Chiranjeevi Lakshmi Sowbhagyavathi September 10th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: అర్జున్, లక్ష్మీల మీద మిత్రకు అనుమానం వచ్చినట్లు చేసిన మనీషా, దేవయానిలు!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode అర్జున్ లక్ష్మీ కోసం ఇంటికి రావడం దాన్ని మనీషా, దేవయానిలు కలిసి మిత్రకు తప్పుగా చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode జాను రాత్రి పూట తినేసి వెళ్తుంటే వివేక్ జానుని లాక్కోని గదిలోకి వెళ్తాడు. జాను వెళ్తాను అంటే వివేక్ వద్దు అని అంటాడు. ఇక జానుని ముద్దు పెట్టడానికి దగ్గరకు వెళ్తాడు. జాను ముందు తమ పెళ్లి గురించి దేవయానితో మాట్లాడమని అంటుంది. మన పెళ్లి ఎలాగూ జరుగుతుందిలే అని ఇప్పుడు చేసేవి అప్పటికి స్వీట్ మెమోరిస్ అని అంటాడు. ఇక వివేక్ గదిలోకి దేవయాని వచ్చి డోర్ తీసే సరికి జాను, వివేక్ ఇద్దరూ దాక్కుండిపోతారు. దేవయాని గదిలోకి వచ్చి వివేక్ వివేక్ అని పిలుస్తుంది. జాను, వివేక్ ఇద్దరూ బెడ్ వెనక దాక్కుండిపోతారు.
దేవయాని: ఫోన్ కూడా గదిలో వదిలేసి ఎక్కడికి వెళ్లాడు. ఆ జాను దగ్గరకు వెళ్లాడేమో తొందరగా వీడికి పెళ్లి చేసేయాలి. లేదంటే ఆ జానునే నా కోడలు అయ్యేలా ఉంది.
వివేక్: హమ్మయ్యా అమ్మ వెళ్లిపోయింది ఇక నో టెన్షన్.
జాను: హా వెళ్తూ వెళ్తూ మీ అమ్మ ఏముందో వినలేదా. నువ్వు కనిపించకపోయినా నన్నే అనుమానిస్తున్నారు.
వివేక్: అంటే నేను నీ చేతిలో బంధీ అయ్యాను కదా.
జాను: ఆ మాట ఇప్పుడు మీ అమ్మతో చెప్పాల్సింది కదా.
వివేక్: నీతో చెప్తున్నా కదా. నేను నీ చేతిలో పడితేనే నువ్వు నా కౌగిళ్లో పడేది. మా అమ్మతో మాట్లాడుతానులే కానీ అప్పటి వరకు ఓ చిన్న ముద్దో హగ్గో ఇవ్వొచ్చు కదా.
జాను: ఆశ దోశ అన్నీ పెళ్లి తర్వాతే..
జున్నుకి అరవింద, జయదేవ్ రెడీ చేస్తారు. ఇంతలో లక్కీ వచ్చి తనకు జడ వేయమని అరవిందతో చెప్తుంది. మిత్ర కూడా కిందకి వస్తుంటాడు. జున్నుని రెడీ చేస్తున్నా తర్వాత నీకు రెడీ చేస్తాను అని అంటుంది. ఇంతలో లక్ష్మీ వచ్చి తాను జడ వేస్తాను అంటే మిత్ర వద్దని తాను జడ వేస్తానని లక్కీని తీసుకెళ్తాడు.
జయదేవ్: అంత పౌరుషం ఎందుకు మిత్ర.
మిత్ర: మీరంతా ఓ టీమ్ అయిపోయారు కదా నా కూతురికి నేను ఏ లోటు లేకుండా చూసుకోగలను.
జున్ను: అంటే మీరు లక్కీ ఓ టీమా నాన్న.
లక్కీ: అవును జున్ను. మా టీమ్‌లోకి నువ్వు వస్తావా.
ఇక మిత్ర దువ్వుతుంటే లక్కీ నొప్పి అని అరుస్తుంది. మిత్ర గోల చేయొద్దని అంటే లక్కీ నాన్న నీకు జడ వేయడం వచ్చా అని అంటే ట్రై చేస్తున్నా ఏం అనకు అని అంటాడు. ఇక జాను వచ్చి జడ వేస్తాను అంటే మిత్ర నువ్వు వేరే టీమ్ కదా నవ్వు వేయకు అంటాడు. ఇక మనీషా, దేవయాని వస్తే మిత్ర తనకు ఫోన్ వస్తుంది అని మనీషాకు జడ వేయమని అంటారు. ఫోన్ రాకుండా వచ్చింది అన్నావ్ అని జున్ను అంటే లక్కీ అదంతా కవరింగ్ అంటుంది. ఇక మనీషా దువ్వెన తీసుకుంటుంది కానీ తనకి కూడా జడ వేయడం రాదు.
దేవయాని మనసులో ఇదే ఎప్పుడు జడ వేసుకోదు లక్కీకి ఇంకేం వేస్తుందని అనుకుంటుంది. మిత్ర, మనీషా తిప్పలకు అందరూ నవ్వుకుంటారు. మనీషాకు జడ వేయడం రాకపోవడంతో అరవింద సెటైర్లు వేస్తుంది. మనీషా కూడా జడ వేయలేకపోతుంది. చివరకు లక్ష్మీ లక్కీకి జడ వేస్తుంది. ఇద్దరూ టిఫెన్ చేయడానికి రెడీ అవుతారు. ఇక అర్జున్ వస్తే జున్ను బాబా అని వెళ్లి హగ్ చేసుకుంటాడు. తను రాత్రి తండ్రి దగ్గర పడుకున్నాను అని స్కూల్‌కి కూడా తీసుకెళ్తారని నాకు అంతా నాన్నే అని జున్ను అంటాడు. అర్జున్ లక్ష్మీ బాగోగులు అడుగుతాడు. ఇక అర్జున్‌కి టిఫెన్ చేయడానికి పిలుస్తారు. అర్జున్ వద్దు అన్నా జున్ను ఒప్పుకోడు.
మనీషా, దేవయాని అర్జున్ చూసి లక్ష్మీ, జున్నుల కోసం వచ్చాడని అనుకుంటారు. ఇక అర్జున్‌తో అరవింద ఇది కూడా నీ ఇళ్లే అనుకొ అని మనం అంతా ఒక్కటే అని అంటుంది. అర్జున్, లక్ష్మీ దగ్గరైతే మిత్ర, లక్ష్మీలను వేరు చేయొచ్చని అనుకుంటారు. ఇక మిత్ర రావడంతో దేవయాని, మనీషాలు నాటకం మొదలు పెడతారు. నువ్వు గదిలోనే ఉండు మిత్ర అర్జున్ లక్ష్మీ కోసం వచ్చాడని మిత్రకు అనుమానం కలిగేలా మాట్లాడుతారు. అర్జున్, లక్ష్మీలు సరదాగా నువ్వుకొని మాట్లాడుకోవడం మిత్ర చూస్తాడు. దేవయాని, మనీషాలు కూడా మిత్రని రెచ్చగొడతారు. మిత్ర అక్కడికి వచ్చి నాకు ఆకలి లేదు అని చెప్తాడు. ఇక అర్జున్ మిత్రకి తినమంటే మిత్ర ఇది నా ఇళ్లు నా డైనింగ్ టేబుల్ నా మనసులు నువ్వు నాకు తినమని చెప్పొద్దని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.