Brahmamudi November 17th Today Episode:రాహుల్ ఉచ్చులో చిట్టీ, స్వప్న పని అవుటేనా!
Brahmamudi Serial Today Episode: స్వప్న అరుణ్ కలిసి ఉన్న ఫొటో పట్టుకొని రాహుల్ బాధ పడటం బామ్మ చూసేస్తుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది

Brahmamudi Serial November 17th Episode: కావ్య అందరికీ టిఫిన్ వడ్డిస్తుంటుంది. ఇంతలో స్వప్న కూడా అక్కడికి వస్తుంది. అక్కడ బామ్మని చూసి మళ్లీ తనకి అరుణ్ గురించి అడుగుతుందేమోనని స్వప్న వెనక్కి వెళ్లిపోతుంటుంది. అయితే రుద్రాణి స్వప్నను ఇరికించేందుకు స్వప్నని అక్కడికి పిలుస్తుంది. స్వప్నను చిట్టీ అనుమానంగా చూస్తుంటుంది. దీంతో స్వప్న భయపడుతుంది.
రుద్రాణి: ఏంటి అమ్మా నా కోడల్ని అలా చూస్తున్నావు. ఏమైనా అడగాలా.. నిన్ను చూస్తే అలానే ఉందిలే
చిట్టీ: నేను ఎందుకు ఏమడగాలి
ధాన్యలక్ష్మి: ఏంటి రుద్రాణి ఈ మధ్య జాతకాలు చెప్పడం మొదలు పెట్టావా ఏంటి. అత్తయ్య గారి మనసులో ఏముందో తెలుసుకున్నావ్ కదా అందుకే డౌట్ వచ్చింది. ఇక టిఫిన్ తినడం ఇష్టం లేదని స్వప్న అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంతలో రాజ్ వస్తాడు.
రాజ్: మనసులో నాతోనే సారీ చెప్పించుకుంటావా ఇప్పుడు నీకు నా నటన ఎలా ఉంటుందో చూపిస్తా.) ఏంటి కళావతి నేను వచ్చినా టిఫెన్ పెట్టడం లేదు. నోరు తెరచి అడిగితే పెడతావా. వాళ్లందరికీ పెడుతున్నావు.
కావ్య: ఓ నటన సరే.. అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా అండీ మీరు వడ్డించుకోలేరా.. వాళ్లందరూ అంటే పెద్దవాళ్లు అందుకే
రాజ్: ఓహో వాళ్లు ముసలి అయిపోయారు అంటున్నావ్ అంతే కదా అంటే అక్కడ ఉన్నవాళ్లు ఒప్పుకోరు ఇక రాజ్‌కి కావ్య వడ్డిస్తుంది.
రుద్రాణి: మీ ఇద్దర్ని చూస్తుంటే అన్యోన్యంగా ఉన్నట్లు లేదు. కోపంతో పగ తీర్చుకుంటున్నట్లు ఉంది.
చిట్టీ: దంపతులు అన్నాక కోపాలు, తాపాలు సరదాలు అన్నీ ఉంటాయి అలా ఉంటేనే కాపురం అంటారు.
ధాన్యలక్ష్మి: తనెకెలా తెలుసులే అత్తయ్య
రుద్రాణి: ఎక్కడికి వెళ్లినా నా మొగుడు దగ్గరికే రావాలా అంటూ తినకుండా లేచి వెళ్లిపోతుంది
చిట్టీ: ఏంటి ధాన్యలక్ష్మి ఎందుకు అలా అన్నావు. ఇప్పుడు చూడు తినకుండా వెళ్లిపోయింది అంటే టిఫెన్ అంతా అయిపోయింది అని సెటైర్లు వేస్తారు. ఇక రాజ్ తినేసి చేయి కడుగుకోవడానికి వెళ్లే కావ్య వెనక వెళ్తుంది. రాజ్ కావ్య చీరలో చేయి తుడుచుకుంటే కావ్య టవల్ ఉంది కదా అంటుంది. ఇంతలో రాజ్ తండ్రి రాజ్‌కి ఇలాంటి అలవాటు ఉంది వాళ్ల అమ్మ చీరకు ఎప్పుడూ తుడుస్తాడు అంటే ఇంతలో కావ్య అయితే మీ అమ్మ స్థానం నాకు ఇచ్చారా అండీ అంటూ రాజ్‌ను ఇరికించేస్తుంది.
మరోవైపు స్వప్న అరుణ్‌కి ఫోన్ చేస్తుంది. అరుణ్ ఫోన్ కట్ చేస్తాడు. ఇక అరుణ్ రాహుల్‌కి ఫోన్ చేసి స్వప్న ఫోన్ చేసింది మాట్లాడాలా వద్దా అని అడుగుతాడు. అయితే తాను చెప్పే వరకు మాట్లాడొద్దు అని అరుణ్‌కి రాహుల్ చెప్తాడు. ఇక పైకి చిట్టీ రావడం చూసి రాహుల్, రుద్రాణిలు ప్లాన్ చేస్తారు. రాహుల్ అరుణ్, స్వప్నల ఫొటో పట్టుకొని బాధ పడినట్లు యాక్టింగ్ చేస్తాడు. చిట్టీ ఆ ఫొటో చూస్తుంది. రాహుల్‌కి ఈ విషయం ముందే తెలుసుని బాధ పడుతున్నాడని అనుకుంటుంది. అందరికీ తెలిసేలోపు ఈ విషయం రాజ్‌కి చెప్పి అరుణ్ గురించి తెలుసుకోవాలని అనుకుంటుంది.
కనకం:( అప్పు ఒంటరిగా కూర్చొని బాధ పడుతుంటుంది. అక్కడికి కనకం వస్తుంది) ఎప్పుడూ కొడతాను అని బెదిరించడమే కానీ ఏ రోజూ నిన్ను కొట్టలేదే. ఇప్పుడు ఏదోలా ఉంది
అప్పు: చేతులు నొప్పి పెడుతున్నాయా
కనకం: మనసు నొప్పి పెడుతుందా.. నువ్వు మాత్రం ఆ తప్పు ఎందుకు చేశావే
అప్పు: తెలీదమ్మా నిజంగానే తెలీదమ్మా.. మంచొడు అమాయకుడు అనుకున్నాకానీ వాడిమీదే నాకు మనసు అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. ముందే నా మనసు నాకు చెప్పుంటే అప్పుడే దూరం పెట్టేదాన్ని కదా అమ్మా. అదేనేమో ప్రేమ అంటే. దగ్గర ఉన్నప్పుడు విలువ తెలీదు. దూరం అయిపోతున్నప్పుడే విలువ తెలుస్తుంది. వాడు నాకు ఏం దూరం కాలే. ఆ అనామిక ఎప్పుడు అయితే వచ్చిందో అప్పుడే నాకు దూరం అయిపోయాడు. ముందు నన్ను పట్టించుకోలేదని కోపం తెచ్చుకున్నా కోప్పడేదాన్ని. ఆడపిల్ల మనసు ఇలా ఉంటుందని నాకు కూడా ప్రేమ అనేది ఒకటి ఉంటుందని నేను అనుకోలేదు. లేకపోతే ఏంటి అమ్మా కావ్య అక్క ఆ ఇంట్లో పడే కష్టాలు చూసి కూడా వాళ్లు మనల్ని మనుషులుగా చూడరు అని తెలిసి కూడా నేను ఎందుకు వాళ్ల అబ్బాయినే ప్రేమిస్తాను అమ్మా. కోరికోరి ఆ ఇంట్లోనే పడాలి అని నేనేందుకు అనుకుంటా అమ్మా. ఏందో ఆడపిల్ల అనే పదం ఆడపిల్లకే కొత్తగా అనిపిస్తోంది.
కనకం: ఇప్పుడు మన చేతిల్లో ఏం లేదు
అప్పు: తెలుసు అమ్మా అందని దాని కోసం ఆశ పడటం నాదే తప్పు. కానీ ఏం చేయాలి అంటూ అప్పు ఏడుస్తుంది. ఇక మరోవైపు కావ్య రాజ్‌ను చూసి రొమాంటిక్ కవితలు చదువుతుంటుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

