అన్వేషించండి

Brahmamudi Serial Today February 10th:  ‘బ్రహ్మముడి’ సీరియల్: రుద్రాణికి వార్నింగ్‌ ఇచ్చిన రాహుల్‌ - అయోమయంలో రుద్రాణి

Brahmamudi serial today episode February 10th: మినిస్టర్‌ వెనక ఉండి ఆయన్ని నడిపించింది నువ్వేనని ఎప్పటికీ తెలియకుండా జాగ్రత్తపడమని రుద్రాణికి చెప్తాడు రాహుల్‌.   

Brahmamudi Serial Today Episode: హాస్పిటల్‌ ఆపరేషన్‌ థియేటర్‌లో ఉన్న పాపను కొందరు చంపాలను చూస్తున్నారు అని నర్సు నీలవేణి రాజ్‌, కావ్యలకు చెప్పగానే వాళ్లు షాక్‌ అవుతారు. రాజ్‌ కూల్‌గా అంతా నేను చూసుకుంటాను నువ్వు వెళ్లి మన వాళ్లను ఇంటికి పంపించు అని చెప్తాడు. కావ్య సరే అంటూ వెళ్తుంది. నీలవేణి వెళ్లపోతుంది. తర్వాత రౌడీలు హాస్పిటల్‌ లోకి వస్తారు. వాళ్లను చూసిన నీలవేణి రాజ్ కు ఫోన్‌ చేసి చెప్తుంది. రాజ్‌ పాపను మార్చేసి ఉంటాడు. ఆపరేషన్‌ థియేటర్‌లో పాప లేకపోవడంతో రౌడీలు షాక్‌ అవుతారు. ఇంతో రాజ్‌ వచ్చి వారితో ఫైట్‌ చేస్తుంటాడు. ఒక రౌడీ కత్తితో పొడవబోతుంటే కావ్య అడ్డు పడుతుంది. కావ్యకు గాయం అయి బ్లడ్‌ వస్తుంది. అప్పుడే మినిస్టర్‌ ధర్మేంద్ర వచ్చి రౌడీలను అక్కడి నుంచి వెళ్లగొడతాడు. మినిస్టర్‌ ను చూసిన కావ్య, రాజ్‌ కోపంతో రగిలిపోతుంటారు.

రాజ్: కన్నకూతురిని చంపుకోవాలని అనుకున్నావా? నువ్వు అసలు తండ్రివేనా? నీ భార్య సంతోషం కోసం బిడ్డల్ని మార్చావు.. నీకు వారసురాలు కావాలని నా భార్యకు బిడ్డను దూరం చేశావు.. ఇప్పుడు శాశ్వతంగా మా బిడ్డ మీ దగ్గరే ఉండాలని చివరికి కన్నకూతురిని కూడా చంపుకోవాలని అనుకున్నావా

మినిస్టర్‌: నన్ను క్షమించండి రాజ్‌, కావ్య అసలు మిమ్మల్ని క్షమించమని అడిగే అర్హత కూడా లేని పాపాత్ముడిని, మీరు నన్ను క్షమించడం కాదు నరికేయండి

కావ్య: నిన్ను క్షమించడం కాదు.. నీ లాంటి వాడి నీడ మా మీద పడ్డా మాకు పాపం చుట్టుకుంటుంది

మినిస్టర్‌: మా ఆనందం కోసం మిమ్మల్ని ఏడిపించిన రాక్షసుడిని. కానీ ఆ రాక్షసత్వం ఈరోజు నీ మాతృత్వం ముందు ఓడిపోయింది. నేను చేసింది తప్పు కాదు నేరం. నా భార్యను బతికించుకోవడం కోసం నీ అమ్మతనాన్ని బలి చేశాను, స్వార్ధంగా ఆలోచించాను. మనసులో మరో తల్లికి అన్యాయం చేస్తున్నాను అనిపించినా... నా స్వార్ధం, నా భార్య ఆనందం దానిని చూడనివ్వకుండా చేసింది. అందుకే కళ్లు తెరిచి మీ ముందు ఇలా దోషిగా నిలబడ్డాను.  మీకు ఏ సంబంధం లేని బిడ్డ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు.. నా పాపని కాపాడటానికి ఆరాటపడ్డారు. కానీ నేను నా కన్నకూతురిని చంపడానికి సిద్ధపడ్డాను, నేను తండ్రినని చెప్పుకునే అర్హత కూడా నాకు లేదు.. నా పాపకి ఉన్న ఆరోగ్య సమస్య తెలిసి భయపడ్డాను.. నా భార్య ఏమైపోతుందోనని బెదిరిపోయాను. పిల్లల్ని మార్చేస్తే నా ఇల్లు వెలిగిపోతుందని అనుకున్నానే కానీ ఓ తల్లి పేగు బంధాన్ని తెంచేస్తే అది చీకటిగా అయిపోతుందని ఇప్పుడే అర్ధమైంది.. నన్ను క్షమించండి.. మీరు పడ్డ బాధకి, అనుభవించిన క్షోభకు కారణం నేనే.. అందుకు మీరు ఏ శిక్ష వేసినా నేను తలవంచుతాను

అని చెప్తుంటే తులసి మొత్తం వింటుంది. కోపంగా మినిస్టర్‌ ను చూస్తుంది.

తులసి: నా ఒడిలో ఉన్నది ఎవరి బిడ్డ.. నాకు బిడ్డ పుట్టలేదా? కన్నబిడ్డను మార్చి ఆ తల్లికి అన్యాయం చేసింది మీరేనా..

ధర్మేంద్ర: నేను ఇదంతా నీకోసమే చేశాను తులసి.  పుట్టగానే మన బిడ్డకు గుండె సమస్య ఉందని తెలిసింది. అది నీకు తెలిస్తే నువ్వు దక్కవని భయపడి బిడ్డని మార్చేశాను

తులసి: మీరు చాలా  పాపం చేశారు.. ఇలా నా ప్రాణాన్ని కాపాడే బదులు నాకు విషమిచ్చి చంపితే నాకింత బాధగా ఉండేది కాదు

తర్వాత కావ్యకు సారీ చెప్పి తన చేతిలోని కావ్య బిడ్డను కావ్యకు ఇస్తుంది. కావ్య కూడా తులసిని నువ్వు చాలా గొప్పదానివి అంటుంది. తర్వాత కావ్య తన బిడ్డను తీసుకుని ఇంటికి వెళ్తుంది. మరోవైపు ఆ మినిస్టర్‌ వెనక ఉండి నడిపించింది నువ్వే అని బయటకు తెలియకుండా జాగ్రత్త పడు మమ్మీ అంటూ రుద్రాణికి వార్నింగ్‌ ఇస్తాడు. రాహుల్‌. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Sanjana Serial : బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?
బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?
Express Hari: మధ్య తరగతి కుర్రాడి కష్టానికి ఫలితం... నా చిరునామా... సొంత ఇంట్లో అడుగుపెట్టిన హరి
మధ్య తరగతి కుర్రాడి కష్టానికి ఫలితం... నా చిరునామా... సొంత ఇంట్లో అడుగుపెట్టిన హరి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 4th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ సర్టిఫికేట్లు కాల్చేసిన శకుంతల! కుమిలి కుమిలి ఏడుస్తున్న లక్ష్మీ! ఇంక ఏ గుర్తింపు లేనట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ సర్టిఫికేట్లు కాల్చేసిన శకుంతల! కుమిలి కుమిలి ఏడుస్తున్న లక్ష్మీ! ఇంక ఏ గుర్తింపు లేనట్లేనా!
Godavari Serial Today July 4th: 'గోదావరి' సీరియల్: వేలం ఆపేసిన సూర్య! జాను చేసిన పనికి ఇల్లు దక్కించుకున్న ఫ్యామిలీ!
'గోదావరి' సీరియల్: వేలం ఆపేసిన సూర్య! జాను చేసిన పనికి ఇల్లు దక్కించుకున్న ఫ్యామిలీ!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Chicken Leg Roast : నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
Mbappe Vs Messi Golden Boot War: మెస్సితో ఎంబాప్పే మైండ్ బ్లోయింగ్ ఈక్వల్ ఫైట్.. పరాగ్వేపై పగ తీర్చుకుంటూ క్వార్టర్స్ లోకి ఫ్రాన్స్, రొనాల్డో ఫ్లాప్ షో!
మెస్సితో ఎంబాప్పే మైండ్ బ్లోయింగ్ ఈక్వల్ ఫైట్.. పరాగ్వేపై పగ తీర్చుకుంటూ క్వార్టర్స్ లోకి ఫ్రాన్స్, రొనాల్డో ఫ్లాప్ షో!
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
Face Packs for Glowing Skin : మృదువైన స్కిన్, గ్లో కోసం సహజమైన ఫేస్ ప్యాక్స్(Homemade Face Packs).. ఇంట్లో ట్రై చేసేయండి
మృదువైన స్కిన్, గ్లో కోసం సహజమైన ఫేస్ ప్యాక్స్(Homemade Face Packs).. ఇంట్లో ట్రై చేసేయండి
Embed widget