అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today December 30th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీని అష్ట దిగ్బంధం చేసేసిన మనీషా.. మిత్రని వదిలేయడమే పరిష్కారమా!

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode ఇంట్లో, ఫ్యాక్టరీలో సమస్యలకు మనీషానే కారణం అని లక్ష్మీ తెలుసుకోవడం మనీషా లక్ష్మీని ఇబ్బంది పెట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

 

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మనీషా ఏం చేస్తుందా అని లక్ష్మీ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే మనీషా లక్ష్మీ దగ్గరకు వచ్చి నిన్ను చూస్తుంటే జాలేస్తుంది లక్ష్మీ. మొన్నటి వరకు మిత్ర కోసం ఫైట్ చేశావు. ఇప్పుడు నీ చెల్లి కోసం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నీ కష్టాలు అన్నింటికీ నేనే కారణం. నాకు మిత్రను ఇచ్చేస్తే నీకు ఏం కష్టాలు ఉండవు అని చెప్తుంది మనీషా. పరాయి పురుషుడిని కోరుకున్న సూర్పణకు పట్టిన గతే నీకు పడుతుందని లక్ష్మీ అంటుంది. దానికి మనీషా ఎప్పటికైనా మిత్ర నావాడే అని అంటుంది. ఇక మనీషా లక్ష్మీతో ఇప్పుడు నీకు ఒక అరుపు వినిపిస్తుంది చూడు అని అడగానే మిత్ర లక్ష్మీతో పాటు ఇంట్లో వాళ్లందరినీ పిలుస్తాడు.

ఫ్యాక్టరీలో జరిగిన అనర్థం గురించి చెప్తాడు. స్ట్రైక్ గురించి చెప్తాడు. అందరూ లక్ష్మీ, జయదేవ్ కంగారు పడతారు. సమ్మె జరగకుండా ఆపాలని అంటాడు. దాంతో జయదేవ్ మిత్ర, లక్ష్మీలను సమ్మె జరగకుండా ఆపమని తాను గాయపడిన వర్కర్‌ దగ్గరకు వెళ్తానని అంటాడు. ఇక వివేక్‌ వెళ్లబోతే జాను అపేస్తుంది. మిత్ర వాళ్లు వెళ్తారు. యూనియన్ లీడర్ కావాలనే సమ్మె చేయిస్తున్నాడని అని మ్యానేజర్ చెప్తారు. ఇక లక్ష్మీ మనీషానే అని అర్థం చేసుకుంటుంది. ఎవరో కావాలనే చేస్తున్నారు అని అంటే మిత్ర ఎవరో చెప్పమంటే ఇప్పుడు కాదని లక్ష్మీ అంటుంది. ఇక యూనియన్ లీడర్‌తో మాట్లాడాలి అని లక్ష్మీ చెప్తుంది. యూనియన్ లీడర్ మాట్లాడటానికి నిరాకరిస్తాడు. యాజమాన్యం డౌన్ డౌన్ అని అరుస్తారు. యూనియన్ లీడర్ మనీషాకి కాల్ చేస్తే డోస్ పెంచమని మీడియాని పింపిస్తున్నాను అని చెప్తుంది. ఇంతలో మీడియా రాగానే యూనియన్ లీడర్ యాక్టింగ్ షార్ట్ చేస్తారు. ఇక మనీషా, సరయుతో కలిసి లైవ్ చూడాలని అనుకుంటుంది.

యాజమాన్యం పట్టించుకోవడం లేదని చెప్తాడు. ఫ్యామిలీలో గొడవల వల్ల యాజమాన్యం తమని పట్టించుకోవడం లేదని చెప్తాడు. మిత్ర కోప్పడటానికి వెళ్తుంటే లక్ష్మీ ఆపి మన మీద కుట్ర జరుగుతుందని కావాలనే ఇదంతా చేస్తున్నారని మిత్రకు సర్దిచెప్తుంది. దేవయాని ఇంట్లో జానుతో కలిసి చూస్తుంది. నందన్ ఫ్యామిలీలో ఆస్తి గొడవలు అని వస్తుంది. వివేక్ రాగానే టీవీ ఆపేయమని జాను చెప్తుంది. కానీ వివేక్ మొత్తం చూస్తాడు. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల వల్లే ఇదంతా జరుగుతుందని చెప్తారు. ఇదంతా నీ వల్లే అని వివేక్ అంటే దానికి జాను తన అక్కకి చేత కాక పోతే రిజైన్ చేయాలని అంటుంది. ఇక వివేక్ అక్కడికి వెళ్తాను అంటే జాను అడ్డుకుంటుంది. గుర్తింపు లేదని అంటుంది. వివేక్ వెళ్తానని అంటే జాను కూడా వస్తాను అంటుంది. ఇక లగేజ్ తెస్తాను అంటుంది.

లగేజ్ ఎందుకు అంటే మీరు నా మాట వినకపోతే నేను నా పుట్టింటికి వెళ్లిపోతానని మీరు నేను విడిపోతున్నాం అని మీడియాతో చెప్తాను అంటుంది. దాంతో వివేక్ ఇంటి లోపలికి వెళ్లిపోతాడు. ఇక దేవయాని జాను నువ్వు సూపర్ అని ఎత్తేస్తుంది. జయదేవ్ కూడా రాగానే మీడియా చుట్టు ముడతాయి. మనీషా, సరయు టీవీలో చూసి లక్ష్మీకి ఇంత కంటే నరకం ఉండదు అని అష్ట దిగ్బంధం చేశానని అంటుంది. దానికి పీఏ రాజు లక్ష్మీ చివరి నిమిషంలో ఏదో ఒకటి చేస్తుందని అంటాడు. దాంతో మనీషా ఈ సారి అంత సీన్ లేదు అని అంటుంది. జయదేవ్ ఏం చేయాలా అని ఆలోచిస్తారు. ఇక మిత్ర మీడియా ముందే మాట్లాడుతానని వెళ్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్ డిసెంబరు 30వ తేదీ: తొండ ముదిరి ఊసరవెల్లి అవుతుందా.. మరో బేబీ కథేనా ఇది?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jimmy Carter Dies: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ కన్నుమూత, ఆయన పేరిట ఎన్నో రికార్డులు
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ కన్నుమూత, ఆయన పేరిట ఎన్నో రికార్డులు
Srikakulam Politics: తమ్మినేని సీతారాం ఇంటికి వెళ్లిన బొత్స, పీక పోయినా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తారా? ఆసక్తికర వ్యాఖ్యలు
తమ్మినేని సీతారాం ఇంటికి వెళ్లిన బొత్స, పీక పోయినా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తారా? ఆసక్తికర వ్యాఖ్యలు
Telangana Assembly Special Session: నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, సభలో కీలక తీర్మాణం - కేబినెట్ భేటీ వాయిదా
నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, సభలో కీలక తీర్మాణం - కేబినెట్ భేటీ వాయిదా
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jimmy Carter Dies: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ కన్నుమూత, ఆయన పేరిట ఎన్నో రికార్డులు
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ కన్నుమూత, ఆయన పేరిట ఎన్నో రికార్డులు
Srikakulam Politics: తమ్మినేని సీతారాం ఇంటికి వెళ్లిన బొత్స, పీక పోయినా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తారా? ఆసక్తికర వ్యాఖ్యలు
తమ్మినేని సీతారాం ఇంటికి వెళ్లిన బొత్స, పీక పోయినా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తారా? ఆసక్తికర వ్యాఖ్యలు
Telangana Assembly Special Session: నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, సభలో కీలక తీర్మాణం - కేబినెట్ భేటీ వాయిదా
నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, సభలో కీలక తీర్మాణం - కేబినెట్ భేటీ వాయిదా
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
EPFO New Facilities: నూతన సంవత్సరంలో EPFO నుంచి భలే ఫెసిలిటీస్‌ - అన్నీ హ్యాపీ న్యూస్‌లే!
నూతన సంవత్సరంలో EPFO నుంచి భలే ఫెసిలిటీస్‌ - అన్నీ హ్యాపీ న్యూస్‌లే!
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Look Back 2024: IPL వేలంలో సూపర్ హిట్టయిన పంత్, శ్రేయస్- 13 ఏళ్ల చిచ్చరపిడుగుకు ఛాన్స్.. బిగ్ ప్లేయర్లకు షాక్ 
IPL వేలంలో సూపర్ హిట్టయిన పంత్, శ్రేయస్- 13 ఏళ్ల చిచ్చరపిడుగుకు ఛాన్స్.. బిగ్ ప్లేయర్లకు షాక్ 
Embed widget