Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today September 21st: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: తల్లి కోసం తండ్రిని ప్రశ్నించిన లక్కీ.. జానుకి వేరే వ్యక్తితో అఫైర్.. దేవయాని ప్లాన్ వర్కౌట్ అవుతుందా!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode లక్కీ, జున్నులు ఇద్దరూ లక్ష్మీ పిల్లలే అని చెప్పాలని భాస్కర్ అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode ఉదయం లక్ష్మీ హాల్‌లో కూర్చొన్న జున్ను, లక్కీల కోసం పాలు ఇస్తుంది. ఇంతలో రచన అనే ఫ్యాషన్ డిజైనర్ వచ్చి మిత్రని కలవడానికి వచ్చానని చెప్తుంది. లక్ష్మీ చూసి మీరు ఎవరు అని అంటే అరవింద, జయదేవ్ వచ్చి తను మిత్ర భార్య లక్ష్మీ అని చెప్తారు. మరి మనీషా ఎవరు అని అడిగితే జయదేవ్ మిత్ర ఫ్రెండ్ అని చెప్తుంది. ఇంతలో దేవయాని కాదు మిత్రకు కాబోయే భార్య అని చెప్తుంది.
అరవింద: ఇక ఆ మాట మర్చిపో దేవయాని.
మనీషా: అంటే మా పెళ్లి జరగదు అంటున్నారా.
లక్ష్మీ: అత్తయ్య గారు బయట వాళ్ల ముందు ఎందుకు మిత్ర గారు వస్తున్నారు.
మిత్ర: హాయ్ రచన. తను ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ రేపు లక్కీ భర్త్‌డే కదా. డ్రస్ డిజైన్ కోసం పిలిపించా.
జున్ను: రేపు నీ భర్త్‌డేనా లక్కీ.
లక్కీ: అవును జున్ను.
జాను: జున్ను భర్త్‌డే కూడా రేపే.
అరవింద: విచిత్రంగా ఉందే లక్కీ, జున్ను ఒకే రోజు పుట్టారా.
మిత్ర: ఒకే ప్లేస్‌లో పుట్టారు కూడా.
లక్కీ: జున్ను మున్నార్‌లో పెరిగాడు తాతయ్య.
మిత్ర: మనం ఉన్న చోటే వాళ్లు ఉన్నారు కానీ మనతో చెప్పలేదు. ఇప్పటికైనా అర్థమైందా మామ్ తను ఎలాంటిదో.
అరవింద: మున్నార్లో ఎక్కడున్నారు లక్ష్మీ.
దేవయాని: ఇంకెక్కడ అక్క ఆ అర్జున్ దగ్గర ఉండుంటారు.
జున్ను: కాదు అని చెప్పబోతే లక్ష్మీ చెప్పనివ్వదు.
మిత్ర: ఇంట్లో ఉంటూ తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం, మారు వేషాలతో తిరగడం, అబద్ధాలు చెప్పడం ఇవన్నీ చేసేవారిని మీరు కోడలు అంటారేమో నేను క్రిమినల్ అంటాను. ఒక నేరస్తురాలని వెనకేసుకొని వస్తూ నన్ను తప్పు అంటారు. తను అందరినీ మోసం చేస్తుంది.
జున్ను: మా అమ్మ అలాంటిది కాదు నాన్న. మీరు పెద్దవాళ్లు కదా అర్థం చేసుకోండి.
అర్జున్ జున్ను దగ్గరకు వస్తాడు. జున్ను బాబా అనుకుంటూ హగ్ చేసుకుంటాడు. మనీషా, దేవయానిలు చూసి ఆ సీన్ మిత్రకి చూపించి రెచ్చ గొట్టాలని అనుకుంటారు. మనీషా మిత్రని బయటకు లాక్కెళ్లి అర్జున్ని చూపిస్తుంది. జున్ను, అర్జున్ హగ్ చేసుకొని ఉండటం.. అర్జున్ డ్రస్ గిఫ్ట్ ఇవ్వడం మిత్ర చూసి ఒక నాన్నలా నాకు అన్నీ చేస్తున్నావ్ అని జున్ను అని అంటాడు. ఆ మాటతో మనీషా మిత్రని రెచ్చగొడుతుంది. అరవింద వాళ్లు రావడం జున్నుతో మాట్లాడటం ఇక అర్జున్ జున్ను గురించి అడగటం జాను పిలుచుకొస్తా అని వెళ్లడంతో మిత్ర ఇంకా రెచ్చిపోతాడు. అర్జున్ మిత్రని చూసి హాయ్ చెప్తే మిత్ర పట్టించుకోకుండా వెళ్లిపోతాడు.
అర్జున్: నువ్వు ఎందుకు చెప్పలేదు లక్ష్మీ మున్నార్‌లో భాస్కర్ వాళ్ల ఇంట్లో ఉన్నావని వాళ్లే నీ సీమంతం చేశారని నీకు డెలవరీ చేయించింది కూడా వాళ్లే అని ఎందుకు చెప్పలేదు. నీ మీద మిత్రకు ఉన్న ఒపీనియన్ మారాల్సిన మిత్ర ఇంకా తప్పుగా అర్థం చేసుకుంటాడు.
లక్ష్మీ: నా భవిష్యత్‌పై నాకు పెద్ద ఆలోచనలు లేవు అర్జున్ గారు నాకు మూడే లక్ష్యాలు ఉన్నాయి. 1అత్తయ్య జైలుకి వెళ్లకుండా ఆపడం. 2 జాను వివేక్‌ల పెళ్లి చేయడం, 3 జున్నని ఆయన దగ్గర చేర్చడం. ( దేవయాని చాటుగా విని షాక్ అయిపోతుంది)
అర్జున్: నువ్వు మిత్రకు దగ్గరవ్వవా.
లక్ష్మీ: అది నా చేతిలో లేదు. నా మీద పగ పెంచుకున్నారు ఆయనకి నేను దగ్గరవ్వలేనేమో.
దేవయాని: నా కొడుకు పెళ్లి నీ చెల్లితో చేస్తావా జీవితంలో ఎప్పుడూ జరగని అవమానం నీ చెల్లికి చేస్తా అది చచ్చిపోతుంది.
మనీషా భాస్కర్‌ని కిడ్నాప్ చేయించిన రౌడీలకు ఫోన్ చేసి రేపటి వరకు జాగ్రత్తగా ఉంచమని అంటుంది. రేపు చాలా ముఖ్యమై రోజు అని చెప్తుంది. రేపు ఏంటి ముఖ్యమైన విషయం అని భాస్కర్‌కి రౌడీ అడిగితే రేపు జున్ను, లక్కీలు ఇద్దరూ పుట్టిన రోజు అని రేపు తప్పించుకొని లక్ష్మీకి లక్కీ కూడా నీ కూతురే అని చెప్పాలి అనకుంటాడు. దేవయాని మనీషా దగ్గరకు వచ్చి లక్ష్మీ మిత్రకు దగ్గరకు అవ్వదని అంటుంది. ఇక జానుని ఎలా అవమానించబోతున్నారని అడిగితే జాను క్యారెక్టర్ మీద దెబ్బకొడతానని వివేక్‌కి జాను మీద అనుమానం వచ్చేలా చేస్తానని అంటుంది. ఒక రూమ్ అందులో జాను.. జానుకి తెలీకుండా ఇంకో అబ్బాయి కట్ చేస్తే పోలీసులు దాంతో జానుని వివేక్ అసహ్యించుకుంటాడు.
ఇక లక్కీ మిత్రని పట్టుకొని పడుకుంటుంది. భర్త్‌డేకి అందరినీ పిలిచావా అని మిత్ర అడిగితే లక్కీ పిలిచా అని చెప్తుంది. ఇక లక్కీ తన తల్లి ఎవరు ఎలా ఉంటుంది అని అడుగుతుంది. మిత్ర ఏం చెప్పకుండా సైలెంట్‌గా ఉంటాడు. ఇక లక్ష్మీ లక్కీ గురించి అరవిందను అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: కన్న కొడుకే తనని చంపాలని ప్రయత్నించాడని తెలుసుకున్న మహదేవయ్య.. రుద్రని చంపేస్తాడా!