Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today April 16th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్కీ బ్యాగ్‌లో సీక్రెట్ ఫోన్.. పిల్లలు కిడ్నాప్ అయ్యారని తెలుసుకున్న లక్ష్మీ!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మిత్రను చంపడానికి పాము ఇంట్లోకి దూరడం పిల్లలు కిడ్నాప్ అవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మిత్ర ఇంటికి సరయు మనుషులు వచ్చి పిల్లల్ని ఫంక్షన్‌కి తీసుకెళ్తామని అంటారు. లక్ష్మీ మిత్రతో పిల్లల్ని ఒంటరిగా పంపించాలి అంటే భయంగా ఉందని చెప్తుంది. మిత్ర కూడా అదే అంటాడు. అయితే అరవింద, జయదేవ్‌లు నిన్న ఓకే చెప్పి ఈ రోజు ఇలా అనడం కరెక్ట్ కాదు అని జాను, వివేక్‌లను తోడుగా పంపిద్దామని అంటారు.
జాను, వివేకలను పంపడం కుదరదు జానుకి పిల్లలు పుట్టాలని పసరు మందు తీసుకుంటున్నానని ఆవిడ ఇప్పుడు వస్తారని దేవయాని అంటుంది. మనీషా పర్లేదని జాను, వివేక్‌లను పంపించమని అంటుంది. దాంతో జాను, వివేక్‌లను తోడిచ్చి అందరూ పిల్లల్ని పంపిస్తారు. సరయు మనుషులు లక్కీ, జున్నులను వ్యాన్‌లో తీసుకెళ్తే వివేక్, జానులు వెనక కారులో ఫాలో అవుతారు.
మినిస్టర్ ప్రోగ్రామ్‌కి మిత్రని అరవింద రావొద్దు అని చెప్తుంది. మన ప్రాజెక్ట్ కోసం నన్ను రావొద్దు అంటావ్ ఏంటి అమ్మ అని మిత్ర ప్రశ్నిస్తాడు. నువ్వు రావొద్దు అంటే రావొద్దు నేను మీ నాన్న డైరెక్టర్స్‌గా వెళ్తాం అని అంటారు. లక్ష్మీ కూడా మిత్రని ఒప్పిస్తుంది. ఈవినింగ్ గెట్ టూ గెదర్ ఉందని దాని ఏర్పాట్లు చూడమని చెప్తుంది. ఇక మనీషా మనసులో లక్ష్మీ ఉంటే మిత్రకు గండం వస్తే లక్ష్మీ కాపాడి మంచి పేరు తెచ్చుకొని ఇంటి నుంచి వెళ్లకుండా తనకు ఎసరు అవుతుందని లక్ష్మీని ఎలా అయినా పంపాలని అనుకుంటుంది. అందుకు అందరితో ఛైర్మన్‌గా లక్ష్మీ వెళ్లాలి అని అంటుంది. లక్ష్మీ వెళ్లను అంటే వెళ్లను అంటుంది. దేవయాని కూడా లక్ష్మీని వెళ్లమంటే మిత్ర గారిని వదిలేసి వెళ్లను అంటుంది. దాంతో అరవింద లక్ష్మీని వెళ్లమని చెప్తుంది. తన మాట కాదనొద్దని అంటుంది. దాంతో లక్ష్మీ మిత్రని జాగ్రత్తగా చూసుకోమని అరవిందతో చెప్పి వెళ్లిపోతుంది.
పిల్లల్ని తీసుకెళ్లిన సరయు మనుషులు పిల్లలకు మత్తు మందు కలిపిన చాక్లెట్లు ఇస్తారు. లక్కీ జున్ను మత్తుతో పడుకున్న తర్వాత మిగతా పిల్లల్ని వాళ్ల ఇంటికి పంపేయమని వేరే మనుషులకు చెప్తారు. ఇక జాను, వివేక్ వెళ్తున్నా కార్ రిపేర్ అవుతుంది. దాంతో జాను వ్యాన్ వెళ్లిపోతుంది క్యాబ్ బుక్ చేయమని వివేక్‌తో చెప్తుంది. రౌడీలు లక్కీ, జున్నులను సరయు కారులో ఎక్కిస్తారు. మరోవైపు పాములమ్మ మంత్రించి పాముని మిత్ర ఇంటి గది వైపు పంపిస్తుంది. మంత్ర గత్తెను చూసిన జయదేవ్ ప్రశ్నించడంతో దేవయాని వెళ్లి జాను కోసం పసరు మందు తీసుకొచ్చారని అంటుంది. పసరు మందు తీసుకున్న దేవయాని జాను పని అయిపోయింది అనుకుంటుంది. మనీషా వచ్చి ఆంటీ మీ పని పూర్తయినట్లుందని అంటుంది. వివేక్‌తో దాన్ని తన్నించి ఇంట్లో నుంచి పంపించేస్తాను అంటుంది.
లక్ష్మీ గండం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో మేనేజర్ ఫోన్ చేసి ప్రొగ్రాంకి కాస్త టైం పడుతుంది. మినిస్టర్ గారు ఆర్ట్ గ్యాలరీకి వెళ్లి ప్రోగ్రాంకి వస్తారని చెప్తాడు. లక్ష్మీ షాక్ అయిపోతుంది. ఆ ఆర్ట్ గ్యాలరీలో పిల్లల ప్రోగ్రాం ఉందని పిల్లల్ని తీసుకెళ్లారు మరి అక్కడ మినిస్టర్ ప్రొగ్రాం ఎలా ఏర్పాటు చేస్తారు అని అనుకుంటుంది. ఇక లక్ష్మీ ముందే అనుమానంతో లక్కీ బ్యాగ్‌లో లొకేషన్ ఆన్ చేసి ఓ ఫోన్ పెట్టుంటుంది. అందులో లొకేషన్ చూసి చెప్పిన చోటుకు కాకుండా వేరే చోటుకు వెళ్లడం గ్రహించి వివేక్‌కి కాల్ చేసి పిల్లలు కిడ్నాప్ అయ్యారని చెప్తుంది. దాంతో వివేక్, జానులు లక్ష్మీ పంపిన లొకేషన్‌కి క్యాబ్‌లో బయల్దేరుతారు. పిల్లల్ని ఎవరు ఎత్తుకెళ్లుంటారు అని లక్ష్మీ అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: "మీరంతా కలిసి నా భర్తకి ఈ పరిస్థితి తీసుకొచ్చారు.. జీవితంలో నీ ముఖం చూపించకు"





















