Ennallo Vechina Hrudayam Serial Today April 12th: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: చివరి నిమిషంలో ట్విస్ట్.. అంగరంగ వైభవంగా అనంత్, గాయత్రీల పెళ్లి
Ennallo Vechina Hrudayam Today Episode త్రిపుర అరవింద్‌ని తీసుకొచ్చి నిజం చెప్పించి అనంత్, గాయత్రీల పెళ్లి జరిపించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ennallo Vechina Hrudayam Serial Today Episode అనంత్ ఊర్వశికి తాళి కట్టడానికి తాళి చేతిలో పట్టుకొని గాయత్రీని తలచుకొని బాధ పడతాడు. అందరూ తాళి కట్టమని చెప్పడంతో లేచి ఊర్వశి మెడలో తాళి కట్టే టైంకి త్రిపుర ఆపండి అని అంటుంది. దాంతో అనంత్ తాళి కట్టకుండా ఆగిపోతాడు. అందరూ షాక్ అయిపోతారు.
యశోద: ఏంటి ముహూర్తం దాటిపోతుంటే ఆపమంటున్నావ్.
త్రిపుర: ఎందుకంటే నా చెల్లి మీద వేసిన నింద నిజం కాదండి.
రమాప్రభ: ఇదేం విషయం నువ్వు చాలా సార్లు చెప్పావు కానీ నీ మాటలు ఎవరూ వినరు. అల్లుడు గారు మీరు తాళి కట్టండి.
త్రిపుర: ఒక్క నిమిషం. అరవింద్ గారు రండీ.. రమాప్రభ, ఊర్వశి బిత్తరపోతారు. ఈయనే అరవింద్ గారు ఈయన ఫొటో వాడుకొనే మా చెల్లి మీద నింద వేశారు. ఆ ఫొటోలు మార్పింగ్ చేశారు.
వాసుకి: ఎవరో ఎందుకు చేస్తారు. ఈ రింగుల జుట్టోడితో నీ చెల్లి తిరుగుంటుందేమో.
అరవింద్: తన చెల్లి ఎవరో నాకు తెలీదు. నేను గత మూడు సంవత్సరాల నుంచి అబ్‌రాడ్లో ఉంటున్నా. నా బిజినెస్‌లు అన్నీ అక్కడే ఉన్నాయి. నేను ఈ రోజే ఇండియా వచ్చాను కావాలంటే నా ట్రావెల్ డిటైల్స్ ఇస్తాను.
అనంత్: అర్థమైందా మీకు ఇప్పుడైనా నా గాయత్రీ ఏ తప్పు చేయలేదని చెప్పినా ఎవరూ వినలేదు. తప్పు చేయని నా గాయత్రీని అనుమానించారు. అవమానించారు.
త్రిపుర: థ్యాంక్స్ అరవింద్ గారు.
బామ్మ: చాలా తప్పు చేశాం.
యశోద: తొందర పడి నిజానిజాలు తెలుసుకోకుండా అనుమానించాం.
వాసు: సారీ అమ్మ త్రిపుర.
బాల: డాడీ నేను చెప్పాను కదా గాయత్రీ చాలా మంచిది అని మీరే వినలేదు.
రమాప్రభ: అన్నయ్య గారు తర్వాత అందరూ కూర్చొని గాయత్రీకి క్షమాపణ చెప్దాం. ముందు పిన్ని గారు మాట ఇచ్చినట్లు పెళ్లి జరగనివ్వండి.
అనంత్: నిజం తెలిసిన తర్వాత కూడా నేను ఊర్వశిని ఎలా పెళ్లి చేసుకుంటానండీ.
బాల: అనంతూ నువ్వు గాయత్రీని పెళ్లి చేసుకోరా. నీ కోసం గాయత్రీ ఏం చేసిందో తెలుసా. అని గాయత్రీ సూసైడ్ చేసుకోవడం గురించి చెప్తాడు. అందరూ షాక్ అయిపోతారు.
బామ్మ: గాయత్రీకి ఏం జరిగినా ఆ పాపం మనదే.
బాల: బామ్మ గాయత్రీకి ఏం కాలేదు. నేను వెళ్లి గాయత్రీని కాపాడాను. గాయత్రీ రా.
గాయత్రీ రావడంతో అనంత్ పరుగున వెళ్లి ఎందుకు ఈ పని చేశావ్ అంటాడు. నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనని గాయత్రీ అనగానే అనంత్ హగ్ చేసుకుంటాడు. పీటల మీద పెళ్లి ఆగిపోతే నా కూతురి పరిస్థితి ఏంటి పెళ్లి జరిపించండి అంటుంది. దానికి బామ్మ పెద్దవాళ్ల మాట కంటే వాళ్ల ప్రేమే గొప్పది అనంత్ కోసం చావడానికి చనిపోవడానికి ప్రయత్నించింది అంటే వాళ్ల ప్రేమ ఎంత గొప్పదో అర్థమవుతుంది అని అంటుంది. అనంత్ తల్లిదండ్రులు ఇప్పుడే పెళ్లి చేసేయమని అంటారు. వాసుకి వాళ్లు ఆపడానికి ప్రయత్నిస్తారు. కానీ బామ్మ పెళ్లి చేసేద్దాం అని అంటుంది. పది నిమిషాల్లో ముహూర్తం అని పంతులు చెప్తారు. త్రిపుర ఊర్వశికి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానని అంటుంది. దాంతో ఊర్వశి వెళ్లిపోతుంది. రమాప్రభ కూడా వెళ్లిపోతుంది.
గాయత్రీని పెళ్లి కూతురిని చేసి తీసుకురమ్మని త్రిపురకు పెద్దావిడ చెప్తుంది. అనంత్ పెళ్లి పీటల మీద కూర్చొంటాడు. గాయత్రీని రెడీ చేసి త్రిపుర తీసుకొస్తుంది. గాయత్రీ, అనంత్‌ల పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. కొత్త జంట అందరి ఆశీర్వాదం తీసుకుంటారు. గాయత్రీ అక్కని హగ్ చేసుకుంటుంది. అక్కకి పెళ్లి అవ్వకుండా నా పెళ్లి జరగడం బాధగా ఉందని అంటుంది. నిన్ను ఇలా వదిలేసి నేను అత్తారింట్లో ఎలా ఉండాలి అక్క అంటే ఉండాలి గాయత్రీ నువ్వు అంటే ఇప్పుటి నుంచి నీ వెనక అనంత్ గారి కుటుంబం ఉంటుంది నువ్వేం చేసిన వాళ్ల కోసమే చేయాలి. వాళ్లకి నచ్చినట్లే ఉండాలి అని చెల్లికి చెప్తుంది. తాతయ్య కూడా ఎమోషనల్ అవుతారు. చెల్లిని జాగ్రత్తగా చూసుకోమని అనంత్‌తో త్రిపుర చెప్తుంది. గాయత్రీని ఏ కష్టం రాకుండా మేం చేసుకుంటాం అని అనంత్, బాల, బామ్మ అందరూ చెప్తారు. కొత్త జంటని తీసుకొని ఇంటికి వెళ్తారు. యశోద కొత్త జంటకు హారతి ఇచ్చి ఆహ్వానిస్తుంది. అందరూ సంతోషంగా ఉంటారు. ఒకరి పేర్లు ఒకరు చెప్పుకొని లోపలికి రండి అని యశోద చెప్తుంది. ఇద్దరూ పేర్లు చెప్పుకొని లోపలికి వెళ్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: రాజు, కావేరి చేతుల రాములవారి కల్యాణం.. చిన్ని ఊహ నిజం అవుతుందా!





















