అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today February 1st: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: కలిసిపోయిన అక్కాచెల్లెళ్లు.. రాజేశ్వరి ఎంట్రీ.. కథ ఏ మలుపు తిరుగుతుందో!

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మిత్ర ఇంటికి మిత్ర మేనత్త రాజేశ్వరి దేవి రావడం లక్ష్మీ, జానులను పొగిడి దేవయానిని తిట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మిత్రని ఏం చేయొద్దని జయదేవ్ రౌడీలను వేడుకుంటాడు. మిత్ర బతిమాలొద్దని రౌడీలను చితక్కొడతాడు. రౌడీలు మిత్రని పట్టుకొని బంధించి జయదేవ్‌ని నెట్టేస్తారు. పుట్టింటి సారె గుడిలో లక్ష్మీ తీసుకుంటుంది. ఇక వివేక్ లక్ష్మీకి కాల్ చేసి విషయం చెప్తాడు. లక్ష్మీ జాను వాళ్లతో త్వరగా వెళ్లాలి పదండి అని పరుగులు పెడుతుంది. 

రౌడీలు మిత్రని స్తంభానికి కట్టేసి చాకుతో మిత్రని పొడవడానికి వెళ్తాడు. ఇంతలో లక్ష్మీ వచ్చి వెనక నుంచి వాడి షర్ట్ పట్టి లాగి ఆపేస్తుంది. రౌడీలను లక్ష్మీ  చితక్కొడుతుంది. మనీషా, దేవయాని చూసి భయపడిపోతారు. వివేక్ తలకి దెబ్బ తగలడంతో జాను వివేక్‌ని పట్టుకుంటుంది. లక్ష్మీ దెబ్బకి రౌడీలు పారిపోతారు. రౌడీలు నర్శింహకి కాల్ చేసి చావగొట్టిందని అంటాడు. ఇక పోలీస్ నర్శింహతో నీకు ఇక తీహార్ జైలే గతి అని అంటాడు. దేవయాని మనీషా మీద సెటైర్లు వేస్తుంది. ప్రతీ సారి లక్ష్మీనే ఎందుకు గెలుస్తుందని మనీషా అంటుంది. అయినా సరే మిత్ర కోసం పోరాడుతూనే ఉంటానని అంటుంది. 

మనీషా: నా సంగతి అటు ఉంచండి మీ కోడలు మీ గ్రిఫ్ నుంచి అక్క వైపు వెళ్లిపోయింది. ఒకసారి చూసి రండి జాను ఇప్పుడు లక్ష్మీ దగ్గరే ఉంటుంది. లక్ష్మీ బ్యాగ్ సర్దుతూ ఉంటే చేతికి జిప్ తగిలి గాయం అవుతుంది. దాంతో జాను పరుగున వెళ్లి అక్క చేతిని నోటిలో పెట్టుకుంటుంది. మిత్ర, వివేక్, జయదేవ్ అక్కడే ఉంటారు. దేవయాని చూస్తుంది.
జాను: సారీ అక్క నేను నీ మనసుకి చాలా పెద్ద గాయం చేశాను. అమ్మ స్థానంలో ఉన్న నిన్ను అనరాని మాటలు అన్నాను. స్వార్థంతో కళ్లు మూసుకుపోయి చేయ కూడని పనులు ఎన్న చేశాను వెరీ సారీ అక్క అని కాళ్ల మీద పడితే లక్ష్మీ హత్తుకుంటుంది.
లక్ష్మీ: చిన్న పిల్లవి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావేంటే. నీ భర్త బాగుండాలి అని ఆశ పడటం స్వార్థం ఎలా అవుతుంది. మీ భవిష్యత్ గురించి ఆలోచించుకోవడం చేయకూడని పని కాదు.
జాను: లేదక్కా నిన్ను బావగారిని మామయ్యని బాధ పెట్టే భవిష్యత్ మాకు వద్దు. మీ ప్రేమకు మించిన గుర్తింపు వద్దు మాకు. నేను నీ చెల్లిగా ఆయన నీ మరిదిగా ఉండే గుర్తింపు చాలు మాకు.
మిత్ర: అలా అంటే కుదరదు జాను నువ్వు వివేక్ ఫ్యాక్టరీ చూసుకోవాలి. దాని పూర్తి బాధ్యతలు నీ చేతిలో పెడుతున్నాను.
జాను: నాకు ఎందుకు బావగారు కావాలి అంటే ఆయన చూస్తారు.
జయదేవ్: ఇంట్లో ఉండి నువ్వేం చేస్తావమ్మా. నీ చదువు ఏం కావాలి.
జాను: నాకు ఫ్యాక్టరీ గురించి నాకేం తెలుసు మామయ్య గారు ఇంటి పనులు నేను చూసుకుంటాను.
లక్ష్మీ: ఇద్దరం కలిసి ఇంటి పనులు చూసుకుందాం. ఆ తర్వాత కంపెనీ పనులు మావి. ఫ్యాక్టరీ పనులు మీవి. 
మిత్ర: అవును జాను మీ అక్కాచెల్లెళ్లు కలిస్తే ఒక ఊరే బాగుపడింది. అలాంటిది మీరు కలిస్తే ఫ్యాక్టరీ బాగుపడదా. మీ ఇద్దరూ ఎప్పుడూ కలిసే ఉండాలి.
జాను: తప్పకుండా బావగారు పెద్ద మనసుతో నన్ను క్షమించారు. ఇలాంటి తప్పు మరోసారి జరగదు. అలా అని మా అక్క మీద ప్రమాణం చేసి చెప్తున్నా. 
దేవయాని: అక్కా చెల్లెళ్లు కలిసి పోయారు మనీషా ఇక మనం జాను మీద ఆశలు వదులుకోవడమేనా.
మనీషా: సిటీకి వెళ్లాక మన ప్రయత్నం మనం చేద్దాం అంతకు మించి చేయగలిగేది ఏం లేదు.

వేకువ జామున అందరూ సిటీ చేరుకుంటారు. ఇంటికి వచ్చే సరికి ఇంటి తలుపు తెరుచుకొని ఉంటుంది. తలుపు తెరుచుకొని ఉందేంటి అని అందరూ షాక్ అవుతారు. సెక్యూరిటీని పిలిచి అడిగితే ఎవరో ఒకావిడ వచ్చి ఈ ఇళ్లు నాదే అని తలుపు తెరిచారని చెప్తాడు. మీరంతా తనకు తెలుసని జయదేవ్‌ని ఏకవచనంతో పిలిచారని దేవయాని మేడంని తిట్టారని చెప్తాడు. దాంతో జయదేవ్ తన అక్క అయింటుందని అందరూ పరుగులు తీస్తారు. రాజేశ్వరి అత్తయ్య అయితేనే తన తల్లిని తిడుతుందని వివేక్ అంటాడు. లక్ష్మీ, జాను ఎవరో చూద్దామని పరుగులు తీస్తారు. రాజేశ్వరి దేవి కిందకి రావడంతో అందరూ పలకరిస్తారు. దేవయాని దగ్గరకు రాజేశ్వరి దేవి వెళ్లి చీవాట్లు పెడుతుంది. ఇక లక్ష్మీ, జానులు పెద్దావిడ కాళ్ల మీద పడతారు. మిత్ర, వివేక్‌లు ఇద్దరినీ పరిచయం చేస్తారు. రాజేశ్వరి ఇద్దరినీ పొగుడుతుంది. పిల్లల్ని ముద్దాడుతుంది. లక్కీని దత్తత తీసుకున్నారని మిత్ర కూతురు కాదని దేవయాని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

Also Read: సత్యభామ సీరియల్: సంధ్యని లాక్కెళ్లిన తల్లి.. నా జీవితం నా ఇష్టం అంటూ ఫైర్.. పోలీసులకు కంప్లైంట్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: తెలంగాణ చేనేత కార్మికులకు గుడ్ న్యూస్- లక్ష వరకు రుణమాఫీ
Telangana Latest News: తెలంగాణ చేనేత కార్మికులకు గుడ్ న్యూస్- లక్ష వరకు రుణమాఫీ
BRS: 11న బీఆర్​ఎస్​ శాసనసభా పక్ష సమావేశం.. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్​!
11న బీఆర్​ఎస్​ శాసనసభా పక్ష సమావేశం.. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్​!
SLBC Tunnel News: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మృతదేహం గుర్తింపు- మరింత లోతుకు వెళ్లేందుకు రెస్క్యూ టీం ప్రయత్నాలు 
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మృతదేహం గుర్తింపు- మరింత లోతుకు వెళ్లేందుకు రెస్క్యూ టీం ప్రయత్నాలు 
Amaravati Update: అమరావతి పనులు తిరిగి ప్రారంభించనున్న ప్రభుత్వం, వేల కోట్ల పనులకు టెండర్లు ఖరారు
అమరావతి పనులు తిరిగి ప్రారంభించనున్న ప్రభుత్వం, వేల కోట్ల పనులకు టెండర్లు ఖరారు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ind vs NZ CT Final 2025 | అప్పుడు అంతా బాగానే ఉంది..కానీ ఆ ఒక్క మ్యాచ్ తో కోలుకోలేని దెబ్బ తిన్నాంInd vs Nz Champions Trophy 2025 Final | MS Dhoni కథకు క్లైమాక్స్ ఈరోజే | ABP DesamInd vs Nz Champions Trophy Final Preview | మినీ వరల్డ్ కప్పును ముద్దాడేది ఎవరో..? | ABP DesamInd vs NZ CT Final 2025 | వన్డేలకు వీడ్కోలు పలకనున్న రోహిత్, కొహ్లీ.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: తెలంగాణ చేనేత కార్మికులకు గుడ్ న్యూస్- లక్ష వరకు రుణమాఫీ
Telangana Latest News: తెలంగాణ చేనేత కార్మికులకు గుడ్ న్యూస్- లక్ష వరకు రుణమాఫీ
BRS: 11న బీఆర్​ఎస్​ శాసనసభా పక్ష సమావేశం.. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్​!
11న బీఆర్​ఎస్​ శాసనసభా పక్ష సమావేశం.. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్​!
SLBC Tunnel News: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మృతదేహం గుర్తింపు- మరింత లోతుకు వెళ్లేందుకు రెస్క్యూ టీం ప్రయత్నాలు 
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మృతదేహం గుర్తింపు- మరింత లోతుకు వెళ్లేందుకు రెస్క్యూ టీం ప్రయత్నాలు 
Amaravati Update: అమరావతి పనులు తిరిగి ప్రారంభించనున్న ప్రభుత్వం, వేల కోట్ల పనులకు టెండర్లు ఖరారు
అమరావతి పనులు తిరిగి ప్రారంభించనున్న ప్రభుత్వం, వేల కోట్ల పనులకు టెండర్లు ఖరారు
Aadhaar in TTD:  తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆధార్​ అథెంటికేషన్​
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆధార్​ అథెంటికేషన్​
Telangana News: రేవంత్ రెడ్డి, స్టాలిన్ చేసేది దుష్ప్రచారమే, ఒక్క ఎంపీ సీటు కూడా తగ్గదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రేవంత్ రెడ్డి, స్టాలిన్ చేసేది దుష్ప్రచారమే, ఒక్క ఎంపీ సీటు కూడా తగ్గదు: కిషన్ రెడ్డి క్లారిటీ
Singer Kalpana: 'నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు.. చర్యలు తీసుకోండి' - తెలంగాణ మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన సింగర్ కల్పన
'నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు.. చర్యలు తీసుకోండి' - తెలంగాణ మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన సింగర్ కల్పన
Naga Babu Net worth: చిరంజీవి, పవన్ కల్యాణ్ నుంచి నాగబాబు అప్పులు - ఆయనకు ఉన్న మొత్తం ఆస్తులు ఎన్నో తెలుసా?
చిరంజీవి, పవన్ కల్యాణ్ నుంచి నాగబాబు అప్పులు - ఆయనకు ఉన్న మొత్తం ఆస్తులు ఎన్నో తెలుసా?
Embed widget