అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today November 6th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్రతో నిజం చెప్పనున్న అరవింద.. చెమటలు పట్టేసిన మనీషా.. సాక్ష్యం కోసం అరవింద పరుగులు!

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode తనని కాపాడటానికే లక్ష్మీ మనీషాకి మాట ఇచ్చి మిత్రకు మోసం చేసిందనే విషయం మిత్రకు చెప్పాలని అరవింద నిర్ణయించుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ దగ్గరకు అరవింద వస్తుంది. ఎలా ఉందని అడుగుతుంది. మిత్రనే దగ్గరుండి సేవలు చేసి వెళ్లారని అంటుంది లక్ష్మీ. మిత్రలో నిన్నటి నుంచి పాత మిత్రని చూస్తున్నాను అని ఆ ప్రేమ మళ్లీ కనిపిస్తుందని లక్ష్మీ అంటుంది. మనీషా చాటుగా ఆ మాటలు వింటుంది. దానికి అరవింద నీకు తల్లి అయినా అత్త అయినా నేనే ఇంకొక్క ముఖ్యమైనది ఆఖరిది ఒకటి ఉంది అది మిత్రకు చెప్పేస్తే అపార్థాలు తొలగి అందరం సంతోషంగా ఉంటామని చెప్తుంది. మనీషా చాలా టెన్షన్ పడుతుంది. 

లక్ష్మీ: ఏం చేయబోతున్నారు అత్తయ్య గారు.
అరవింద: నీకు మంచి జరగబోతున్నప్పుడు నన్ను ఆపొద్దు లక్ష్మీ.
లక్ష్మీ: ఏం చెప్పబోతున్నారు అత్తయ్య గారు వద్దు అత్తయ్య గారు. 
అరవింద: నువ్వేం చెప్పినా వినను లక్ష్మీ. నీకు ఇచ్చిన మాట తప్పుతున్నందుకు నన్ను క్షమించు లక్ష్మీ.
లక్ష్మీ: అత్తయ్య గారు అత్తయ్యగారు ఆగండి అత్తయ్యగారు జాను వివేక్ వస్తే అత్తయ్యని ఆపండి అత్తయ్య నిజం చెప్పాలని మీ అన్నయ్య దగ్గరకు వెళ్తున్నారు. ఆ పని అత్తయ్య చేస్తే మనీషా ఊరుకోదు. యాక్సిడెంట్ పేరు చెప్పి అత్తయ్యని అరెస్ట్ చేయిస్తుంది. అత్తయ్యకి జైలు శిక్ష పడుతుంది. పరువు పోతుంది. మామయ్య తట్టుకోలేరు. ఇంకా ఏం చూస్తున్నారు వెళ్లి ఆపండి.

జాను అరవిందను ఆపొద్దని నిజం తెలిస్తే వదిన జీవితం బాగుపడుతుందని అంటాడు. జానుని ఆపేస్తాడు. అరవింద మిత్ర దగ్గరకు వెళ్లి నీకో విషయం చెప్పాలని అంటుంది. మిస్ అండర్ స్టాండింగ్ గురించి చెప్పాలని ఆ అపార్థం వల్ల పెద్ద ఆఘాతం ఏర్పడిందని చెప్తుంది అరవింద. 

అరవింద: ఒక మనిషి భవిష్యత్ కోసం ఓ నిజం దాచబడింది.  ఆ భడబాగ్నిని మరో మనిషి తన గుండెల్లో దాచుకొని కాలిపోతుంది. నేను చెప్పబోయే విషయంలో ప్రేమ, స్వార్థం, త్యాగం, బాధ్యత అన్నీ ఉన్నాయిరా. 
మిత్ర: ఏంటి మమ్మీ అంత పెద్ద విషయం ఎవరు ఆ మనిషి.
అరవింద: ఇందులో నాకు భాగం ఉందిరా. విషయం చెప్పిన తర్వాత నువ్వు నన్ను అసహ్యించుకుంటావ్ అయినా పర్వాలేదు మిత్ర నేను ఈ విషయం చెప్పి తీరాలి. ఇప్పటికీ చెప్పకపోతే నన్ను నేను కూడా క్షమించుకోలేను. అసలేం జరిగింది అంటే..
జయదేవ్: అరవింద నీతో మాట్లాడాలి రా. నేను నీకో విషయం చెప్పాలి వస్తావా. 
అరవింద:  మిత్రతో మాట్లాడి వస్తానండీ.
జయదేవ్: ముందురా నీ భర్తగా ఆజ్ఞాపిస్తున్నా నా మాట మీద ఏం మాత్రం గౌరవం ఉన్నా త్వరగా రా. 

మిత్రతో ఏం మాట్లాడుతున్నావ్ అరవింద అని మనీషా బెదిరించిందని అందుకే లక్ష్మీ ప్రవీణ్ మిట్టల్‌కి మన షేర్లు ఇచ్చేసింది అని చెప్తావా మిత్ర సాక్ష్యాలు లేకుండా నమ్ముతాడా అని అడుగుతాడు. లక్ష్మీ కోసమే నువ్వు ఇలా చెప్తున్నావ్ అని అనుకుంటాడని మనీషా కూడా రెచ్చిపోతుందని అంటాడు. మొత్తానికి జయదేవ్ అరవిందని ఆపేస్తాడు. మనీషా దగ్గరకు దేవయాని వెళ్లగానే నేను ప్రాబ్లమ్‌లో ఉండగానే వెళ్లిపోయి ఇప్పుడు వచ్చారా అని మనీషా అడుగుతుంది. అరవింద ఆంటీని ఆపేలా జయదేవ్‌తో నేనే బెదిరించానని మనీషా అంటుంది. మరోవైపు సరయు క్రైన్ డ్రైవర్ గురించి వెతికిస్తుంది. పోలీసులకు వాడు దొరికితే మొత్తం చెప్పేస్తాడని అంటుంది. ఇంతలో మనీషా సరయుకి కాల్ చేస్తుంది.

ఆ డ్రైవర్ దొరకపోతే మన పని అయిపోతుందని తొందరగా పట్టుకోమని అంటుంది. ఇంతలో ఆ డ్రైవర్ రంగా అరవిందకి కాల్ చేసి తనతో ఆ పని చేయించారని మొత్తం చెప్తాను రండి అని లొకేషన్ షేర్ చేస్తాడు. మనీషా దొరికావ్ అనుకొని అరవింద బయల్దేరుతుంది. ఇంతలో మిత్ర ఎక్కడికి మమ్మీ అని అడుగుతాడు. వచ్చాకా అన్నీ చెప్తానని అంటుంది. అరవింద ఒంటరిగా వెళ్తుంది. మిత్ర మనీషాతో అరవింద సాక్ష్యం గురించి వెళ్తుందని చెప్తాడు. మనీషా చాలా టెన్షన్ పడుతుంది. మనీషా సరయుకి కాల్ చేసి రంగా గురించి అరవిందకు తెలిసిపోయిందని ఫాలో అవ్వమని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: నేనే సుమతి అని చెప్పి మహాలక్ష్మీ గొంతు నులిపేసిన విద్యాదేవి.. వారంలో ప్రీతి పెళ్లి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
US Election 2024 Updates: అమెరికా అధ్యక్ష పదవికి చేరువలో డొనాల్డ్ ట్రంప్‌- 200పైగా ఎలక్టోరల్స్‌లో విజయం
అమెరికా అధ్యక్ష పదవికి చేరువలో డొనాల్డ్ ట్రంప్‌- 200పైగా ఎలక్టోరల్స్‌లో విజయం
Andhra Politics: కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
Congress Nalgonda:  మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాపై హత్యాయత్నం? ఆ ఖర్మ లేదు.. విజయమ్మ భావోద్వేగంIPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
US Election 2024 Updates: అమెరికా అధ్యక్ష పదవికి చేరువలో డొనాల్డ్ ట్రంప్‌- 200పైగా ఎలక్టోరల్స్‌లో విజయం
అమెరికా అధ్యక్ష పదవికి చేరువలో డొనాల్డ్ ట్రంప్‌- 200పైగా ఎలక్టోరల్స్‌లో విజయం
Andhra Politics: కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
Congress Nalgonda:  మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
Actress Kasthuri: తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
RRB: ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ఒకటే గ్రామీణ బ్యాంక్‌ - స్పెషల్‌ కేస్‌గా తెలంగాణ
ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ఒకటే గ్రామీణ బ్యాంక్‌ - స్పెషల్‌ కేస్‌గా తెలంగాణ
Caste Census : జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చివరి అస్త్రం కులగణన - రాహుల్ గాంధీకి ఇదే చివరి అవకాశమా ?
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చివరి అస్త్రం కులగణన - రాహుల్ గాంధీకి ఇదే చివరి అవకాశమా ?
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
Embed widget