Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today October 14th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ఫస్ట్ నైట్ గదిలో మిత్ర, లక్ష్మీ.. చాప, దిండు పట్టుకెళ్లిన జాను, మనీషా ప్లాన్ సూపర్!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode లక్ష్మీని సవతిగా ఒప్పుకోని మనీషా జానుని తోటికోడలిగా ఎలా ఒప్పుకుంటానని జాను ఫస్ట్ నైట్ జరగకుండా ప్లాన్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode జాను ఫస్ట్‌నైట్ గదిలోకి వెళ్తుంది కానీ తొలి రేయి జరగదు అని మనీషా దేవయానితో చెప్తుంది. లక్ష్మీని సవతి గానే ఒప్పుకోని నేను జానుని తోటి కోడలుగా ఎలా ఒప్పుకుంటానని.. శత్రువుకి ఆశపెట్టి చంపడమే నా స్టైల్ అని మనీషా అంటుంది. మొత్తానికి దేవయానిని ఒప్పించి హాల్‌లోకి తీసుకెళ్తుంది. వివేక్, జానులకు పెళ్లి పిల్లల్లా రెడీ చేస్తారు. ఇద్దరి నుదిటిన బాసిట కట్టి దండలు మార్చే కార్యక్రమం చేస్తారు. పెద్దలంతా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు.
జాను, వివేక్ ఇద్దరూ తర్వాత ఒకరి మీద మరొకరు పూల తలంబ్రాలు వేసుకుంటారు. తర్వాత ఉంగరం ఆట ఆడుతారు. అంతా చాలా సంతోషంగా ఉంటారు. మనీషా, దేవయాని మాత్రం కోపంతో ఉంటారు. వివేక్ మొదటి ఉంగరం దక్కించుకుంటాడు. పిల్లలు ఇద్దరూ పిన్నినే బాబాయ్‌ని గెలిపించిందని అంటారు.
అరవింద: జానుకి అన్నీ లక్ష్మీ పోలికలే. ఇతరులను గెలిపించడానికే లక్ష్మీ తన జీవితం అంకితం చేస్తుంది.
మనీషా: ఈ ఇంటి కోసం లక్ష్మీ ఏం త్యాగం చేసింది ఆంటీ. తను ఓడిపోయి మిత్రను ఎప్పుడు గెలిపించింది. తనది త్యాగం కాదు స్వార్థం. మిత్రను ఓడించి ఇంకెవరినో గెలిపించింది. అలాంటి స్వార్థపరురాలినా మీరు ఆకాశానికి ఎత్తేస్తుంది.
అరవింద: ఎవరు స్వార్థపరులో చెప్పమంటావా మనీషా. లక్ష్మీ ఎందుకు సైలెంట్‌గా ఉందో మాట్లాడమంటావా. అవకాశం దొరికిన ప్రతీసారి తనని ఎన్నో అంటున్నావ్.
మనీషా: నోరు తెరిచి మాట్లాడమనండి ఆంటీ నేను ఏమైనా వద్దు అన్నానా.
జయదేవ్: మిత్ర ముందు మార్కులు కొట్టేయాలని లక్ష్మీని తక్కువ చేసి మాట్లాడకు మనీషా. తను నోరు తెరిస్తే ఎవరు ఏంటో తెలుస్తుంది.
మిత్ర: అయితే తనని మాట్లాడమనండి డాడ్. ఏం జరిగిందో చెప్పమనండి.
మనీషా: చెప్పు లక్ష్మీ మిత్ర కూడా అడుగుతున్నాడు కదా.
అరవింద: చెప్పేయ్ లక్ష్మీ ఎవరి గురించి ఆలోచించకు.
లక్ష్మీ: అందుకు ఇప్పుడు సమయం సందర్భం కాదు ఇక్కడ జరిగే తంతు వేరు దాన్ని జరగనివ్వండి తర్వాత చూసుకుందాం.
దేవయాని: లక్ష్మీని భలే దెబ్బ కొట్టావ్ మనీషా దెబ్బకి అందరూ నోరు మూసేశారు.
లక్ష్మీ: పంతులు గారు ఇక మీరు కానివ్వండి.
పంతులు వివేక్, జానులతో బంతి ఆట ఆడిస్తారు. ఇక పంతులు సమయానికి ఇద్దరినీ గదిలోకి పంపించమని అంటారు పంతులు. లక్ష్మీ, సంజన కలిసి ఫస్ట్ నైట్ గది అలంకరిస్తారు. మీతో చెప్పకుండా పెళ్లి చేసినందుకు నాతో మాట్లాడరా అని అడుగుతుంది. ఈ పెళ్లితో వివేక్ అన్నయ్యకి నేను సాయం చేశానని అంటుంది సంజన. జాను విషయంతో మా అమ్మ ఏం చేసిందో వివేక్ చెప్పాడని మీతో చెప్తే కాదు అంటావ్ అని మీతో చెప్పకుండా చేశానని సంజన అంటుంది. ఇక ఇంతలో సంజనకు తన భర్త కాల్ చేస్తాడు. సంజన మాట్లాడుతుండగా మిత్ర వస్తే మిత్రను లక్ష్మీకి తోడు వెళ్లమని ఫస్ట్ నైట్ గది డెకరేషన్‌కి వెళ్లమని అంటుంది. సంజన కంగారు పెట్టేయడంతో మిత్ర వెళ్తాడు. ఇక వచ్చింది మిత్ర అని తెలియక లక్ష్మీ త్వరగా రా టైం అవుతుంది వచ్చి సాయం చేయ్ అని అంటుంది.
మిత్ర, లక్ష్మీ ఇద్దరూ కలిసి గది డెకరేట్ చేస్తారు. ఇక మధ్యలో లక్ష్మీ, మిత్ర ఒకర్ని ఒకరు గుద్దుకుంటారు. లక్ష్మీ సారీ చెప్తుంది. మీ ఇద్దరి చేతుల మీదగా కన్యాదానం జరిగింది ఇప్పుడు వాళ్ల గది కూడా రెడీ చేయడంతో ఇద్దరూ సంతోషంగా ఉంటారని సంజన అంటుంది. ఆ మాటకు అరవింద, జయదేవ్ కూడా సంతోషం పడతారు. వివేక్ గదిలో ఉండగా జాను పాల గ్లాస్‌తో వస్తుంది. ఇక ఇద్దరూ పాలు షేర్ చేసుకుంటారు. ఇక వివేక్ పాదాభివందనం చేయమని అంటాడు. ఇప్పటి వరకు నువ్వు మా వదిన చెల్లివి కానీ ఇప్పటి నుంచి నా భార్యవి కాబట్టి నేను చెప్పినట్లు చేయాలని అంటాడు. జాను దండం పెడితే సరదాగా అన్నానని నీ స్థానం నా పాదాల దగ్గర కాదు గుండెల్లో అని హత్తుకుంటాడు. ఇక జాను వివేక్‌ని బెడ్ మీద పడుకోమని తాను కింద పడుకుంటా అంటుంది. ఎందుకు అని వివేక్ అడగటంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: Amardeep Chowdary: హీరోగా అమర్‌దీప్ చౌదరి కొత్త సినిమా - బిగ్ బాస్ తర్వాత సెలెక్ట్ చేసిన స్క్రిప్ట్‌తో...