అన్వేషించండి

Satyabhama Serial Today December 30th: సత్యభామ సీరియల్: తొండ ముదిరి ఊసరవెల్లి అవుతుందా.. మరో బేబీ కథేనా ఇది?

Satyabhama Today Episode సంధ్య సంజయ్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటే విశాలాక్షి వచ్చి ఫోన్ గురించి సంధ్యని నిలదీయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode ఎమ్మెల్యేగా సత్య పోటీ చేస్తుందని తెలుసుకున్న విశ్వనాథం సత్యని ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. తండ్రి ఎంత చెప్పినా సత్య వినదు. మామకు ఎదురు వెళ్లొద్దు ఈ ఇంటి దానివి ఇంట్లో అందరితో నువ్వు కలిసి ఉండాలని అంటాడు. నీ భర్త నీ వల్ల చిక్కుల్లో పడుతున్నాడని నీలా నీ భర్త స్వేచ్ఛ అని ఆలోచిస్తే నువ్వు నీ పుట్టింటిలో ఉండేదానివి అని అంటాడు.

విశ్వనాథం: నీలా నీ భర్త కన్న వాళ్లని వదులుకోడు. అలా వదులుకోవాల్సి వస్తే ఎవరిని వదులుకుంటాడో నువ్వే ఆలోచించు. ఇందాక నేను లోపలికి వస్తుంటే మీ అత్తగారు గుమ్మం ముందే నిలబెట్టి దులిపేశారు. ఆవిడ అడిగిన ప్రశ్నలకు నోరు విప్పలేకపోయాను ఎందుకంటే వాటిలో న్యాయం ఉంది కాబట్టి. రేపు క్రిష్ పరిస్థితి కూడా ఇంతే. గెలుపు అంటే ఎలక్షన్‌లో గెలవడం కాదమ్మా చుట్టూ ఉన్న వాళ్ల మనసు గెలవడం. లక్ష్యం మంచిది అయితే సరిపోదు దాని దారి కూడా మంచిగా ఉండాలి నా కూతురు క్షేమంగా ఉండాలి ఈ ఒక్క వరం ఇవ్వమ్మా. 
సత్య: నాన్న.. నాన్న... 
జయమ్మ: మీ నాన్న నువ్వు చేసే పనిని తప్పు పట్టలేదు. ఏం చేస్తే బాగుంటుందో చెప్పారంటే నిన్ను భయపెట్టలేదు భయపడకుండా ప్రశాంతంగా ఉండాలి అంటే ఏం చేయాలో చెప్పారు అంటే. ఆయన చెప్పింది కాస్త అర్థం చేసుకో అమ్మా. లేకపోతే నువ్వే కాదు రెండు కుటుంబాలు నష్టపోతాయి.
భైరవి: ఆగు ఏ ముఖం పెట్టుకొని వడ్డిస్తున్నావే.
మహదేవయ్య: భైరవి.
భైరవి: నీ అంత మంచి తనం ఓపిక నాకు లేదు పెనిమిటి. దానికి మామ మీద ప్రేమ లేదు. గౌరవం లేదు. అది ఈ ఇంట్లో తింటూ ఈ ఇంటి వాసానలే లెక్క పెడుతుంది. 
సత్య: ఎలక్షన్‌లో నిలబడటం ఎదురు తిరగడం కాదు అత్తమ్మా నేను అనుకున్న న్యాయం వైపు నిలబడ్డా.
భైరవి: విన్నావా నీ పెళ్లానిది న్యాయం అంట అంటే మీ బాపుది అన్యాయమా అయితే నువ్వు ఎందుకు అన్యాయం వైపు నిలబడ్డావ్. నీ పెళ్లాం బాపునకి ఎదురు తిరిగితే నీకు ఎదురు తిరిగినట్టే పర్లేదా నీకు. నడుస్తదా నీ కాపురం నువ్వే చూసుకుంటావా..ఇట్లా తయారయ్యావ్ ఏంట్రా. ఎవరికీ ఇష్టం లేకపోయినా దాన్ని నీకు ఇచ్చి పెళ్లి చేశాం ఇదేనా నీ కృతజ్ఞత.
క్రిష్: నేను చెప్పాల్సింది చెప్పా వాళ్ల నాన్న వచ్చి చెప్పాడు అంత కంటే ఇంకే చేయాలి.
భైరవి: ఏం చేయాలో తెలీనప్పుడు దాన్ని పుట్టింటికి పంపేయ్. మన ఇంట్లోనే తింటూ మన ఇంట్లోనే తిరుగుతూ మనకే ఎదురు తిరుగుతా అంటే ఎట్లా. 
మహదేవయ్య: ఎందుకే వాడిని అలా సతాయిస్తావ్ తినేటప్పుడు అలా సతాయిస్తావ్. మంచి చెడు చెప్పడమే మన పని తర్వాత వాళ్ల ఇష్టం
భైరవి: నువ్వు ఇలా చనువు ఇవ్వడం బట్టే అది అలా తాండవం ఆడుతుంది. 
సత్య: మీరేం టెన్షన్ పడకండి మామయ్యా ఒక సారి నిర్ణయం తీసుకొంటే వెనకడుగే వేయను. 

భైరవి గదిలోకి వెళ్లి మహదేవయ్య దగ్గర కోపంగా అన్ని విసిరేస్తుంది. మహదేవయ్య నచ్చచెప్పబోతే భైరవి వినదు. నిన్ను నీ చిన్న కోడలు పట్టించుకోదని మహదేవయ్య చెప్తాడు. దాంతో మహదేవయ్యని భైరవి ఎందుకు దాన్ని గారాభం చేస్తున్నావ్ ఎందుకు దానికి చెప్పడం లేదు అని భైరవి అంటుంది. దాంతో మహదేవయ్య అక్కడే ఆగిన క్రిష్‌ని చూసి చిన్నా కోసం ఆగుతున్నా వాడు బాధ పడతాడే.. వాడు ఇష్ట పడ్డ సత్యని ఎలా కోప్పడతాను చెప్పు అని అంటాడు. నా చిన్నా కోసం ఎంత నష్టం అయినా భరిస్తాను అని అంటాడు. నన్ను ఎమ్మెల్యేను చేసే బాధ్యత నా చిన్నాదే అని అంటాడు. క్రిష్ మనసులో ఇంత మంచి మనిషికి సత్య ద్రోహం చేస్తుందా అని క్రిష్ అనుకుంటారు.

ఇక మరోవైపు సంధ్య సంజయ్‌తో ఫోన్‌లో మాట్లాడుతుంటుంది. విశాలాక్షి కిచెన్‌లో లైట్ ఆపేసి సంధ్య గదిలో లైట్ ఆన్ అవ్వడం చూసి వెళ్తుంది ఇంతలో సంధ్య ఫోన్ దాచేస్తుంది. విశాలాక్షి సంధ్యకి తొందరగా పడుకోవడం లేదని చీవాట్లు పెడుతుంది. ఇక వెళ్తూ వెళ్తూ సంధ్య చేతిలో ఫోన్ తీసుకొని ఎవరిది అని అడుగుతుంది. నా ఫ్రెండ్ ఇచ్చిందని సంధ్య  చెప్తుంది. అమ్మాయా అబ్బాయా అని అడిగితే అమ్మాయే అని సంధ్య కట్టుకథ అల్లేస్తుంది. ఇంత ఖరీదైన బహుమతులు తీసుకోకూడదని తిరిగి ఇచ్చేయమని చెప్తుంది. విశాలాక్షి వెళ్లగానే సంధ్య సంజయ్ మేటర్ బయట పడలేదని అనుకుంటుంది. ఇక క్రిష్ గదిలోకి వచ్చిన తర్వాత సత్య కావాలనే మాట్లాడుతుంటే క్రిష్ పట్టించుకోడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఇది అది కాదు.. అదే ఇది.. ఇంటి వారసురాలి ఇడ్లీ బండి కథ షురూ!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 28th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్ర మొదలైన ఫోన్ టెన్షన్? యమున పాత ఫోన్లో మహాకి అసలు నిజాలు తెలుస్తాయా?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్ర మొదలైన ఫోన్ టెన్షన్? యమున పాత ఫోన్లో మహాకి అసలు నిజాలు తెలుస్తాయా?
Godavari Serial Today November 28th: 'గోదావరి' సీరియల్: అమెరికా వెళ్లనున్న నందు! సంజు ఆఫీస్‌లో జాను అల్లరి! గౌతమి వెంట అజయ్!
'గోదావరి' సీరియల్: అమెరికా వెళ్లనున్న నందు! సంజు ఆఫీస్‌లో జాను అల్లరి! గౌతమి వెంట అజయ్!
Nindu Manasulu Serial Today November 28th: నిండు మనసులు: బిగ్‌ షాకింగ్.. సిద్ధూ, ప్రేరణ ఇక లేరు! గణ కళ్లముందే బాంబ్‌ పేలి చనిపోయిన సిద్ధూ, ప్రేరణ!
నిండు మనసులు: బిగ్‌ షాకింగ్.. సిద్ధూ, ప్రేరణ ఇక లేరు! గణ కళ్లముందే బాంబ్‌ పేలి చనిపోయిన సిద్ధూ, ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today NOV 28: తాగిన మత్తులో భరత్‌కు నిజం చెప్పేసిన విక్కీ..దమయంతి వాళ్లతో చేతులు కలిపిన భరత్
నువ్వులేక నేను లేను: తాగిన మత్తులో భరత్‌కు నిజం చెప్పేసిన విక్కీ..దమయంతి వాళ్లతో చేతులు కలిపిన భరత్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thiruparankundram Deepam: తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
PM Modi: మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై ప్రధాని మోదీ
మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై PM Modi
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
MP Seats In AP and Telangana: గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
Adilabad News: జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
Rohit Sharma - Pollard Combo: కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
Delimitation Bill 2026: డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
Embed widget