అన్వేషించండి

Brahmamudi Serial Today March 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : రాజ్‌ను రామ్‌గా మార్చేసిన యామిని – కనకంతో మాట్లాడిన యామిని అమ్మా నాన్నలు

Brahmamudi Today Episode: రాజ్‌ను పూర్తిగా రామ్‌గా మార్చేసిన యామిని నిజం బయటకు చెప్పొద్దని తన తల్లిదండ్రులను బ్లాక్‌ మెయిల్ చేయడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.            

Brahmamudi Serial Today Episode:  రాజ్‌  గతం మర్చిపోవడాన్ని పూర్తిగా తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటుంది యామిని. అయితే ఇలా చేయడం తప్పని తన తల్లిదండ్రులు చెప్పినా వినకుండా తన ప్రేమని మళ్లీ దక్కించుకోవడానికి దేవుడిచ్చిన అవకాశం అని చెప్తుంది. మరోవైపు హాస్పిటల్‌లోనే అపర్ణ ఏడుస్తూ ఉంటుంది.

ఇందిర: రాజ్‌ ఎక్కడో ఒక చోట బతికే ఉంటాడు అపర్ణ నువ్వేం కంగారు పడొద్దు.

ప్రకాష్‌:  మన అప్పు పోలీస్‌ డిపార్ట్మెంట్‌లోనే ఉంది కదా.. అప్పు ద్వారా స్పెషల్ పర్మిషన్‌ తీసుకుని మనం కూడా ఆ లోయలో వెతుకుదాం.

ధాన్యలక్ష్మీ : ఏవండి మన కళ్యాణ్‌ కూడా అక్కడికి వెళ్లి వచ్చాడు. అక్కడికి వెళ్లి వచ్చినప్పటి నుంచి వాడిలో వాడే కుమిలిపోతున్నట్టు కనిపిస్తున్నాడు. ఏదో ఉందండి. వీళ్లు మనకు చెప్పకుండా ఏదో దాస్తున్నారు అనిపిస్తుంది.

అపర్ణ:  ఏంట్రా ఏం ఉంది. ఇంకా నువ్వు చెప్పాల్సింది. మేము వినాల్సింది ఇంకా ఏమైనా ఉందా..?

కళ్యాణ్‌: పెద్దమ్మా అది..

అపర్ణ: మాట్లాడవేంట్రా.. అప్పు ఏం అయింది అమ్మా వెళ్లి ఏం తెలుసుకున్నారు. కావ్య చెప్పినట్టు ఈ షర్ట్‌ వల్ల వాడు చనిపోయాడని ఎలా అనుకోవాలి చెప్పు.

కనకం: అప్పు ఏమైందే చెప్పవే.. కావ్య ప్రాణాలతో ఉంది కదా.. మరి అల్లుడు గారు కూడా అదే కారులో ఉన్నారు కదా..? మరి ఎందుకు తను అక్కడ దొరకలేదు. మీ పోలీసులు వెళ్లి ఏం తెలుసుకున్నారు చెప్పవే.. ఇంకా మా అందరి గుండెల్లో చిచ్చు పెట్టు మాటలు ఉన్నాయా..?

అప్పు: అమ్మా ఏం చెప్పమంటావు.. బావ మన కుటుంబానికి దేవుడు.. ఆ దేవుడు ఉన్నాడని చెప్పనా..? అసలు లేడని చెప్పనా..? లేడమ్మా.. బావ ఆ దేవుడి దగ్గరికే వెళ్లిపోయాడు.

అని చెప్పగానే..  అందరూ షాక్‌ అవుతారు. యామిని దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి రాజ్‌ వస్తువులు అన్ని పోలీసులకు దొరికేలా చేశానని.. అందరూ రాజ్‌ చనిపోయాడని నమ్ముతున్నారని.. చెప్పి వెళ్లిపోతాడు.

వైదేహి: ఏంటమ్మా ఇదంతా..

యామిని:  నా కథ నేనే రాసుకుంటున్నాను. రాజ్‌ జీవితంలో ఒక కొత్త ఆధ్యాయం మొదలుపెట్టబోతున్నాను. రాజ్‌ ఇప్పుడు రామ్‌ గా మారిపోతున్నాడు.

రాజ్‌ స్పృహలోకి వస్తాడు. యామిని ఏడుస్తూ లోపలికి వెళ్తుంది.

యామిని: బావ నువ్వు మళ్లీ నాకు దక్కుతావని అనుకోలేదు. ఈ యాక్సిడెంట్‌ జరిగినప్పటి నుంచి తిండి నిద్ర మానేసి నేను ఇక్కడే ఉన్నాను.

రాజ్‌: ఎవరు నువ్వు…?

యామిని: ఎవరు నేనా.. నేను నీ యామినిని బావ..!

రాజ్‌: యామినియా..? నాకు తెలియదు

యామిని: అమ్మా నాన్న ఇటు రండి.. చూడండి బావ నన్ను గుర్తు పట్టడం లేదు. మీరైనా చెప్పండి.. సరిగ్గా చూడు బావ మా మమ్మీ, మా డాడీ కనీసం వీళ్లైనా గుర్తు న్నారా..? నీకు

రాజ్‌:  లేదు  నాకేం గుర్తు రావడం లేదు. అసలు నేను ఎవరు..? నా వాళ్లు ఎవరు…

యామిని: డాక్టర్‌.. డాక్టర్‌

డాక్టర్‌: మీరు కూల్‌ గా ఉండండి.. పేషెంట్‌ను డిస్టర్బ్‌ చేయోద్దు. అతన్ని ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి.

అని చెప్పి డాక్టర్‌ వెళ్లిపోగానే.. వైదేహి, యామిని పక్కకు తీసుకెళ్లి నువ్విలా చేయడం కరెక్టు కాదు మాకు నచ్చడం లేదు. నిజం చెప్పేస్తాము అంటుంది. అయితే యామిని కోపంగా రాజ్‌ నాకు కావాలి. అందుకోసం ఏం చేయడానికైనా నేను సిద్దం. అంతే కానీ మీరు నిజం చెబితే నేను మళ్లీ డ్రగ్స్‌ తీసుకుంటాను. అంటూ వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో వైదేహి సైలెంట్‌గా వెళ్లి రిసెప్షన్‌లో కూర్చుంటుంది. అక్కడే ఏడుస్తూ కనకం ఉంటుంది. ఇద్దరు ఒకరిని ఒకరు పలకరించుకుని మాట్లాడుకుంటారు. ఇంతలో కావ్యకు స్పృహ వస్తుంది. రాజ్‌ ఎక్కడని అడుగుతుంది. అందరూ నా దగ్గర ఎందుకున్నారని ఆయన్ని వెతకండని చెప్తుంది. అప్పును తిడుతుంది. దీంతో అపర్ణ ఏడుస్తూ.. రాజ్‌ ఎక్కడున్నాడో తెలియడం లేదని చెప్పడంతో కావ్య షాక్ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 12th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి కోసం తండ్రిని బెదిరించిన అంబిక! పెద్దాయన బంటీకి ఆస్తి ఇచ్చేస్తారా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి కోసం తండ్రిని బెదిరించిన అంబిక! పెద్దాయన బంటీకి ఆస్తి ఇచ్చేస్తారా!
Nindu Manasulu Serial Today October 12th: నిండు మనసులు: శాశ్వతంగా విడిపోవాలని నిర్ణయించుకున్న సిద్ధూ, ప్రేరణలు! కన్నీటి వీడ్కోలు!
నిండు మనసులు: శాశ్వతంగా విడిపోవాలని నిర్ణయించుకున్న సిద్ధూ, ప్రేరణలు! కన్నీటి వీడ్కోలు!
Godavari Serial Today October 12th: 'గోదావరి' సీరియల్: సంజయ్‌కి ఐలవ్‌యూ చెప్పిన జాను! నందుకి కొత్త సమస్య!
'గోదావరి' సీరియల్: సంజయ్‌కి ఐలవ్‌యూ చెప్పిన జాను! నందుకి కొత్త సమస్య!
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 12: తండ్రిని చంపిన విక్కీపై కేసుపెట్టిన రాధ.. శీనయ్య కేసు ఛేదించేందుకు మళ్లీ ఖాకీ డ్రెస్‌ వేసుకున్న రామచంద్రం
నువ్వులేక నేను లేను: తండ్రిని చంపిన విక్కీపై కేసుపెట్టిన రాధ.. శీనయ్య కేసు ఛేదించేందుకు మళ్లీ ఖాకీ డ్రెస్‌ వేసుకున్న రామచంద్రం

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget