అన్వేషించండి

Chinni Serial Today May 2nd: చిన్ని సీరియల్: దేవాకి గన్ గురి పెట్టి బెదిరించిన చిన్ని! కథ క్లైమాక్స్‌కి వచ్చేసిందా!

Chinni Serial Today Episode May 2nd: చిన్ని దేవాకి గన్ గురి పెట్టి వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode : మ్యాడీ చిన్నిని తీసుకొని దేవా, నాగవల్లి దగ్గరకు వెళ్లి మమ్మీ కేసు రీ ఓపెన్ చేయిస్తున్నా అని చెప్తాడు. దాని వల్ల ఏమైనా ఉపయోగం ఉందా నాన్న అని దేవా అడిగితే ఉంటుంది నాన్న.. కేసు రీఓపెన్ చేయించడం వల్ల చిన్ని వాళ్ల అమ్మ దోషా కాదా తెలుస్తుంది. అసలు ఆవిడ నిర్దోషి అయితే అసలు దోషి ఎవరో తెలుస్తుంది కదా అని అంటాడు. మంచిదే నాన్న అని నాగవల్లి అంటుంది. నువ్వు ఎంత ప్రయత్నించినా చివరకు తెలిసేది ఒకటే నాన్న మీ అమ్మని చిన్ని వాళ్ల అమ్మ చంపేసింది అని తెలుస్తుంది. ఆ నిజం అప్పుడే తెలిసిన మళ్లీ  ప్రయత్నించడం టైం వేస్ట్ కదా అని దేవా అంటాడు.

చిన్ని దానికి తెలియాలి మామయ్య ఇలా టైం వేస్టే అనుకుంటే ఒక వేళ జరిగింది అంతా అబద్ధం అని తెలిస్తే రెండు జీవితాలు వేస్ట్ అయినట్లే కదా.. అందుకే మ్యాడీ నిజనిజాలు తెలుసుకోవడానికి వెళ్తున్నాడు.. ఆల్‌ది బెస్ట్ చెప్పండి మామయ్య అని చిన్ని అంటుంది. దేవా, నాగవల్లి మ్యాడీకి ఆల్‌ ది బెస్ట్ చెప్తారు. నాగవల్లి దేవాతో మ్యాడీ చేసిన ప్రయత్నం వాడికి టైం వేస్ట్ అని ఫీలవ్వొద్దు.. దాని వల్ల మనకు మంచి టైం వస్తుందని అనుకో అని చెప్పి వెళ్లిపోతుంది. దేవా పార్వతి ఫొటో చూస్తే ఓసేయ్ చచ్చినదానివి చచ్చినట్లు ఉండక నన్ను ఇలా చంపుతున్నావేంటే.. వాడు తీగ లాగితే డొంకంతా కదులుతుందే అని అనుకుంటాడు. ఇంతోల చిన్ని మామ మామ మామ,.. అంటూ పాట పాడుతూ కాఫీ తీసుకొని వస్తుంది. మీ అబ్బాయి కేసు రీ ఓపెన్ చేయడం మీకు ఇష్టం లేదు కదా.. దాని గురించి ఆలోచించి ఆలోచించి మీకు తలనొప్పి వస్తుంది కదా అందుకే ఈ కాఫీ తెచ్చా అంటుంది. 

Also Read: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమ ధీరజ్‌కి డబ్బు సాయం చేయగలదా! నగలు తాకట్టుకు వెళ్లినట్లు సేన, భద్రావతిలకు తెలిసిపోయిందా!

దేవా కోపంతో గన్‌ తీసి చిన్నికి గురి పెడతాడు. చిన్ని షాక్ అయిపోతుంది. ఏయ్ ఏంటి దేవా అంటే తమాషా అనుకుంటున్నావా.. ఇలా ఎక్స్టాలు చేశావంటే అని అంటే నన్ను చంపేస్తారా అంటూ చిన్ని దేవా దగ్గర గన్‌ లాక్కుంటుంది. బాలరాజు కూతుర్ని మామయ్యగారు ఇలాంటి రివాల్వర్‌లకు వార్నింగ్‌లకు భయపడను.. రివాల్వర్ గురి పెట్టినా మీరు చంపరు.. చంపలేరు అని నాకు తెలుసు.. అని అంటుంది. మీ మనసులో ఏం ఉందో నేను అర్థం చేసుకోగలను కానీ ఈ పాడు లోకం అర్థం చేసుకోలేదు కదా మామయ్యగారు.. ఇంకెప్పుడూ ఇలా రివాల్వర్ చూపించి బెదిరించకండీ.. దీని వల్ల మీకే నష్టం.. కేసు రీ ఓపెన్ చేశారు కదా. పార్వతి అత్తయ్యని చంపిన హంతకుడిని మీ ముందు నిలబెడతా అని అంటుంది. 

Also Read: సింధూజాక్షి పురుగుల మందు ఎందుకు తాగింది.? ఈ విషయం గోపీ ఎవరికి చెప్పాడు..?

మ్యాడీ ఇన్‌స్పెక్టర్‌ని కలుస్తాడు. పార్వతి మేడంని చంపింది కావేరినే మ్యాడీ.. కావేరి భర్త కూడా హంతకుడే సొంతబామ్మర్దిని చంపాడు అని చెప్తాడు. దానికి మ్యాడీ వెంటనే చందుకి కాల్ చేసి చందు మీ నాన్న గారిని ఎవరో హత్య చేశారు కదా అంటాడు. అవును మ్యాడీ అని చందు అంటాడు. మా మామయ్య హత్య చేశాడు అని శిక్ష వేశారు.. మా మామయ్య ఎలాంటి వాడో నాకు తెలుసు.. మా మామయ్యే మా నాన్నని చంపారని మా అమ్మ, చెల్లి నమ్ముతున్నారు కానీ నేను నమ్మను.. అంతే కాదు.. మా అత్తయ్య మీ అమ్మని చంపలేదు అని అంటాడు. అందుకే కేసు రీ ఓపెన్ చేయించా అని మ్యాడీ అంటాడు. కచ్చితంగా మా అత్తయ్యా ఈ హత్య చేయలేదు అని నీకు తెలుస్తుంది మ్యాడీ.. అంత వరకు మా చిన్నిని హంతకురాలి కూతిరిలా చూడకు.. మీ ఇద్దరూ ఎప్పటికీ సీతారాముల్లా ఉండాలి.. నేను హనుమంతుడిలా ఎలాంటి సాయం అయినా చేస్తా అంటాడు. 

Also Read: కేదార్‌ను శివశంకర్‌ కలవకుండా ఏం చేశాడు..? యువరాజు వలలో శివశంకర్‌ ఎలా చిక్కాడు..?

మ్యాడీ ఇన్వెస్టిగేషన్ చేయమని అంటాడు. ఇక చిన్ని బాలరాజుకి కాల్ చేసి మ్యాడీ కావేరి కేస్ రీ ఓపెన్ చేస్తున్నాడని చెప్తుంది. ఇంతలో చిన్ని దగ్గరకు లోహిత వస్తుంది. ఏంటి అలా చూస్తున్నావ్ అని చిన్ని అడిగితే లోహిత చిన్ని ముఖం మీద నీరు కొడుతుంది. నీకు ఏమైనా పిచ్చి పట్టిందా అని చిన్ని అడిగితే నాకు కాదే పిచ్చి నీకు పిచ్చి.. మా నాన్నని మీ నాన్న చంపాడు అని తెలిసి కూడా నువ్వు మసి పూసి మారేడు కాయ చేయాలి అనుకుంటున్నావ్.. మామయ్య మామయ్య అంటూ మా ఇంట్లో దిగబడ్డావ్ అంతే మా జీవితాలు నాశనం అయిపోయావి.. ఇంకా ఎవరికి నాశనం చేయడానికి మీ అమ్మ నిర్దోషి అని నిరూపించాలని చూస్తున్నావ్ అని అంటుంది.

లోహి మా అమ్మనాన్న గురించి నీకు ఏం తెలుసే.. అబద్ధాలు చెప్పడం నీకు తెలుసు మా వాళ్లకి కాదు.. చేతనైతే నువ్వు చేసిన తప్పులు వరుణ్ మందు చెప్పి క్షమించమని అడుగు అంటుంది. అసలు నా జీవితంలోకి దూరడానికి నీకు ఏం హక్కు ఉందే అని లోహిత అడిగితే నాకు ఉంది.. నాకు మాత్రమే ఉంది.. నీ మేనత్త కూతురిలా నీ జీవితం గురించి నాకు హక్కు ఉంది.. ఇంకో నాలుగు ఐదు రోజుల్లో మా అమ్మ కేసు తేలిపోతుంది. ఈ లోపు నువ్వు నీ తప్పులు ఒప్పుకోకపోతే నేనే బయట పెడతా అని అంటుంది. లోహిత చాలా భయపడుతుంది. మ్యాడీ జైలుకి వెళ్లి కావేరి కేసు ఇన్వెస్ట్‌ గేషన్ చేసిన అధికారిని కలుస్తాడు. మధ్యలో మీరు తప్పుకున్నారు అని తెలిసింది.. మీరు తప్పుకున్నారా మిమల్ని ఎవరైనా తప్పించారా అని అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Jagadhatri Serial Today August 21th:ఒక్కరోజులోనే కేదార్ ఆనందం ఆవిరి...పద్మతల్లిని గన్‌తో కాల్చివేసిన మినిస్టర్‌ మనుషులు
జగద్ధాత్రి సీరియల్: ఒక్కరోజులోనే కేదార్ ఆనందం ఆవిరి...పద్మతల్లిని గన్‌తో కాల్చివేసిన మినిస్టర్‌ మనుషులు
Illu Illalu Pillalu Serial Today August 21st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
Life Of Suma: బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!
బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Embed widget