Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today December 5th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్కీని తీసుకెళ్లిపోతున్న పార్వతి.. టీవీలో చూసిన భాస్కర్ నిజం చెప్తాడా!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode లక్కీని పార్వతితో పంపించకుండా ఉండటానికి లక్ష్మీ రిస్క్ చేస్తుండటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ పార్వతి కోసం ఎంక్వైరీ చేయడం వల్లే పార్వతి ఉన్న ఫలంగా పాపని తీసుకెళ్లిపోవాలని నిర్ణయించుకుందని మనీషా మిత్రని రెచ్చగొడుతుంది. లక్కీ వెళ్లిపోతే దానికి లక్ష్మీనే కారణమని అంటుంది. లక్ష్మీని వెనకేసుకురావొద్దని మిత్ర తండ్రి జయదేవ్‌తో చెప్తాడు. ఇక పార్వతి నేను పాపని తీసుకొని వెళ్లిపోతానని లక్కీని లాక్కొని వెళ్తుంటే నేను రాను అని లక్కీ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంటుంది.
బయట నుంచి పార్వతి ఎంత పిలిచినా వినకుండా లక్కీ నేను రాను మా నాన్న దగ్గరే ఉంటానని ఏడుస్తుంది. దాంతో జయదేవ్ పాపని బలవంతం పెట్టొద్దని రేపు తీసుకెళ్లు అంటుంది. దాంతో పార్వతి మనీషా వైపు చూడటంతో మనీషా సైగ చేస్తుంది దాంతో పార్వతి సరే అంటుంది. మనీషా పార్వతిని ఒప్పించి పాపని ఇక్కడే ఉంచేలా చేస్తే నువ్వు మొత్తం చెడగొట్టావని మిత్ర లక్ష్మీని తిడతాడు. నిన్ను ఎప్పటికీ క్షమించను అని మిత్ర వెళ్లిపోతాడు. దేవయాని, మనీషాలు కూడా క్షమించమని చెప్పి వెళ్లిపోతారు. లక్ష్మీ చాలా బాధ పడుతుంది. మరోవైపు జున్ను లక్కీ దగ్గరకు వెళ్తాడు. లక్కీకి ఏడ్వొద్దని చెప్తాడు. ఇద్దరూ హనుమంతుడికి సాయం అడగాలి అని పిలుస్తారు. మా అమ్మ వచ్చింది నాకు వెళ్లడం ఇష్టం లేదని లక్కీ చెప్తుంది. సమస్యకి పరిష్కారం చెప్పమని జున్ను అంటాడు. దానికి హనుమంతుడు ఆపద వచ్చినప్పుడు ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన పెద్దదవుతుంది. ఆ ఆలోచన ఆచరణ వైపు ఆడుగులేస్తుందని అంటారు. స్వామి మాటలకు లక్ష్మీ రియాక్ట్ అవుతూ తొందరగా ఆలోచిస్తూ అడుగులు వేస్తుంది.
లక్ష్మీ జయదేవ్ దగ్గరకు వెళ్తుంది. అందరూ నిన్ను ఇబ్బంది పెడుతున్నారు ఇక ఈ విషయం గురించి వదిలేయ్ అంటారు. దానికి లక్ష్మీ నా మనసు తను లక్కీ మదర్ కాదని అంటుంది. మామకి రెండు చేతులు జోడించి సాయం అడిగి ఓ పెద్ద నిర్ణయం చెప్తుంది. ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు మనీషా, దేవయానిలు నిన్ను వదలరు వద్దు నేను అంగీకరించను అని చెప్తాడు. కానీ లక్ష్మీ ఒప్పుకోదు. దాంతో జయదేవ్ ఒకే చెప్పి జాగ్రత్త చెప్తాడు. ఉదయం ఇంటి ముందుకు మీడియా వస్తుంది. లక్కీ కన్న తల్లి వైపా పెంచిన తండ్రి వైపా అని మాట్లాడుతారు. దేవయాని, మనీషాలు షాకైపోతారు. ఇక లక్కీని దగ్గరకు తీసుకొని మిత్ర ఓదార్చుతాడు. మళ్లీ నిన్ను ఇంటికి తీసుకొస్తానని అంటాడు. లక్కీ ఏడుస్తుంది. మరో వైపు లక్ష్మీ కూడా ఏడుస్తుంది. జున్ను కూడా ఏడుస్తూ లక్కీని ఆపమని అందరినీ బతిమాలుతాడు.
మనీషా, దేవయానిలు పాపని తీసుకెళ్లిపో అని పార్వతితో చెప్తారు. మనీషా, దేవయానిలు మిత్ర దగ్గరకు వెళ్లి మీడియా వచ్చిందని చెప్తారు. ఇక పార్వతి పాపని లాక్కొని వెళ్లిపోతుంది. రాను రాను అని లక్కీ చాలా ఏడుస్తుంది. మనీషా మనసులో ఆ పార్వతి లక్కీని బీహార్ గ్యాంగ్‌కి అమ్మేయబోతుందని నువ్వు ఎప్పటికీ తిరిగి రాలేవని అనుకుంటుంది. లక్కీ అందరినీ పట్టుకొని వెళ్లను అని ఏడుస్తుంది. తాతయ్య రోజూ జున్నుని తీసుకెళ్లినట్లు నన్నూ తీసుకెళ్లు అంటుంది. బయట మీడియా అంతా పార్వతిని ప్రశ్నిస్తారు. ఇక మీడియాలో భాస్కర్ ఆమె భార్య లక్కీని పార్వతి తీసుకెళ్లడం చూసి షాక్ అయిపోతారు. ఇదంతా మనీషా కుట్ర అయింటుందని భాస్కర్ అంటాడు. భాస్కర్ నిజం చెప్తా అంటే అతని భార్య ఆపేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నకి యాక్సిడెంట్.. కండీషన్ సీరియస్.. శౌర్య పరిస్థితి అంతే!