Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మితో కలిసి పూజ చేసిన మిత్ర.. జున్ను తల్లే తన అక్క అని తెలుసుకున్న జాను!
chiranjeevi lakshmi sowbhagyavathi today episode దీక్షితులు గారి సాయంతో లక్ష్మీతో కలిసి మిత్ర దీక్షలో పాల్గొనడం అరవింద కోడలి కోసం ప్రసాదం చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: లక్కీ అమ్మా అంటూ లక్ష్మితో కూడా వీడియో కాల్ మాట్లాడుతుంది. ఆ టైంలో మిత్ర వాటర్ తీసుకురావడానికి వెళ్తాడు. లక్కీ లక్ష్మిని ఇంటికి రమ్మని పిలుస్తుంది. దాంతో లక్ష్మి చిన్న పని ఉందని అది అయిపోయిన తర్వాత వస్తాను అని చెప్తుంది. మిత్ర వచ్చే టైంకి లక్ష్మి ఫోన్ జున్నుకి ఇస్తుంది. ఇక జున్ను లక్కీతో మీ నాన్నకి నవ్వడం నేర్చుకోమని చెప్పు అంటాడు. అది మిత్ర వినేస్తాడు.
ఉదయం గుడి దగ్గర దీక్షకు దీక్షితులు గారు అన్ని ఏర్పాట్లు చేస్తారు. లక్ష్మీ కూడా గుడికి వచ్చేస్తుంది. దీక్షితులు గారు పూజలో లక్ష్మి కట్టుకోవాల్సిన పసువు బట్టలు ఇస్తారు.
లక్ష్మి: ఈ దీక్ష మొత్తం మిత్ర గారి సమక్షంలో జరగాలి అంటున్నారు మరి. ఇదంతా ఏ విధంగా సాధ్యం దీక్షితులు గారు.
దీక్షితులు: సంకల్పం ఉంటే అదే సాధ్యమవుతుంది.
లక్ష్మి: మిత్ర గారి కంటికి నేను కనిపించకూడదు. అసలు నేను బతికి ఉన్నాను అని ఆయనకు తెలీకూడదు. అలాంటిది ఆయనతో పాటు దీక్ష చేసే అవకాశం నాకు ఎలా వస్తుంది దీక్షితులు గారు. నేను ఆయనకు కనిపిస్తే పరిస్థితులు ఎంతకైనా దారితీస్తాయి. నన్ను ఆయన అత్తయ్య చూస్తే కొత్త సమస్యలు వస్తాయి. అలాంటప్పుడు ఈ దీక్ష ఏ విధంగా సాధ్యం అవుతుందో అర్థం అవ్వడం లేదు.
దీక్షితులు: అమ్మ లక్ష్మి ఈ పసుపు చీర కట్టుకొని పసుపు ముఖానికి రాసుకొని పెద్ద బొట్టు పెట్టుకో అది చాలు వాళ్లు నిన్ను గుర్తు పట్టకుండా ఉండటానికి. నీతో పాటు కలిసి పూజ చేయడానికి. అంతా మంచే జరుగుతుంది ఇక నీ మనసులో ఏం పెట్టకోకు.
పూజకు వచ్చిన వాళ్లు లక్ష్మీకి అభిషేకంలా నీరు పోసి పసుపు చీర కట్టి పసుపు పూసి అమ్మవారిలా సిద్దం చేస్తారు. ఇక లక్ష్మి పూజ దగ్గరకు వస్తుంది. దీక్షితులు గారు లక్ష్మీతో అడుగడుగునా మిత్ర చేయి కలుస్తుందని అంటారు. లక్ష్మి మిత్ర గండం పోవాలని దీక్షకు ఎలాంటి ఆటంకం రాకుండా చూసుకో అని కోరుకుంటుంది. ఇక మిత్ర, అరవిందలు గుడికి వస్తారు. వాళ్లని చూసి లక్ష్మీ టెన్షన్ పడుతుంది. అరవింద, మిత్రలు లక్ష్మిని చూస్తారు కానీ గుర్తు పట్టరు. దీక్షితులు గారు మిత్రతో దీపం వెలిగించి పూజ ప్రారంభించమంటారు. మిత్ర దీపం వెలిగిస్తాడు. లక్ష్మి గురించి అరవింద అడిగితే తన భర్తకి కూడా గండం వెంటాడుతుందని దాని కోసమే కఠినమైన దీక్ష చేస్తుందని అంటాడు. ఇక లక్ష్మికి దీక్షితులు గారు కోనేటి నుంచి నీరు తీసుకురమ్మని చెప్తారు.
మిత్ర: దీక్షితులు గారు ఆ అమ్మాయికి మేం తన సొంత మనుషుల స్థానంలో ఉండి సాయం చేయొచ్చా.
దీక్షితులు: తప్పకుండా మిత్ర కానీ ఒక్కసారి చేయి అందిస్తే దీక్ష పూజ అయిన వరకు తోడు ఉండాలి. అలా కుదురు తుంది అంటేనే సాయం చేయు మిత్ర.
మిత్ర: తప్పకుండా దీక్షితులు గారు.
లక్ష్మి తల మీద మిత్ర మట్టి కుండలు పెట్టి వాటి మీద దీపం పెడతాడు. లక్ష్మి చాలా సంతోషిస్తుంది. తల మీద దీపంతోనే ఆ అమ్మాయి 108 ప్రదక్షిణలు చేస్తుందని తనతో పాటే నువ్వు కూడా ప్రదక్షిణలు చేయాలని తన తల మీద దీపం ఆగిపోకుండా నువ్వు రక్షణగా ఉండాలి అని దీక్షితులు గారు చెప్తారు. మిత్ర, లక్ష్మిలు ప్రదక్షిణలకు వెళ్తారు. ఇక అరవింద ఆ అమ్మాయి ఎవరు అని దీక్షితులు గారిని అడుగుతారు. తను ఆ రోజు అడవికి వచ్చిన అమ్మాయి అని దీక్షితులు గారు చెప్తారు. తన సంకల్పానికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అని భర్త కోసం ఇంతలా పరితపించే అమ్మాయిని చూడలేదు అని అరవింద లక్ష్మిని మెచ్చుకుంటుంది. తనకి కూడా ఆ అమ్మాయికి సాయం చేయాలి అని అరవింద అంటే దానికి దీక్షితులు గారు ప్రదక్షణ అయ్యేలోపు ఆమె కోసం ప్రసాదం వండి ఆమెకు పెట్టు అని చెప్తారు. దీంతో అరవింద సరే అని వెళ్తుంది.
మరోవైపు జాను వెళ్తుంటే చలమయ్య కనిపిస్తాడు. ఇంటికి రమ్మని పిలుస్తాడు. జున్ను కూడా సంతోషిస్తాడు రమ్మని పిలుస్తారు. ఇక ఇంట్లో లక్ష్మీ అమ్మ లేరు అని చలమయ్య అనడంతో జాను షాక్ అవుతుంది. జాను చలమయ్యతో లక్ష్మి ఎవరు అని అడుగుతుంది. లక్ష్మి జున్ను వాళ్ల అమ్మ అని చలమయ్య జానుతో చెప్తాడు. లక్ష్మి ఎవరు అని జాను ఆలోచిస్తుంది. చలమయ్య చెప్పేది తన అక్క గురించేనా అని అనుకుంటుంది. చలమయ్యతో వెళ్లడానికి రెడీ అవుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.