Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ముసుగు లేడీ లక్ష్మీ అని కనిపెట్టేసిన మనీషా.. లక్కీకి గాయం, మిత్ర సమస్యకు పరిష్కారం!
chiranjeevi lakshmi sowbhagyavathi today episode మిత్ర సమస్యకు పరిష్కారం దొరికిందని దీక్షితులు గారు చెప్పడంతో లక్ష్మీ హడావుడిగా ఆశ్రమానికి పరుగులు తీయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: దేవయాని మనీషాతో అనుకున్న సమయానికి అనుకున్న అమ్మాయితో పెళ్లి జరగడం ఖాయం అని చెప్తూ హ్యాపీగా ఫీలవుతుంది. మనీషా ఆలోచనలో పడుతుంది. ఏమైంది అని దేవయాని అడిగితే వివేక్ ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నాడు అని అక్కడ మనం మాట్లాడలేదు అని అయినా సరే ఆ ముసుగు వేసుకున్న ఆవిడ ఎందుకు అలాంటి ఉదాహరణ ఇచ్చిందని అడుగుతుంది. దాంతో దేవయాని కూడా ఆలోచనలో పడుతుంది.
మనీషా: ఆ ముసుగు లేడీకి మన విషయాలు అన్నీ తెలుసుంటాయి. తను ఎవరో తెలియని వ్యక్తి కాదు మనకు బాగా తెలిసిన వ్యక్తి. మన ఇంట్లో విషయాలు తెలిసిన వ్యక్తి. నా అనుమానం నిజం అయితే తనే లక్ష్మి.
దేవయాని: మనీషా నీకు పిచ్చా. లక్ష్మీ అక్కడ ఎందుకు వస్తుంది. అసలు చచ్చిపోయిన లక్ష్మీ ఎలా తిరిగి వస్తుంది.
మనీషా: ఆంటీ మీరే సరిగ్గా ఆలోచించలేకపోతున్నారు. దీక్షితులు గారు లక్ష్మి బతికే ఉంది అన్నారు. ఆ ముసుగు ఆవిడ మన విషయాలు అన్నీ చెప్పింది. పైగా ఆ గొంతు నాకు ఇంకా గుర్తే అది లక్ష్మి గొంతే. సో లక్ష్మినే అని నేను నిరూపిస్తాను చూడండి. డ్రైవర్ యూ టర్న్ తీసుకో.
దేవయాని: మనీషా నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావ్ అనిపిస్తుంది.
లక్ష్మి దీక్షితులు గారి దగ్గర ఉంటుంది. దేవయాని, మనీషా మళ్లీ ఆశ్రమం దగ్గరకు వస్తారు. వాళ్లు రాగానే లక్ష్మి అక్కడ ఉండదు. మనీషా ముసుగు వేసుకున్న ఆవిడ గురించి అడుగుతుంది. తను లక్ష్మినే కదా అని అంటుంది. దీక్షితులు గారు మనీషాని అపార్థం చేసుకుంటున్నావ్ అని ఏదో ఒక రోజు లక్ష్మీ మీకు ఎదురు పడుతుంది అప్పటి వరకు ఎదురు చూడమని అంటారు. దీంతో దేవయాని మనీషాని తీసుకొని వెళ్లిపోతుంది.
గదిలో మిత్ర తన తల్లి మాటలు తలచుకొని ఆలోచిస్తుంటాడు. ఉదయమే మూడ్ పోయిందని ఈ రోజు అంతా ఎలా ఉంటుందో అని ఆలోచిస్తాడు. ఇక లక్కీ మిత్ర దగ్గరకు వచ్చి ఫొటో గురించి అడుగుతుంది. తను జున్ను వాళ్ల అమ్మ అని చెప్పేలోపు మిత్ర ఆపేస్తాడు. లక్కీ మీద సీరియస్ అవుతాడు. దాంతో లక్కీ వెళ్లిపోతుంది. అరవింద అక్కడికి వచ్చి మిత్ర మీద కోప్పడుతుంది. ఇంతలో లక్కీ కింద పడి మోకాలికి దెబ్బ తగులుతుంది. మిత్ర పరుగున వెళ్లి హగ్ చేసుకుంటాడు. మనసులో నొప్పిగా ఉందని లక్కీ మిత్రతో చెప్తుంది. మిత్ర సారీ చెప్పి లక్కీని దగ్గరకు తీసుకుంటాడు. మిత్ర డాక్టర్‌ని పిలిపించి లక్కీకి కట్టు కట్టిస్తాడు. మరోవైపు జున్ను లక్ష్మీ ఫోన్ తీసుకొని లక్కీకి కాల్ చేయాలని అనుకుంటాడు. జున్ను వివేక్‌కి కాల్ చేస్తాడు. ఇక అరవింద కాల్ మాట్లాడి లక్కీకి దెబ్బ తగిలింది అని స్కూల్‌కి రాదు అని చెప్తుంది. వెంటనే వస్తాను అని జున్ను చెప్తాడు.
అరవింద: లక్కీకి దెబ్బ తగిలింది అని జున్ను తెగ కంగారు పడతాడు.
లక్కీ: జున్ను అంతే నానమ్మ స్కూల్‌లో కూడా నన్ను ఎవరు ఏమైనా అంటే గొడవ పెట్టుకుంటాడు.
మిత్ర: ఆ జున్ను గాడి ఏం చేసినా మీరు ఎందుకు భజన చేస్తారు.
అరవింద: వాళ్ల ఇద్దరి మధ్య స్నేహం కంటే ఇంకా గొప్ప బంధం ఏదో ఉంది.
మిత్ర: మనసులో.. ఈ జున్ను గాడు మళ్లీ మార్కులు కొట్టేసినట్లు ఉన్నాడు. ఇప్పుడు ఇంకా వాడు లక్కీకి దగ్గరైపోతాడో ఏంటో.
లక్కీని చూడాలి అని జున్ను బయల్దేరితే లక్ష్మి, వసుధారలు కూడా బయల్దేరుతారు. ఆ ఏరియా చూసి లక్ష్మి మిత్ర గారి ఏరియా అనుకుంటుంది. ఇంతలో దీక్షితులు గారు లక్ష్మికి కాల్ చేసి మిత్ర సమస్యకు పరిష్కారం దొరికిందని చెప్తాడు. ఉన్నపళంగా రమ్మని చెప్తారు. దాంతో లక్ష్మీ కారు దిగి వెళ్లిపోతుంది. ఇక దేవయాని, మనీషాలు వచ్చి లక్కీ గాయం చూసి అరవింద దగ్గర సెటైర్లు వేస్తారు. ఇక దీక్షితులు గారి దగ్గరకు వెళ్లామని చెప్తుంది. దీక్షితులు గారు వివేక్‌కి కచ్చితంగా అదే ముహూర్తానికి పెళ్లి అవుతుందని చెప్పారని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.