రోజు కదా ఎలా మిస్ అవుతానని అంటాడు. బాల రేపు నా పుట్టిన రోజు అని గెంతులేస్తాడు. కషాయం తాగించమని అందరూ ఫణికీ చెప్తారు. నువ్వు ఇచ్చినా నేను తాగను అని బాల అంటే నీకో మ్యాజిక్ చూపిస్తా అని ఫణేంద్ర అంటాడు. తన బ్యాగ్ నుంచి ఓ కప్ తీస్తాడు. అందులో కషాయం వేయగానే బాల ఫొటో వస్తుంది. అది చూసి బాల ఆశ్చర్యంతో కషాయం తాగేస్తాడు. ఆ కప్‌లో ఫణీ బాలని చంపాలని మందు కలిపేస్తాడు. ఇక బాల నిద్రొస్తుందని వెళ్లిపోతాడు. ఏం అవ్వలేదేంటని ఫణీని తండ్రి అడిగితే 12 గంటల తర్వాత పని చేస్తుందని చెప్తాడు.
గాయత్రీ పడుకోకుండా గిరి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. త్రిపుర గాయత్రీ కోసం భోజనం తీసుకొస్తుంది. గాయత్రీ అక్కతో ఏం మాట్లాడదు. త్రిపుర గాయత్రీకి అన్నం తినిపిస్తుంది. ఎందుకు అక్క గిరిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావ్ వద్దు అక్కా అని గాయత్రీ చెప్తుంది. త్రిపుర మౌనంగా ఉండిపోతుంది. అమ్మకి ఈ విషయం చెప్పావా అమ్మ ఒప్పుకుందా అని గాయత్రీ అడుగుతుంది. అమ్మ కూడా ఒప్పుకుందని త్రిపుర చెప్తుంది. నాన్న యాక్సిడెంట్ వల్ల ఇదంతా జరిగింది నాన్న యాక్సిడెంట్‌కి కారణమైన వాళ్లని వదిలిపెట్టనని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ఇంట్లో వరసగా అపశకునాలు.. లక్ష్మీ ఆందోళన నిజం అవుతుందా!!





















