Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today January 31st: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్ర మీద అటాక్.. వదిలేసి వెళ్లిపోయిన లక్ష్మీ.. కాపాడేదెవరు?
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మిత్రకు గండం ఉందని తెలుసుకున్న లక్ష్మీ మిత్రని ఇంట్లో ఉంచి తాను గుడికి వెళ్లడం రౌడీలు మిత్ర మీద అటాక్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode జాను లక్ష్మీకి పోటీ ఇవ్వాలని అనుకుంటే వివేక్ జానుతో వదిన ఎప్పుడైనా నిన్ను ఆఫీస్‌కి రావొద్దని చెప్పిందా నిన్ను వంటకే పరిమితం అయిపోమని చెప్పిందా అని అడుగుతాడు. దాంతో జాను గతంలో లక్ష్మీ తనని ఆఫీస్‌కి రమ్మని చెప్పడం గుర్తు చేసుకుంటుంది. ఇక గతంలో లక్ష్మీ నీ గురించి నాతో మాట్లాడిందని చెప్తాడు. జాను ఎదిగిన పసిపిల్ల అని దానికి కావాల్సిన వాటి కోసం మొండి పట్టుపడుతుందని తన కంటే మంచిదని ప్రేమిస్తే ప్రాణం ఇస్తుందని తన తల్లి అయినా అక్క అయినా నేను అని అంటుంది.
మీ అక్క కోసం నీ కంటే నాకే బాగా తెలుసు అని మా అమ్మ చెప్పిందనో మనీషా చెప్పిందనో మారొద్దని అమ్మానాన్నల లాంటి అన్నయ్య వదినల్ని దూరం చేసుకోకూడదని అంటాడు. అక్క గొప్పతనం గుర్తించమని అంటాడు. ఇక పిల్లలు హాల్‌లో ఆడుకుంటుంటారు. ఇంతలో జయదేవ్ వస్తాడు. మనీషా, దేవయానిలు వచ్చి మేమే వచ్చేస్తాం కదా మీరు ఎందుకు అని వచ్చారని అడుగుతారు. దాంతో లక్ష్మీ, జానుల సాహసం పేపర్‌లో చూశానని అంటాడు. ఇక మనీషా దేవయానితో జయదేవ్ వచ్చింది పరామర్శకి కాదు మిత్రకు గండం ఉందని అంటుంది. మిత్రని చంపి లక్ష్మీ మీద పగ తీర్చుకుంటున్నాడని చెప్తుంది. నర్శింహ మన అందరిని చంపాలని చూస్తున్నాడని అంటుంది. ఇక దేవయాని మనీషాతో మిత్ర చనిపోతే నీకు జీవితమే ఉండదు మిత్రకు ఈ విషయం చెప్పి హెచ్చరిద్దామని అంటుంది.
నర్శింహ రౌడీలు లక్ష్మీ ఇంటి బయట వెయిట్ చేస్తూ మిత్రని చంపడానికి కాపలా కాస్తుంటారు. నర్శింహ కాల్ చేసి ఎలా అయినా మిత్రని చంపేయమని అంటాడు. జయదేవ్ లక్ష్మీతో మిత్రకు గండం ఉందని త్వరగా ఇంటికి వెళ్లిపోవాలని బయటకు వస్తేనే గండం అని అంటాడు. గుడిలో పూజ అయిపోతే వెళ్లిపోదామని లక్ష్మీ అంటే మిత్రని ఇంట్లోనే ఉంచేద్దామని దేవయాని అంటుంది. ఇంతలో మనీషా వచ్చి మిత్ర గండానికి కారణం నువ్వే అని అంటుంది. పండగకు వచ్చి పక్క ఊరి గొడవల్లో దూరి మిత్రకు గండం తీసుకొచ్చావని అంటుంది. మిత్రకు ఏమైనా అయితే నా జీవితానికే అర్థమే లేదని అంటుంది. దాంతో లక్ష్మీ మిత్రను నువ్వు ప్రేమించావ్ నేను పెళ్లి చేసుకున్నాను. ఏమైనా అయితే నేనే ఎక్కువ ఎఫెక్ట్ అవుతా అని అంటుంది. ఇక జయదేవ్ లక్ష్మీని గుడికి వెళ్లిరమ్మని అంటాడు. ఇక అందరూ గుడికి వెళ్లడానికి రెడీ అవుతారు. లక్ష్మీ పిల్లలు మగవాళ్లని ఇంట్లో ఉండమని తాను, జాను, మనీషా, దేవయాని గుడికి వెళ్లి వస్తామని అంటుంది. ఇక బయట ఇద్దరు పని వాళ్లని జాగ్రత్తగా చూసుకోమని అంటుంది.
లక్ష్మీ వాళ్లు వెళ్లగానే రౌడీలు ఇంట్లోకి దూరుతారు. మిత్ర తండ్రిని నిలదీస్తాడు. లక్ష్మీ తనని ఇంట్లోనే ఉండమని అనడం బయట మనుషులకు జాగ్రత్త చెప్పడం నాకు ఏదో అనుమానంగా ఉందని అంటే జయదేవ్ నిజమే అని నీకు గండం ఉందని అందుకే ఇంట్లో ఉంచిందని చెప్తాడు. లక్ష్మీ వాళ్లు గుడికి చేరుకుంటారు. అమ్మవారి చుట్టూ ఇద్దరూ అక్కాచెల్లెళ్లు ప్రదక్షిణులు చేస్తారు. ఇంతలో రౌడీలు బయట పనివాళ్లని కొడతారు. అది చూసిన జయదేవ్ డోర్ క్లోజ్ చేసి ఇంటి డోర్స్ అన్నీ మూసేస్తారు. నర్శింహ మనుషుల్లా ఉన్నారని మన మీద అటాక్ చేయడానికి వచ్చారని వివేక్ అంటే దానికి మిత్ర నా మీదకే వస్తే అక్కడ లక్ష్మీ పరిస్థితి ఏంటా అని బయటకు వెళ్లాలని అంటాడు. ఇక లక్ష్మీ, జానులకు పుట్టింటి సారెను పంతులు అందజేస్తాడు. రౌడీలు తలుపులు బద్దల కొడుతుంటే వివేక్ అడ్డు వెళ్తాడు. జయదేవ్ మిత్రని తీసుకొని వెళ్తాడు. కానీ మిత్ర ఒప్పుకోడు. రౌడీలు వివేక్ తల మీద కొట్టేస్తారు. మిత్ర రౌడీలను కొడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: పాపకి 50.. కార్తీక్‌కి 50.. దీపతో జ్యోత్స్న బేరం.. కూతిరి కోసం జ్యో కండీషన్‌కి దీప ఒప్పుకుంటుందా!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

