Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today January 6th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్ర ఇంట్లో ఆస్తి పంపకాలు.. ఇంట్లో మీడియా.. మనీషా, జానుల రచ్చ మామూలుగా లేదుగా!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode ఆస్తి రెండు భాగాలు చేయమని జాను, దేవయానిలు రచ్చ రచ్చ చేయడంతో మనీషా మీడియాని ఇంటికి రప్పించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode వివేక్‌కి ఫ్యాక్టరీ బాధ్యతలు అప్పగించాలని లక్ష్మీ, మిత్ర జయదేవ్ నిర్ణయించుకొని ఇంట్లో విషయం చెప్తారు. దేవయాని సంతోష పడుతుంది. బావగారికి థ్యాంక్స్ కూడా చెప్తుంది. ఇంతలో జాను వచ్చి ఒక్క ఫ్యాక్టరీ బాధ్యత ఇచ్చేసి మిగతా అన్నీ మీరు తీసుకోవాలి అనుకుంటున్నారా అని గొడవ పెట్టుకుంటుంది. ఆస్తి సమానంగా పంచాలని గోల చేస్తుంది. దేవయాని, జాను ఇద్దరూ మిత్ర, లక్ష్మీలతో గొడవ పడతారు. లక్ష్మీ, మిత్ర వాళ్లు బాధ పడితే మనీషా మనసులో ఈ కుటుంబం రెండు ముక్కలు అయ్యే వరకు ఈ గొడవ ఆగదు ఆగనివ్వను అని అనుకుంటుంది.
పిల్లలు గొడవ చూసి తాత దగ్గరకు వచ్చి పిన్ని, చిన్ననానమ్మ అమ్మానాన్నతో గొడవ పడ్డారు కదా మనం విడిపోతామా అందరం కలిసి ఉందాం మీరు ఇంటికి పెద్ద కదా మీరు చెప్పి అందర్ని కలిపి ఉంచండి అని చెప్తారు. ఆ మాటలు విన్న లక్ష్మీ వచ్చి పిల్లల్ని స్కూల్‌కి టైం అయిందని చెప్పి పంపేస్తుంది. అరవింద లేక నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది నిస్సహాయంగా ఉండిపోయానని ఈ కుటుంబం రెండు ముక్కలు కాకుండా నువ్వే చూడాలని లక్ష్మీ రెండు చేతులు పట్టుకొని జయదేవ్ కోడలు లక్ష్మీకి సాయం అడుగుతాడు.
లక్ష్మీ: సాయం ఏంటి మామయ్య గారు అది నా బాధ్యత.
జయదేవ్: ఆస్తి పంచుకొని వాళ్లు బయటకు వెళ్తే బతకలేరు. వాళ్లని ఆదుకొని ఈ కుటుంబం కలిసి ఉండేలా చూడమ్మా.
లక్ష్మీ: అంతా నేను చూసుకుంటా మామయ్య మీరు రెస్ట్ తీసుకోండి.
మనీషా: ట్విస్ట్ ఎలా ఉంది లక్ష్మీ అదిరిపోయింది కదా. నీ చెల్లి ఆస్తి పంచమని అడుగుతుందని అనుకోలేదు కదా. ఈ కుటుంబం రెండు ముక్కలు కాకుండా నువ్వు చేయలేవు. ఈ విషయంలో నీకు ఓటమి తప్పదు ఎందుకంటే ఇది నా ప్లాన్.
లక్ష్మీ: ఇప్పటి వరకు నువ్వు వేసిన అన్నీ ప్లాన్స్‌లో నేను గెలిచా నువ్వు ఓడిపోయావ్.
మనీషా: ఇప్పటి వరకు ఒక లెక్క కానీ ఇప్పుడొక లెక్క ఇది పద్మవ్యూహం అని గుర్తు పెట్టుకో. ఇదంతా నేను మిత్ర కోసమే చేస్తున్నా. ఆస్తి రెండు భాగాలు అయితే మీ మామయ్య ఇంటిని వదిలి వెళ్లరు. బయటకు వెళ్తే జాను, వివేక్ బతకలేరు కాబట్టి వాళ్లని వెళ్లనివ్వరు. ఇక బయటకు వెళ్లేది నువ్వు మిత్ర పిల్లలు మాత్రమే. అప్పుడు నేను మిత్రని ఎత్తుకుపోతా ఇది నా ప్లాన్ ఎలా ఉంది.
లక్ష్మీ: ఏడ్చినట్లుంది.
మనీషా: ఈ సారి గెలిచేది నేను ఎందుకో తెలుసా నీ సొంత వాళ్లని నీ శత్రువుల్ని చేసి నేను ఆడుతున్న ఆట ఇది చేతనైతే ఆపు చూద్దాం.
మనీషా సరయు దగ్గరకు వెళ్లి ఇంట్లో చిచ్చు పెట్టానని ఇప్పుడు అది ఆస్తి పంపకాల వరకు వచ్చిందని అంటుంది. సరయు సూపర్ అని మనీషాకు చెప్తుంది. ఇది సరిపోదని ఇంట్లో ఇంకా రచ్చ జరిగి అందరూ కొట్టుకొని చావాలని అంటుంది. దానికి సరయు ఈ రచ్చ ఆ ఇంటితో సరిపోదని ప్రతీ ఇంటికి పాకాలని చెప్తుంది. దానికి ఓ సెటప్ చేశానని సరయు చెప్పి మీడియా వ్యక్తని పిలిపిస్తుంది. మిత్ర ఇంట్లో జరిగబోయే గొడవని లైవ్ టెలికాస్ట్ చేద్దమని అంటుంది.
వివేక్ జాను మీద కోప్పడతాడు. నీ పుట్టింటి ఆస్తి రాలేదని ఇలా చేస్తున్నావా అని తిడతాడు. తల్లిని కూడా తిడతాడు. నేను చేయలేని పని నా కోడలు చేస్తుందని దేవయాని అంటుంది. జాహ్నవి మాట వింటే నువ్వు బాగుపడతావని అంటుంది. లక్ష్మీ మాట విని మిత్ర బాగుపడ్డాడని అలాగే జాను కూడా నిన్ను మంచి పొజిషన్లో పెట్టాలని అంటుందని చెప్తుంది. విడిపోతే గౌరవం రాదని వివేక్ అంటాడు. అయినా జాను, దేవయాని ఒప్పుకోరు. ఆస్తి దక్కే వరకు వెనక్కి తగ్గేదే లేదని చెప్తారు. ఉదయం మీడియా మొత్తం మిత్ర ఇంటికి వచ్చేస్తుంది. దేవయాని మనీషాకు ఆ విషయం చెప్తే ఏ అవకాశాన్ని వదులు కోవద్దని మనీషా దేవయానికి చెప్తుంది. మీడియా మిత్ర వాళ్ల దగ్గరకు వచ్చి మీ ఇంట్లో జరిగేది ప్రపంచానికి చూపించడానికి వచ్చామని అంటుంది. అందరూ హాల్ లోకి చేరుకుంటారు నందన్ ఫ్యామిలీలో గొడవలు ఉన్నాయని ఆస్తి గొడవలు జరుగుతున్నాయనీ లక్ష్మీ వల్లే ఇదంతా జరుగుతుందని మీడియా అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ఇంట్లో దీప వంటలు.. కాళ్లు మొక్కతా అన్న పారు.. రెస్టారెంట్ పెట్టిస్తానన్న జ్యోత్స్న.. నిజమేనా?