అన్వేషించండి

Brahmamudi Serial Today February 6th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రుద్రాణి, ధర్మేంద్ర మధ్య గొడవ – ధర్మేంద్రను తిట్టిన తులసి

Brahmamudi serial today episode February 6th: మినిస్టర్‌ ధర్మేంద్రను రుద్రాణి తిడుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: రాజ్‌, కావ్యలు తమ బిడ్డ గురించి ధర్మేంద్ర గురించి రూంలో కూర్చుని ఆలోచిస్తుంటారు. బిడ్డను ఎలా తెచ్చుకోవాలో..? ఇప్పుడున్న పాపకు ఆపరేషన్‌ సక్సెస్‌ కావాలని అనుకుంటుంటుంటారు.

రాజ్‌: వాడి బలహీనత వాడి భార్య. మనం ఎప్పుడు నిజం చెప్పేస్తామోనని వాడి నుంచి బిడ్డను ఎక్కడ తెచ్చుకుంటామోనని?  భయపడి చస్తున్నాడు.. ఏదో ఒకరోజు వాడు తప్పులన్నీ ఒప్పుకుని మారిపోతాడని నాకు నమ్మకం ఉంది

కావ్య: కానీ భార్య మీద వాడికున్న ప్రేమ .. బలహీనతలో నుంచి బలంగా మారితే వాడు ఇంకా రాక్షసుడిలా మారతాడేమో? భార్యను కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తాడేమో

రాజ్‌: వాడిని మార్చాలని.. వాడిని బుద్ది బలంతో కొట్టాలని, వాడంతటే వాడే కళ్లు తెరవాలని చెప్పింది నువ్వే కదా..? మళ్లీ ఇప్పుడు ఇలా మాట్లాడతావేంటి..? కళావతి

కావ్య: సంస్కారం ఉన్న వాళ్లకి ఒకటే దారి.. కానీ అలాంటి నీచులకి, తెగించిన వాళ్లకి వంద దారులు ఉంటాయి

రాజ్‌: అక్కడి వరకు వస్తే వాడికంటే మనం ఒక మెట్టుపైనే ఉంటాము.. తాళి కట్టించుకున్న భార్య కోసం వాడే అంత చేస్తే.. పేగు తెంచుకున్న మమకారం కోసం మనమెంత తెగించాలి.. వాడిది స్వార్ధం.. మనది బంధం. తల్లి అనురాగం ముందు వాడి అధికారం ఓడిపోక తప్పదు. ఆ మినిస్టర్ కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యింది

అంటూ రాజ్ చెప్పగానే.. ఏమో చూద్దాం.. మన ప్రయత్నం మనం చేద్దాం. అంతిమంగా మన బిడ్డను దక్కించుకోవాలి అంటుంది కావ్య. తర్వాత తులసి, కావ్య ఇద్దరు కలిసిపోయినట్టు ధర్మేంద్ర కలగంటాడు. నిద్రలోంచి ఉలిక్కిపడి లేస్తాడు.

ధర్మేంద్ర: ఈ టెన్షన్‌ భరించలేను.. తులసి ముందు తప్పు ఒప్పుకుని నిజం చెప్పాలి. నా భార్యను క్షమించమని అడగాలి. తులసిని కాపాడుకోవాలి.

అనుకుంటూ కింద పాపతో ఉన్న తులసి దగ్గరకు వెళ్తాడు ధర్మేంద్ర.

ధర్మేంద్ర: కావ్య, రాజ్‌ల ప్రాబ్లమ్ గురించి ఆలోచిస్తున్నాను

తులసి: కావ్య తన బిడ్డకు దూరమై.. ఎంత వేధన పడుతుందో తెలుసా? మీరే వాళ్లకి సాయం చేస్తానని చెప్పారు కదా

ధర్మేంద్ర: ఎవరో  పురిట్లోనే వాళ్ల బిడ్డను మార్చేశారు అంటే వాళ్లకు ఆ బిడ్డతో ఎంత అవసరం ఉందో? వాళ్లు ఏ పరిస్థితుల్లో అలా చేశారో? వాళ్ల వైపు కూడా ఒకసారి ఆలోచించాలని కదా..?

తులసి: కన్నతల్లికి బిడ్డను దూరం చేసి ఆ తల్లి కన్నీళ్లకు కారణమైన వాళ్లకి మీరు సపోర్ట్ చేస్తున్నారా..? కారణం ఏదైనా సరే.. వాళ్లు మీకు కనక దొరికితే నేను వాళ్లను జైళ్లో వేయిస్తాను.. చివరికి మీరైనా సరే శిక్ష పడాల్సిందే

అంటూ తులసి చెప్పి వెళ్లిపోతుంది. వెంటనే ధర్మేంద్ర రాజ్‌కు ఫోన్‌ చేసి కలాలని చెప్తాడు. కట్‌ చేస్తే రాజ్‌, ధర్మేంద్ర ఒక దగ్గర కలుస్తారు.

ధర్మేంద్ర: నేను ఇంత చెబుతున్నా, ఇంత తాపత్రయపడుతున్నా.. నా పాపని తీసుకెళ్లడానికి సిద్ధపడుతున్నావా

రాజ్: నేను తీసుకెళ్తానన్నది మీ పాపని కాదు.. నా పాపని

ధర్మేంద్ర: పాపని ఇవ్వలేను.. నా భార్య బతకదు. నా భార్యకు నిజం చెప్పలేను, ఈ ప్రపంచంలో నాకు నా భార్య కన్నా ఏది ఎక్కువ కాదు. కావాలంటే నా పదవినైనా వదులుకుంటాను కానీ నా పాపని వదులుకోను, నా భార్యను చంపుకోను

రాజ్‌: నీ భార్య మాత్రం ఆరోగ్యంగా ఉన్న పాపతో ఆనందంగా ఉండాలి.. నా భార్య మాత్రం తన కడుపున పుట్టిన బిడ్డను దూరం చేసుకుని సంబంధం లేని బిడ్డను చూసుకుంటూ కన్నీళ్లతో బతకాలా? రేపే పాపకు ఆపరేషన్‌ చేయిస్తున్నాం.. నీకు ఇచ్చిన గడువు కూడా రేపటితో ముగుస్తుంది నువ్వు మా పాపను మాకు అప్పగిస్తే సరే లేదంటే మీ ఆవిడకు నిజం చెప్పేస్తాం

అంటూ వార్నింగ్‌ ఇచ్చి రాజ్ వెళ్లిపోతాడు. తర్వాత కావ్య, తులసి దగ్గరకు వెళ్లి పాపకు బారసాల చేయిస్తున్నామని తులసిని, మినిస్టర్‌ ను రమ్మని పిలుస్తుంది. తులసి సరే అంటుంది. అంతా గమనించిన ధర్మేంద్ర, రుద్రాణికి మొత్తం చెప్తాడు. దీంతో రుద్రాణి కోపంగా తిడుతుంది. అంత జరుగుతున్నా నాకెందుకు చెప్పలేదు అంటూ సీరియస్‌ అవుతుంది. ఇక ఈ విషయం నాకు వదిలేయ్‌ నేను చూసుకుంటాను అంటూ ధాన్యలక్ష్మీకి ఫోన్‌ చేస్తుంది రుద్రాణి. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today October 23rd: 'గోదావరి' సీరియల్: జాను, సంజయ్‌ల ఫస్ట్‌నైట్! అగ్రిమెంట్ పక్కన పెట్టేసి కలిసిపోయారుగా!
'గోదావరి' సీరియల్: జాను, సంజయ్‌ల ఫస్ట్‌నైట్! అగ్రిమెంట్ పక్కన పెట్టేసి కలిసిపోయారుగా!
Meghasandesam Serial Today October 23rd: ‘మేఘసందేశం’ సీరియల్‌: అపూర్వను పూల్‌ను చేసిన ఆకాష్‌ - కొత్త ప్లాన్‌ చెప్పిన భూమి  
‘మేఘసందేశం’ సీరియల్‌: అపూర్వను పూల్‌ను చేసిన ఆకాష్‌ - కొత్త ప్లాన్‌ చెప్పిన భూమి  
Illu Illalu Pillalu Serial Today October 23rd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీని నెట్టేసిన చందు.. తిరుపతి ఐడియా! నర్మదే వల్లీకి దిక్కా! ప్రేమ తింగరి పని!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీని నెట్టేసిన చందు.. తిరుపతి ఐడియా! నర్మదే వల్లీకి దిక్కా! ప్రేమ తింగరి పని!
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 22: శీనయ్య బతికే ఉన్నాడని దమయంతికి చెప్పిన రామచంద్రం...తండ్రి బతికే ఉన్నాడని తెలుసుకుని రాధ ఆనందం
నువ్వులేక నేను లేను: శీనయ్య బతికే ఉన్నాడని దమయంతికి చెప్పిన రామచంద్రం...తండ్రి బతికే ఉన్నాడని తెలుసుకుని రాధ ఆనందం

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rachamallu Siva Prasada Reddy : ఏకగ్రీవాలతో ప్రజలకు అన్యాయం - ఓటుకు నాలుగువేలు ఇవ్వాలంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - ఓటర్లూ అదే ఫీలవుతారా?
ఏకగ్రీవాలతో ప్రజలకు అన్యాయం - ఓటుకు నాలుగువేలు ఇవ్వాలంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - ఓటర్లూ అదే ఫీలవుతారా?
AP Inter Exams Schedule: విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల
విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల
Telangana Graduate MLC Polls : ఎమ్మెల్సీ రేసులో హస్తానికి మిత్రపక్షాల షాక్ - టీజేఎస్-కమ్యూనిస్టుల ఉమ్మడి అభ్యర్థి సిద్ధం?
ఎమ్మెల్సీ రేసులో హస్తానికి మిత్రపక్షాల షాక్ - టీజేఎస్-కమ్యూనిస్టుల ఉమ్మడి అభ్యర్థి సిద్ధం?
YS Jagan Vs Sharmila: షర్మిల కూతురు పెళ్లి అక్కడ చేస్తే, మాజీ సీఎం జగన్ ప్రాణాలకు ముప్పు! షాకింగ్ విషయాలు
షర్మిల కూతురు పెళ్లి అక్కడ చేస్తే, మాజీ సీఎం జగన్ ప్రాణాలకు ముప్పు! షాకింగ్ విషయాలు
కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేవారికి అలర్ట్.. ఇకపై 75 శాతం మార్కులు తప్పనిసరి! కేంద్రం ప్రతిపాదన
డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్.. ఇకపై 60 శాతం కాదు, 75 శాతం మార్కులు సాధించాల్సిందే!
Baththa Movie OTT : ఓటీటీలోకి విజయ్ సేతుపతి కొత్త మూవీ - టాయిలెట్‌లో గ్యాంగ్ స్టర్‌... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి విజయ్ సేతుపతి కొత్త మూవీ - టాయిలెట్‌లో గ్యాంగ్ స్టర్‌... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
AP Local Elections: ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఆ ముగ్గురు గోట్స్! దేబ్జానీ, నీతూలకు బిగ్‌బాస్ ప్రసంశలు! ఆట మార్చేసిన బాస్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఆ ముగ్గురు గోట్స్! దేబ్జానీ, నీతూలకు బిగ్‌బాస్ ప్రసంశలు! ఆట మార్చేసిన బాస్!
Embed widget