Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today December 28th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ఆస్తి కోసం జాను కోర్టుకి వెళ్తుందా.. ఫ్యాక్టరీలో పేలిన మనీషా బాంబ్.. లక్ష్మీ చుట్టూ బిగిసిన ఉచ్చు!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode ఊరిలో పొలం జాను అమ్మడం తెలుసుకున్న లక్ష్మీ అడ్డుకోవడం కోర్టుకు వెళ్తానని జాను అక్కకి వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode జాను ఆఫీస్‌లో గొడవ చేస్తుంది. స్టాఫ్ అంతా చూస్తున్నారు వెళ్లు జాను అని మిత్ర చెప్తే చూస్తే చూడని మా ఆయనకు మీరు చేస్తున్న అన్యాయం అందరికీ తెలుస్తుందని అంటుంది. మీరు ఇక్కడే ఉంటే మీకు వీళ్లు ఎదగనివ్వరు. ఇంట్లో నేను పని మనిషిని అయితే ఇక్కడ మీతో గొడ్డు చాకిరీ చేయిస్తారని జాను అంటుంది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావని లక్ష్మీ జానుని అడుగుతుంది.
జాను: నువ్వు మమల్ని మోసం చేస్తుంటే చూస్తూ ఉండాలా. మున్నార్‌లో కట్టుకున్న భర్తనే మోసం చేసినదానివి నీకు మేం ఒక లెక్కా.
లక్ష్మీ: జాను ఎక్కువ మాట్లాడితే పళ్లు రాలిపోతాయ్.
జాను: అదే మాట నేను అనగలను.
మిత్ర: జాను హద్దు మీరి మాట్లాడుతున్నావ్. తను ఈ కంపెనీ ఛైర్మన్. పెద్ద వాళ్లకి రెస్పెక్ట్ ఇవ్వు.
జాను: ఓహో రెస్పెక్ట్ మీకేనా మాకు వద్దా. ఈవిడ ఛైర్మన్ అయితే మా ఆయన ఏంటి ప్యూన్‌నా. మీరు గౌరవంగా బతకాలి మేం మాత్రం మాములుగా బతకాలా. మీరు పదవులు అనుభవిస్తుంటే మేం పల్లకీ మోయాలా.
వివేక్: ఇక ఆపు జాను.
జాను: నేను అదే చెప్తున్నా అండీ ఇక ఇదంతా ఆపేద్దాం. మనకి ఈ కంపెనీ వద్దు ఏం వద్దు.. సొంతంగా బిజినెస్ చేసుకొని మన బతుకు మనం బతుకుదాం. మిమల్ని వీళ్ల బాగు పడనివ్వరు. వీళ్లకి కావాల్సింది మనం బానిసలుగా ఉండటం కాదు.వీళ్ల దృష్టిలో నువ్వు ఓ డ్రైవర్ నేను వంట మనిషిని అంతే. వీళ్లతో ఉంటే మనం బాగుపడం అండీ అందుకే బయటకు వెళ్లిపోదాం.
మిత్ర: వెళ్లిపోండి. తను అన్నవి మనం విన్నవి చాలు. ఇక భరించే ఓపిక నీకు ఉన్నా నాకు లేదు. వివేక్ తను నీ గురించి ఆలోచిస్తుంది అది తప్పు అని నేను చెప్పడం లేదు.
వివేక్: ఓసేయ్ రాక్షసి అసలు నీకు ఏమైందే..
మిత్ర: రేయ్ ఇది ఆఫీస్ ఇళ్లు కాదు జానుని తీసుకొని ఇంటికి వెళ్లు.
వివేక్: జానుని ఇంటికి తీసుకెళ్లి ఆఫీస్‌లో అందరి ముందు నన్ను అవమానిస్తావా. అసలు ఇదంతా నీ వల్లే జరుగుతుంది మనీషా. తన వల్లే జాను ఇలా మారిపోయింది మామ్ పిచ్చిగా ప్రవర్తిస్తూ నా పరువుతీస్తుంది. నీ వల్ల నాకు ప్రశాంతత లేదు జాను.
మనీషా: నువ్వు అక్కడే ఉంటే ఆఫీస్ ముందు ఉన్న చెట్టు ఎదుగుతుంది కానీ నువ్వు ఎదగవు.
దేవయాని: ఏ విలువా గౌరవం లేని బతుకు ఓ బతుకేనారా. పెళ్లి అయింది రేపు పిల్లలు పుడితే ఎలా పోషిస్తావ్.
జాను: ఆయనకు ఇవేమీ అక్కర్లేదు అత్తయ్యగారు. వాళ్ల కింది ఉంటారు అంతే.
వివేక్: నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. ఒకప్పుడు మీ ఇద్దరి మధ్య నేను నలిగిపోయేవాడిని. ఇప్పుడు మీ ఇద్దరూ ఒకటైపోయారు. మీకు ఈ మనీషా తోడు అయింది. ఇక నేను ఏం మాట్లాడను ఇష్టం వచ్చినట్లు చేసుకోండి.
ఎవరు ఏమనుకున్నా మనం అనుకున్నది చేద్దాం అని జాను అత్త, మనీషాతో చెప్తుంది. ఇక జాను పొలం అమ్మడానికి వాళ్లని ఇంటికి పిలవమని మనీషాతో చెప్తుంది. లక్ష్మీ, మిత్ర ఇంటికి వస్తారు. లక్ష్మీ ఏడుస్తూ మిత్ర చేయి పట్టుకుంటుంది. ఇంటికి వెళ్లే సరికి పొలం కొనడానికి వచ్చిన వాళ్లు ఇంట్లో చూసి మిత్ర మీకు పొలం అమ్మమని చెప్తే ఎందుకు వచ్చారని అంటాడు. దాంతో జాను నేను అమ్ముతా అని చెప్తుంది. ఇది నా ఆస్తి నేను అమ్ముకుంటా అని అంటుంది. అది తాతయ్య గుర్తు అని లక్ష్మీ అంటుంది. అందులో ఉన్నది తాతయ్య ఊపిరి అంటే దానికి జాను ఆ ఊపిరి ఆగిపోయి చాలా కాలం అయింది. నా వాటా నేను అమ్ముకుంటా నీ వాటా నువ్వు ఉంచుకో అని అంటుంది. పొలం ఇద్దరి పేరుమీద ఉండటంతో నీ సంతకం కూడా కావాలని నువ్వు సంతకం పెడితే నా వాటాకి వాళ్లు డబ్బు ఇస్తారని అంటుంది.
లక్ష్మీ సంతకం పెట్టను అని అంటుంది. నా ఆస్తి నువ్వు నాకు ఇవ్వను అంటావ్ కదా అంతేనా నువ్వు సంతకం పెట్టకపోతే కోర్టుకు వెళ్లానని జాను అంటుంది. ఆస్తి కోసం కోర్టుకి వెళ్తావా అని లక్ష్మీ అడిగితే కోర్టుకి వెళ్తే కదా ఆస్తి వస్తుందని అంటుంది. తాత పరువు పోకూడదు అంతే ఇక్కడే సంతకం పెట్టి నా ఆస్తి నాకు ఇవ్వు అంటుంది. బెదిరిస్తున్నావా అని లక్ష్మీ అడిగితే మిత్ర లక్ష్మీని ఆపుతాడు. రేపటిలో సంతకం పెట్టు అని జాను చెప్తుంది. ఇక మిత్ర లక్ష్మీని ఓదార్చుతాడు. మరోవైపు ఫ్యాక్టరీలో పని జరుగుతుండగా మనీషా డబ్బు ఇచ్చిన వ్యక్తి పైడి తల్లి అనే మరోవ్యక్తికి సైగ చేయడంతో ఆ వ్యక్తి కావాలనే చేయి మెషిన్‌లో పెట్టి కావాలనే పాత మెషిన్‌తో పని చేయిస్తున్నారని స్ట్రైక్ చేస్తున్నామని హడావుడి చేస్తారు. మ్యానేజర్ మిత్రకు కాల్ చేసి విషయం చెప్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఇది అది కాదు.. అదే ఇది.. ఇంటి వారసురాలి ఇడ్లీ బండి కథ షురూ!