అన్వేషించండి

Satyabhama Serial Today September 21st: సత్యభామ సీరియల్: కన్న కొడుకే తనని చంపాలని ప్రయత్నించాడని తెలుసుకున్న మహదేవయ్య.. రుద్రని చంపేస్తాడా!

Satyabhama Today Episode తన మీద దాడి చేసిన నర్శింహని మహదేవయ్య చంపడానికి వెళ్లి తన పెద్ద కొడుకు రుద్ర మొత్తం చేశాడని తెలుసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode సత్య బాధగా ఉంటే క్రిష్‌ ఎందుకు అలా ఉన్నావ్ అని అడుగుతాడు. నా వైపు కూడా చూడటం లేదని అంటాడు. మీ నాన్న గారి గురించే అనుకున్నా కానీ నా గురించి కూడా ఆలోచిస్తున్నావా. నీకు జరగకూడనిది జరిగితే నేను ఏమైపోవాలి నా గురించి ఆలోచించావా అని సత్య ఏడుస్తుంది. 

సత్య: తల దించుకోవద్దు సమాధానం చెప్పు క్రిష్.. నా గురించి ఆలోచించవా నా జీవితం ఏమైపోయినా పర్లేదా. నీ జీవితం మీ నాన్న గారికే అంకితం అన్నావ్ మరి నాతో ఏం సంబంధం లేదా.
క్రిష్: అలా కాదు సత్య. 
సత్య: ఇదేనా నీ ప్రేమ నా గురించి పట్టించుకోకుండా నన్ను వదిలేస్తున్నావా. నీకు మీ బాపునే ముఖ్యం నేను అవసరం లేదు నీకు. జరిగిందంతా మర్చిపోదాం కానీ ఒక్క మాట ఇవ్వు గొడవలకు దూరంగా ఉంటా అని మాటివ్వు. నేను అంటే ప్రేమ ఉంటే మాటివ్వు.
క్రిష్: అది కష్టం సత్య.
సత్య: మరి నా కష్టం గురించి నా గుండె కోత గురించి ఎవరికి చెప్పుకోవాలి. అని ఏడుస్తుంది. 
క్రిష్: సత్య గొడవలు పడి పడి అలిసిపోయాం. ఇప్పుడిప్పుడే దగ్గరవుతున్నాం. గొడవలు వద్దు సత్య. నేను తట్టుకోలేను.
సత్య: ఇది కోపం కాదు బాధ దిగులు. నేను పెరిగిన వాతావరణం వేరు. నాది రాతి గుండె కాదు. ఎమోషన్స్ ఉంటాయ్. 
క్రిష్: నాకు నువ్వంటే ప్రాణం అలానే కొడుకుగా నా బాధ్యతల్ని వదిలి పారిపోలేను కదా. మీ నాన్న సమస్యల్లో ఉంటే నువ్వు వదిలేయవుగా. మా బాపు పులి మీద స్వారీ చేస్తున్నారు. ఆయనకు ఎమ్మెల్యే అవ్వడం కల. బాపునకు నేను అండగా ఉండాలి. కానీ మాటిస్తున్నా ఇంకోసారి ఇలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడతా. ఏదైనా మా బాపు ఎమ్మెల్యే అయ్యే వరకే తర్వాత నువ్వు ఎలా అంటే అలానే. అర్థం చేసుకో.

నందిని గదిలో రెడీ అవుతుంటే హర్ష వచ్చి వెనక నుంచి హగ్ చేసుకుంటాడు. నందిని కెవ్వు మంటుంది. గ్రేట్ మహదేవయ్య గారి కూతురు ఇంత చిన్న విషయానికి భయపడిందా అని అంటాడు. ఇక ముందు నుంచి వెళ్లి హగ్ చేసుకుంటాడు. పిల్లాడికి జోరు ఎక్కువైందని నందిని హర్షని తోసేస్తుంది. ఇక హర్ష సినిమాకు వెళ్దామని నందినికి సర్‌ఫ్రైజ్ ఇస్తాడు. తొందరగా రెడీ అవ్వమని చెప్తాడు. నందిని సంతోషంగా ఫీలవుతుంది. ఇక మైత్రి కూడా మనతో వస్తుందని అంటే నందిని హర్ట్ అయిపోతుంది. మైత్రితో సినిమాకు వెళ్తూ నన్ను వెంట తీసుకెళ్తున్నావా అని అంటుంది. నా భర్త దగ్గర నాకు ప్రైవసీ కావాలని చెప్పి ఒక టికెట్ చింపేసి నువ్వు నీ ఫ్రెండ్ వెళ్లండని వెళ్లిపోతుంది.

సత్య, క్రిష్‌కి యాపిల్ తినిపించి మందులు వేస్తుంది. క్రిష్ కొద్ది సేపు తన పక్కన కూర్చొమని చెప్తాడు. సత్య క్రిష్ నుదిటి మీద ముద్దు పెడుతుంది. ఉదయం సత్య క్రిష్‌ని గార్డెన్‌లో నడిపిస్తుంది. క్రిష్‌కి కాస్త తగ్గుతుంది. జిమ్ చేస్తే సత్య వద్దని అంటుంది. ఇక క్రిష్ సత్యకి ముద్దు కావాలని అడిగితే సత్య మూతి తిప్పుకొని వెళ్లిపోతుంది. మరోవైపు మహదేవయ్య గన్ పట్టుకొని జరిగిన దాడి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఓ రౌడీ వచ్చి నర్శింహ జాడ దొరికిందని అంటాడు. మహదేవయ్య రుద్రని తీసుకొని వెళ్తాడు. ఇక్కడికి ఎందుకు వచ్చాం ఎవర్ని కలవాలి అని రుద్ర అడిగితే తర్వాత చెప్తా నువ్వు ఇక్కడే ఉండు అని మహదేవయ్య అంటాడు. నర్శింహ దగ్గరకు మహదేవయ్య వెళ్లగా మహదేవయ్యని చూసి నర్శింహ వణికిపోతాడు.

మహదేవయ్య నర్శింహకు  గన్ గురి పెట్టి కొడతాడు. ఎమ్మెల్యే టికెట్‌కి అడ్డు వస్తున్నా అని నన్నే చంపాలి అనుకున్నావ్ కదా నిజం చెప్పురా అని అంటాడు. మరోవైపు రుద్ర అటుగా వస్తుంటాడు. దానికి నర్శింహ నేను చనిపోవడానికి  ముందు నీకు ఓ చేదు నిజం చెప్తా అప్పుడు నాకంటే ముందు నువ్వే చస్తావ్ అని చెప్పి నిన్ను చంపాలని చూసింది నీ పెద్ద కొడుకు అని చెప్తాడు. మహదేవయ్య షాక్ అయిపోతాడు. గతంలో కూడా నీ పెద్ద  కొడుకే నిన్ను చంపాలని చూశాడని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కాబోయే అల్లుడిని కర్రతో చితక్కొట్టిన శ్రీధర్.. కార్తీక్, జ్యోత్స్నల పెళ్లి జరగదన్న శివనారాయణ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతారరివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Embed widget