Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today April 5th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మనీషాకు అబార్షన్.. బిడ్డ కచ్చితంగా కావాలన్న అరవింద ఆశలు నీరుగారిపోతాయా!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode లక్ష్మీ మనీషాకు అబార్షన్ చేయాలని ఆయిల్ పోసిందని దేవయాని రచ్చ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ చివరి నిమిషంలో ప్రాజెక్ట్ దక్కించుకుంటుంది. సరయు షాక్ అయిపోతుంది. మనీసా సరయుకి కాల్ చేసి మాట్లాడుతుంది. ఇక అరవింద తనని పట్టించుకోవడం లేదు కానీ తన కడుపులో బిడ్డ గురించి ఎక్కువ జాగ్రత్త తీసుకుంటుందని కచ్చితంగా ఆడబిడ్డని కనాలని అంటుందని చెప్తుంది. దాంతో సరయు అయితే మిత్రతో కమిట్ అయి కాపురం చేసి ఆడబిడ్డని కనేయమని అంటుంది.
అబార్షన్ చేసుకో..
సరయు మనీషాతో నువ్వు ఆ ఇంట్లో పర్మినెంట్‌గా మిత్ర భార్యగా ఉండాలి అంటే లక్ష్మీని గెంటేయాలి అంటే నీకు అబార్షన్ అయినట్లు చేయ్. ఆ నింద లక్ష్మీ మీద వేసేయ్ దీంతో లక్ష్మీ బయటకి వెళ్లిపోతుంది. నువ్వు పర్మినెంట్‌గా ఆ ఇంట్లో ఉండిపోతావని అంటుంది. సూపర్ ఐడియా సరయు ఇక నుంచి నేను ఆ పనిలోనే ఉంటాను అని మనీషా అంటుంది.
నీది ఒక జన్మేనా ఛీ..
మనీషా సరయుతో మాట్లాడటం లక్ష్మీ చూస్తుంది. మనీషా తన ఫ్రెండ్ సరసు అని కవర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. దాంతో లక్ష్మీ ఛీ నోర్ముయ్ నీది ఒక జన్మేనా నువ్వు ఒక ఆడదానివేనా అని తిడుతుంది. మిత్రని ప్రేమించాను అన్నావ్ ఆయనను పెళ్లి చేసుకుంటా అంటూ ఈ ఇంటికి అన్యాయం చేస్తాన్నావ్ అంటుంది. నేనేం చేశా లక్ష్మీ అన్ని మాటలు అంటున్నావ్ అని మనీషా అడిగితే ఫైల్ దొంగతనంగా సరయుకి ఇచ్చింది నువ్వే అని నాకు తెలుసు అని లక్ష్మీ అంటుంది. ఆయన ప్రాణాలు తీయడానికి నువ్వు ప్రయత్నించావని తెలిస్తే నీ ప్రాణాలు తీసేస్తానని లక్ష్మీ అంటుంది. నా మీద నిందలు వేస్తున్నావ్ నేను ఈ ఇంటి కోడలినే అని మనీషా అంటుంది. నిన్ను ఈ ఇంటి నుంచి పంపేస్తా అంటే నిన్ను పంపేస్తా అని ఒకరిని ఒకరు ఛాలెంజ్ చేసుకుంటారు.
ఆనందంలో జయదేవ్..
ప్రాజెక్ట్ నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కే వచ్చిందని న్యూస్ చూసి జయదేవ్ చాలా సంతోషంతో ఉంటాడు. అరవిందని పిలిచి చెప్తే అరవింద మాత్రం మిత్ర గురించి ఆలోచిస్తుంది. ఇక మిత్ర లక్ష్మీకి థ్యాంక్స్ చెప్తాడు. పిల్లల వల్లే ప్రాజెక్ట్ దక్కింది మన ప్రాణాలు దక్కాయి. నిజంగా లక్కీ మన అదృష్టం అని అంటుంది. ఇక లక్కీ నానమ్మతాతయ్యల దగ్గరకు వెళ్లి నాకు నాన్న లక్కీ అని పేరు పెట్టారా నేను నాన్నకి అదృష్టాన్ని కదా అంటుంది. దానికి జయదేవ్ నువ్వు నిజంగా లక్కీవే లక్కీ మళ్లీ నువ్వు ఈసారి మీనాన్న ప్రాణాలు కాపాడావని అంటారు.
దేవయాని ఆయిల్ ప్లాన్..
లక్ష్మీ ఇళ్లు ఒత్తుతుంటే మనీషా, దేవయాని చూస్తారు. లక్ష్మీ ఇళ్లు పసుపు నీటితో కడుగుతుంటే ఆయిల్ పోసి లక్ష్మీ మీద నింద వేసేద్దామని అంటుంది దేవయాని. లక్ష్మీ కిచెన్‌కి వెళ్లగానే లక్ష్మీ తుడుస్తున్న చోట ఆయిల్ వేసేస్తుంది. తర్వాత మనీషా అటుగా వెళ్లి ఆ ఆయిల్ మీద కాలు వేసి జారిపోతుంది. మనీషా పడిపోబోతే లక్ష్మీ తుడుస్తున్నా మాబ్ మనీషా ముఖానికి అడ్డు పెట్టి ఆపుతుంది. తర్వాత మనీషా పడిపోబోతే ఆపుతుంది. మనీషా ముక్కు నుంచి రక్తం వస్తుంది.
లక్ష్మీ మీద నింద..
దేవయాని హడావుడిగా వచ్చి లక్ష్మీ ఆయిల్ పోసి మనీషా కడుపు పోగొట్టడానికి ప్లాన్ చేసిందని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. లక్ష్మీ అలా చేయదని మిత్ర అంటాడు. మనీషా కింద పడలేదని పడబోతే నేను ఆపడంతో ముక్కునుంచి రక్తం వచ్చిందని చెప్తుంది. ఆయిల్ ఎందుకు కలిపావ్ అని అరవింద లక్ష్మీని అడుగుతుంది. దాంతో జాను ఆయిల్ పడేసింది దేవయాని అత్తయ్య అని అంటుంది. దేవయాని కోడలి మీద అరుస్తుంది. దాంతో వివేక్ నేను చూశానని చెప్తాడు.
దొరికిపోయిన దేవయాని..
లక్ష్మీ టిష్యూ పేపర్ తీసుకొచ్చి దేవయాని చేతులకు అతికిస్తుంది. దాంతో తన చేతుల్లో ఉన్న ఆయిల్ పేపర్‌కి అతుక్కుంటుంది. అరవిందకు అది చూపిస్తుంది. దేవయాని షాక్ అయిపోతుంది. లక్ష్మీనే ఏదో చేసిందని దేవయాని అంటుంది. దాంతో అరవింద దేవయానిని కొట్టి ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే చంపేస్తా అని వార్నింగ్ ఇస్తుంది. బిడ్డ నాకు కావాలి ఆ బిడ్డకు ఏమైనా అయితే ఎవర్నీ క్షమించను అని వార్నింగ్ ఇస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: అసలైన వారసురాలు ఎవరు నాన్న? కాశీ, స్వప్నల ఎంక్వైరీ





















