Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today January 21st: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: పాత జ్ఞాపకాలు లక్ష్మీ, జానులను ఒకటి చేస్తాయా.. వీలునామా కాల్చేసిన మనీషా!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode లక్ష్మీ చెల్లి జానుకి గోరు ముద్దలు పెట్టడం మనీషా వీలునామా దొంగతనం చేసి మంటల్లో కాల్చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తకరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ, జానులను కలపడానికి మిత్ర, వివేక్‌లు ప్లాన్ చేస్తారు. అందరూ ఒకే చోట చేరి అన్నం, అవకాయ్, నెయ్యి అన్నం లక్ష్మీతో ముద్దలు పెట్టించుకొని తినాలని ఏర్పాట్లు చేస్తారు. తాతగారిని లక్ష్మీ, జానుల చిన్నతనం విషయాలు చెప్పమని అంటారు. తాత గారు ఓ పెట్టను చూపించి అది మైల పెట్టె అని అందులో పాత బట్టలు పెడతారని లక్ష్మీకి పదేళ్ల వయసు జానుకి ఆరు ఏడేళ్ల వయసని ఇద్దరూ తోటి పిల్లలతో దాగుడు మూతలు ఆడారని చెప్తారు.
జాను అప్పుడు ఆ మైల పెట్టె తెరచి ఉండటంతో జాను అందులో దాక్కుందని అనుకోకుండా ఆ పెట్టె మూత పడిపోయి జాను అందులో చిక్కుకుందని లక్ష్మీ అందరిని పట్టుకొని జాను కోసం లక్ష్మీ కంగారు పడి ఏడుస్తూ ఇళ్లంతా వెతికిందని ఇక జాను ఆ పెట్టెలో ఊపిరి ఆడక కళ్లు తిరిగి పడిపోయిందని లక్ష్మీకి అనుమానం వచ్చి పెట్టె తెరిచే సరికి జాను కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతుందని లక్ష్మీ సీపీఆర్ చేసి జానుని బతికించుకుందని ఎమోషనల్ అయి చెప్తారు. జాను ఆ సంఘటన గుర్తు చేసుకొని ఏడుస్తుంది. లక్ష్మీ కూడా చెల్లిని చూసి ఏడుస్తుంది. ఆ రోజు లక్ష్మీ జానుకి మళ్లీ ఎప్పుడు ఏం కాకూడదని లక్ష్మీ దానికి తాళం వేయించిందని ఇప్పుటి వరకు ఎప్పుడూ ఆ పెట్టె తెరవ లేదని చెప్తారు. ఇంతలో జాను ఏడుస్తూ చేయి వణుకుతూ లక్ష్మీ దగ్గరకు చాచుతుంది. లక్ష్మీ ఎమోషనల్ అయి సంతోషంతో ముద్దు కలిపి చెల్లికి ఇస్తుంది. మనీషా, దేవయాని షాక్ అయిపోతారు. జాను తినడం చూసి మిత్ర, వివేక్ తమ ప్లాన్ పని చేసిందని అనుకుంటారు. మనీషా, దేవయానిలు గోరు ముద్దలు తినడం తమ వల్ల కాదని వెళ్లిపోతారు.
రాత్రి మనీషాకి నిద్ర లేచి పడుకున్న దేవయానికి లేపుతుంది. వీలునామా పత్రాలు దొంగతనం చేయాలని తాతగారి గదిలోకి ఇద్దరూ వెళ్తారు. మొత్తం వెతికి తాతగారి పక్కనే ఉన్న బీరువా తాళాలు తీసుకుంటారు. ఇక పక్కనే ఉన్న చెంబు పడిపోవడంతో తాతగారు లేస్తారు. ఇద్దరూ మంచం వెనక్కి వెళ్లి దాక్కుంటారు. తాతగారు చెంబు చూసి మళ్లీ పడుకుంటారు. బీరువా తాళాలు తీసి దేవయాని వీలునామా తీస్తుంది. ఇక అక్కడున్న డబ్బు, నగలు చూసి మనీషా దేవయానితో ఎంత డబ్బు, ఎన్ని నగలు ఎంత ఉన్నా అక్కా చెల్లెళ్లు ఏం లేనట్లు ఉంటారని అనుకుంటారు. ఇక వీలునామా తీసుకొని వెళ్లిపోతారు. భోగీ మంటల్లో ఆ వీలునామా పడేసి కాల్చేయాలి అనుకుంటారు. ఇక ఉదయం జాను, వివేక్, మిత్ర, తాతగారు భోగీ మంటలకు ఏర్పాటు చేస్తారు. మనీషా, దేవయానిలు వీలునామా కాల్చేద్దామనుకొని సంతోషంగా వెళ్తారు. లక్ష్మీ జానుకి భోగి మంట వెలిగించమని చెప్తుంది.
జాను వెలిగించే టైంకి దేవయాని ఆపి లక్ష్మీ ఛైర్మన్ అయి పెద్ద పెద్ద పనులు చేస్తే నా కోడలు ఇలాంటి పనులు చేయాలా అని చిచ్చు పెడుతుంది. దానికి తాతగారు జాను కొత్తగా ఏమీ వెలిగించడం లేదని ప్రతీ ఏడాది జానునే వెలిగిస్తుందని చెప్తారు. జాను మంట వెలిగిస్తుంది. అందరూ చలి కాచుకుంటారు. ఇక మిత్ర లక్ష్మీని దగ్గరకు తీసుకొని చలికాచుకుంటారు. మనీషా కోపంతో వీలునామా మంటల్లో వేసేస్తుంది. అది కాలిపోతుంది. ఇద్దరూ నవ్వుకుంటారు. తర్వాత లక్ష్మీ, మిత్రకి నలుగు పెడుతుంది. పిల్లలు చూసి నవ్వుతారు. నవ్వుతారేంటి తర్వాత మీరే అని మిత్ర అనడంతో పిల్లలు పారిపోతారు. ఇక జాను ఆ సీన్ చూసి వివేక్‌కి తీసుకొచ్చి నలుగుపెట్టడానికి రెడీ అవుతుంది. మిత్ర మనసులో అక్కా చెల్లెళ్లు కలిసి పోతారు అనుకుంటే ఇలా జాను పోటీకి వస్తుందేంటి అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: మరోసారి కన్నతండ్రిని చంపడానికి ప్రయత్నించిన జ్యోత్స్న.. ఉలిక్కిపాటు.. దీపకి అనుమానం!





















