Chiranjeevi lakshmi sowbhagyavati Serial Today August 30th: ‘చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి’ సీరియల్: లక్కీకి నిజం చెప్పిన జున్ను – మనీషాను పెళ్లి చేసుకుంటానన్న మిత్ర
Chiranjeevi lakshmi sowbhagyavati Today Episode: పూలకుండి లక్కీ మీదకు తోసేసి ఆ ప్రమాదం నుంచి లక్కీని మనీషా కాపాడినట్లు నాటకం ఆడతారు మనీషా, దేవయాని దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Chiranjeevi lakshmi sowbhagyavati Serial Today Episode: లక్ష్మీ డెలివరీ అయిన హాస్పిటల్ కు ఫోన్ చేసి లక్ష్మీ డెలివరీ డీటెయిల్స్ అడుగుతుంది. హాస్పిటల్ వాళ్లు కవలలు పుట్టారని చెప్పడంతో దేవయాని షాక్ అవుతుంది. దీంతో మనీషా ఏమైందని అడగ్గానే నా గెస్ కరెక్టు అయ్యింది. లక్ష్మీకి ఆరోజు పుట్టింది కవల పిల్లలట అని చెప్తుంది. దీంతో జున్ను లక్ష్మీ కొడుకే అన్నమాట. అదే కన్‌ఫం గా తెలియదు. కానీ ఇప్పుడు తెలుసుకోవాలి అని దేవయాని చెప్తుంది. దీంతో జున్నుకు లక్ష్మీకి డీఎన్‌ఏ టెస్ట్ చేయిద్దామా అంటే ఇప్పుడవన్నీ ఏమీ వద్దని ముందు మిత్ర చేజారకుండా చూడమని చెప్తుంది. మరోవైపు జున్ను, లక్కీలను వివేక్ ఫోటోలు తీస్తుంటాడు. ఇంతలో జాను ఈ ఫోజులు వద్దని గోపిక, కృష్ణులకు అది సరిపోదు అంటుంది. వాళ్లిద్దరూ మాట్లాడుకుంటుంటే లక్కీ, జున్ను వెళ్లిపోతారు.
లక్కీ: జున్ను నీకు నిజంగా ఈ గెటప్ అర్జున్ అంకుల్ వేశారా?
జున్ను: అవును ఏ..
లక్కీ: మీ మమ్మీ రెడీ చేయలేదా?
జున్ను: ఎందుకు అడుగుతున్నావు.
లక్కీ: ఏం లేదు నువ్వు లోపలకి రాకముందు శామ్ అంటీ నీ మేకప్ కరెక్షన్ చేశాను అని చెప్పింది. నా మేకప్ కరెక్షన్ చేసింది కూడా శామ్ ఆంటీనే
జున్ను: లక్కీ నీకో సీక్రెట్ చెప్పనా..? లక్కీ శామ్ ఆంటీ.. మా మమ్మీ వేరు వేరు కాదు. ఇద్దరు ఒక్కరే.
అని జున్ను నిజం చెప్పగానే లక్కీ నిజమా అంటుంది. ఇంతలో అరవింద, జయదేవ్, వివేక్, జానులు వస్తారు. అవునని నిజమే అని అందరు చెప్తారు. దీంతో ఎందుకు లక్ష్మీ అమ్మ ఆలా ఎందుకు వచ్చిందని లక్కీ అడుగుతుంది. దీంతో ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని అవి సాల్వ్ అయ్యే వరకు ఈ నిజం ఎవ్వరికీ తెలియకూడదు అని చెప్తారు. దీంతో లక్కీ సరే అని వెళ్లిపోతుంది. పిల్లలకు నిజం తెలిసినందుకు అరవింద హ్యాపీగా ఫీలవుతుంది. ఇక మిత్రకు కూడా నిజం తెలిస్తే బాగుంటుంది అని అనుకుంటారు. మరోవైపు పిల్లలిద్దరూ సంయుక్త రూంలోకి వెళ్తారు. లక్కీ సంయుక్తను గట్టిగా హగ్ చేసుకుంటుంది.
సంయుక్త: ఏమైంది లక్కీ చెప్పు ఏమైంది లక్కీ..
లక్కీ: అమ్మా… నువ్వు సంయుక్తవి కాదు లక్ష్మీ అమ్మవి అని నాకు తెలిసిపోయింది. జున్ను చెప్పాడు.
అని లక్కీ చెప్పగానే అందరూ రూంలోకి వస్తారు. లక్కీకి నిజం తెలిసిందని సైగ చేస్తారు. దీంతో లక్ష్మీ ఎమోషనల్ గా ఫీలవుతుంది. లక్కీకి సారీ చెప్తుంది. తర్వాత పిల్లలు వెళ్లిపోతారు. అరవింద నువ్వు లక్ష్మీవి అన్న నిజం మిత్రకు చెప్పాలని అడుగుతుంది. ఎలా చెప్పగలను ఇంకోన్నాళ్లు ఇలాగే ఉండాలి అంటుంది. అయితే ఆ లోపు మనీషా, మిత్రకు దగ్గరవుతుందని జయదేవ్ చెప్తాడు. అయితే మనీషా దగ్గర నుంచి ఎవిడెన్స్ తీసుకునేంత వరకు ఇలాగే ఉంటానని లక్ష్మీ వెళ్లిపోతుంది. తర్వాత పిల్లలు కింద ఆడుకుంటుంటే దేవయాని పైనుంచి పూలకుండీని కిందకు తోస్తుంది. అప్పుడే మిత్ర బయటకు వస్తుంటాడు. మనీషా వెళ్లి లక్కీని కాపాడినట్లు నటిస్తుంది. ఇంతలో అందరూ ఏమైందని పరుగెత్తుకొస్తారు. ఏమైందని అడిగితే కుండీ మీద పడుతుంటే లక్కీని మనీషా కాపాడింది అని మిత్ర చెప్తాడు.
దేవయాని: ఆ పూల కుండీ నీమీద పడి ఉంటే
మనీషా: నేను అంతదూరం ఆలోచించలేదు ఆంటీ.. నా కళ్ల ముందు లక్కీ మాత్రమే కనిపించింది. ఎలాగైనా లక్కీని కాపాడాలనుకున్నాను.
దేవయాని: ఎంత పిచ్చిదానివి నువ్వు. మిత్ర మీద లక్కీ మీద ఎందుకు నీకు ఇంత పిచ్చి ప్రేమ.
అంటూ ఏదైనా జరగరానిది జరిగి ఉంటే అయినా ఎవరి దిష్టి తగిలిందో అంటుంది దేవయాని. దీంతో ఎవర్ని అంటున్నావు నువ్వు అంటూ జయదేవ్, వివేక్ ప్రశ్నిస్తారు. ఇంతలో మిత్ర నేను మనీషాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.