Seethe Ramudi Katnam Serial Today September 10th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: జనార్థన్‌కి రాఖీ కట్టమని విద్యాదేవితో చెప్పిన మహాలక్ష్మి.. చివరి నిమిషంలో ట్విస్ట్!
Seethe Ramudi Katnam Today Episode జనార్థన్‌కి రాఖీ కట్టమని మహాలక్ష్మీ విద్యాదేవితో చెప్పడం చివరి నిమిషంతో సుమతి నుంచి జనార్థన్‌కి కాల్ రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Serial Today Episode విద్యాదేవి టీచరే సుమతి అని అనుమానంగా ఉందని మహాలక్ష్మి అందరితో చెప్తుంది. విద్యాదేవి, శివకృష్ణ షాక్ అయిపోతారు. రామ్‌లు మాత్రం టీచర్ మా అమ్మ కాదు అని అంటారు. సీత కూడా టీచర్ సుమతి కాదని మాట్లాడుతుంది. తనే సుమతి అత్తమ్మ అయితే తన సొంత ఇంట్లో ఇలా పరాయిదానిలా ఎందుకు ఉంటుందని అడుగుతుంది. శివకృష్ణ రాఖీ కడితే నష్టమేంటి అని అందరూ ప్రశ్నిస్తారు.
మహాలక్ష్మి: మీకు అసలు విషయం అర్థం కావడం లేదు. ఒక మనిషి శాశ్వతంగా దూరం అయితే మరో మనిషిలో ఆ మనిషిని చూసుకోవచ్చు కానీ సుమతి బతికే ఉంది కదా. ప్రాణాలతోనే ఉంది కదా. అలాంటప్పుడు ఆ సుమతిని వెతకడం మానేసి ఈ మనిషిలో సుమతిని వెతుక్కోవడం ఏంటి.
జనార్థన్: అయినా సుమతి ఏమైందా అని మేం బాధ పడుతుంటే ఇప్పుడు ఈ అన్నాచెల్లెళ్ల బంధం చూడటానికి చాలా ఇబ్బెట్టుగా ఉంది.
సీత: సొంత చెల్లిని కూడా మీ స్వార్థం కోసం బలి చేసే మీకు అన్నాచెల్లెళ్ల బంధం గురించి ఏం తెలుస్తుంది. మహాలక్ష్మీ అత్తయ్య కూడా మా నాన్నకి చెల్లి వరసే అవుతుంది కావాలి అంటే అత్తయ్య కూడా మానాన్నకి రాఖీ కట్టొచ్చు. ఒక్క రక్త సంబంధం ఉన్న వాళ్లే రాఖీ కట్టాల్సిన అవసరం లేదు.
మహాలక్ష్మి: సరే సీత మీ మాటలకు ఏకీభవిస్తాను. కాసేపు నా అనుమానం పక్కన పెడతాను. దేవుడిచ్చిన మీ అన్నయ్యకి రాఖీ కట్టండి అన్నయ్య గారు. విద్యాదేవి రాఖీ కడుతుంది. శివకృష్ణ విద్యాదేవికి డబ్బులు ఇస్తాడు. మహాలక్ష్మీ.. నన్ను కూడా మీ తోడబుట్టినది అని సీత అనుకోమంది కాబట్టి నేను రాఖీ తీసుకొస్తాను.
అర్చన: మహా ప్లాన్ అది కాదే.
మహాలక్ష్మి: రాఖీ తీసుకొని వస్తుంది. ఇన్నాళ్లు నువ్వు ఏం చెప్పినా నేను అంగీకరించేదాన్ని సీత ఎందుకంటే నువ్వు హాఫ్ మైండ్ అనుకునేదాన్ని. నువ్వు చెప్పింది వంద శాతం నిజం సీత. ఒకరు ఒక వ్యక్తికి రాఖీ కట్టాలి అంటే రక్త సంబంధం ఉండాల్సిన అవసరం లేదు అన్న నీ మాట నాకు చాలా నచ్చింది అందుకే ఈ రాఖీ నేను విద్యాదేవి గారితో జనాకు కట్టించాలి అనుకుంటున్నా.( సుమతి, శివకృష్ణలు షాక్ అయిపోతారు) విద్యాదేవి గారు మీరు ఈ శివకృష్ణ గారిని ఎలా అన్నయ్య అనుకుంటున్నారో నేను మిమల్ని మా ఆయనకు చెల్లి అనుకుంటున్నా. మీరు కూడా జనాకి రాఖీ కట్టండి.
జనార్థన్: మనసులో.. తాళి కట్టిన భర్తకు రాఖీ కట్టడమా. భార్యభర్తల బంధాన్ని అన్నాచెల్లెల బంధం అనుకోవడమా ప్రపంచంలో ఎవరూ పెట్టని పరీక్ష మహాలక్ష్మి మా చెల్లికి పెట్టింది.
మహాలక్ష్మి విద్యాదేవికి రాఖీ ఇచ్చి కట్టమని అంటుంది. విద్యాదేవి రాఖీ తీసుకుంటుంది. టీచర్ సుమతి కాదు అని తెలుసుకోవడానికి ఇలా రాఖీ కట్టమని చెప్తున్నా అని మహాలక్ష్మి అంటుంది. అభిమానంతో రాఖీ కట్టమంటే కడతారు కానీ అనుమానంతో కట్టమంటే ఎలా అని రామ్ అంటాడు. ఇక జనార్థన్ కూడా గతంలో సుమతి అనుకొని మీతో తప్పుగా ప్రవర్తించానని దానికి పరిహారంగా రాఖీ కట్టమని జనార్థన్ అడుగుతాడు. ఇంతలో జనార్థన్‌కి కాల్ వస్తుంది. సుమతి అని ఎవరో ఫోన్‌లో మాట్లాడుతారు. నేను ఉన్న అడ్రస్ మీకు పంపాను వెంటనే రమ్మని చెప్పడంతో జనార్థన్ బయల్దేరుతాడు. మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఇంతలో సీత మహాలక్ష్మి దగ్గరకు వచ్చి మా సుమతి అత్తమ్మ వస్తే మీ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నారా అని మహాలక్ష్మిని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: పంచకమణిని తాకినందుకు తిలోత్తమ చేతి గాయం మాయం.. సుమన కన్నింగ్ ప్లాన్!