అన్వేషించండి

Brahmamudi Serial Today Fabruary 12th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : వంద కోట్ల నిజం చెప్పిన సుభాష్‌ -  ఆస్థి కోసం ఎంతకైనా తెగిస్తానన్న ధాన్యలక్ష్మీ

Brahmamudi Today Episode: రాజ్‌, కావ్యలు వంద కోట్ల అప్పు చేయలేదని ఆ నిజం తనకు తెలుసని సుభాష్‌ చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: కళ్యాణ్‌, ప్రకాష్‌ ఆలోచిస్తూ కూర్చుని ఉంటే ధాన్యలక్ష్మీ వచ్చి కళ్యాణ్‌ను కన్వీన్స్‌ చేయాలని చూస్తుంది.  ఇప్పటికైనా మన దారి మన చూసుకోకపోతే వంద కోట్ల అప్పు మన మెడకు చుట్టుకుంటుందని ఆలోచించుకోమని చెప్పి వెళ్లిపోతుంది. ప్రకాష్‌ కూడా కళ్యాణ్‌కు నాలా ఉండొద్దని చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు రాహుల్‌, రుద్రాణి ఇద్దరూ కలిసి స్వప్న దగ్గరకు వెళ్తారు.

రుద్రాణి: పాప నిద్రపోతుందా..?

స్వప్న: ఈ వయసులో నిద్రపోకా మీలా ఎవరి గురించి ఎవరికి చాడీలు చెబుదామా..? అని ఆలోచిస్తుందా..?

రుద్రాణి: మేము ఇప్పుడు ఏమన్నామని కౌంటర్లు.. ఎన్‌కౌంటర్లు వేస్తున్నావు.

రాహుల్‌: మనల్ని చూస్తేనే దీనికి నెగటివ్‌ వైబ్స్‌ వస్తావేమో మామ్‌

స్వప్న: నా సంగతి అటు ఉంచండి.. మీరు మళ్లీ ఎందుకొచ్చారు. నా చెల్లి కావ్య గురించి నన్ను రెచ్చగొట్టడానికి వచ్చారా..?

రుద్రాణి: రెచ్చగొట్టడం కాదు. కళ్లు తెరిపించడం కోసం వచ్చాము. ముసలాయన నీకు ఇచ్చిన ప్రాపర్టీ కూడా అమ్ముకునే పరిస్థితి వస్తుంది.

అంటూ ఇద్దరూ స్వప్నను డైలమాలో వేసి వెళ్తారు. మరోవైపు హాస్పిటల్‌కు వెళ్లిన ఇందిరాదేవిని ఎందుకు డల్లుగా ఉన్నావని సీతారామయ్య అడుగుతాడు.

ఇందిరాదేవి: అబ్బే అదేం లేదే నేను బాగానే ఉన్నాను బావ.

సీతారామయ్య: చిట్టి నేను నీతో ఇన్నేళ్లు కాపురం చేశాను. నీ ముఖం చూసి ఎలా ఉన్నావో ఆ మాత్రం తెలుసుకోలేనా..?

ఇందిర: తర్వాత చెప్తాను బావ.. డాక్టర్‌ నిన్ను రెస్ట్‌ తీసుకోమన్నారు

సీతారామయ్య: అంత గండాన్నే దాటుకుని వచ్చాను నువ్వు నిజం చెబితే తట్టుకునే గుండె ధైర్యం నాకుంది చెప్పు

ఇందిరాదేవి ఇంట్లో జరుగుతున్న గొడవలు గురించి చెప్తుంది. రాజ్‌, కావ్య వంద కోట్ల అప్పు గురించి చెప్తుంది. దీంతో సీతారామయ్య కూల్‌గా రాజ్‌ అలాంటి వాడు కాదు కానీ రాజ్‌ అప్పు చేసినట్టు ఆధారాలు ఉన్నాయా అని అడుగుతాడు. మాకు తెలియదని అనామిక వచ్చి చెబితే తెలిసింది అని ఇందిర చెప్తుంది. మరోవైపు స్టేషన్‌కు వెళ్ళిన అప్పు తన తెలివితో గుడిలో దొంగతనం చేసిన దొంగన పట్టుకుంటుంది. దీంతో మిగతా పోలీసులు అందరూ షాక్ అవుతారు. అప్పు తెలివిని మెచ్చుకుంటారు. తర్వాత దుగ్గిరాల ఇంట్లో అందరూ హాల్లో కూర్చుని ఉండగా బ్యాంకు వాళ్లు వస్తారు.

రుద్రాణి: హలో ఎవరు మీరు ఇంట్లోకి వస్తున్నారు

బ్యాంకు ఆఫీసర్‌: మీరు ఇంట్లోంచి బయటకు వెళ్లే టైం వచ్చింది. అందుకే మేము వచ్చాం.

 రాజ్‌, కావ్య కిందకు వస్తారు.

రాజ్‌: సార్‌ మీరేంటి ఇక్కడికి వచ్చారు

బ్యాంకు ఆఫీసర్‌: తప్పలేదు మిస్టర్‌ రాజ్‌ మీరు చెల్లిస్తానన్న వంద కోట్లు గడువు లోపల చెల్లించలేదు. కాబట్టి జప్తు నోటీసు ఇచ్చి వెళ్దామని వచ్చాం

రాజ్‌: సార్‌ మేము 25 కోట్లు కట్టాము కదా..?

బ్యాంకు ఆఫీసర్‌: మిగతా అమౌంట్‌ 75 కోట్ల కోసం మేము రెండు సార్లు నోటీసు ఇచ్చాం. కానీ మీ నుంచి రెస్పాండ్‌ లేదు

ధాన్యలక్ష్మీ: ఏంటి ఇల్లు జప్తు చేస్తారా..? విన్నారా..? నేను మొదటి నుంచి చెప్తున్నాను.. ఎవ్వరూ వినలేదు. ఇప్పుడు కట్టుబట్టలతో రోడ్డు మీదకు గెంటేస్తారు.

రుద్రాణి: ఇలాంటిదేదే జరగుతుందనే.. పనిలో పనిగా నేను కూడా ఆస్థి రాయించుకోవాలనుకున్నాను. అందరినీ హెచ్చరిస్తూనే ఉన్నాను. ఈ కుటుంబాన్ని నమ్ముకున్నందుకు నాకేం మిగిల్చారు

ధాన్యలక్ష్మీ: అసలు ఆ అప్పుతో మాకెలాంటి సంబంధం లేదు. ఇల్లు ఎలా జప్తు చేస్తారు

బ్యాంకు ఆఫీసర్‌: ఆస్థి ఎవరి పేరు మీద ఉంది

ప్రకాష్‌: కావ్య పేరు మీద ఉంది.

బ్యాంకు ఆఫీసర్‌: మరి ఆవిడే అప్పు కడతానని సంతకం చేశారు

అపర్ణ: రాజ్‌ అసలేం జరుగుతుంది.

రుద్రాణి: అసలు వంద కోట్ల డబ్బును ఎక్కడ దాచారు. కనకం పేరు మీద ఎన్ని కోట్లు వేశారు. కృష్ణమూర్తి పేరు మీద ఎంత దాచారు. అవన్నీ ఇప్పుడే బయటకు తీసి బ్యాంకుకు కట్టేయాలి.

సుభాష్‌: రుద్రాణి నా కొడుకు కోడలు ఒక్క రూపాయి కూడా అప్పు చేయలేదు. కావాలంటే బ్యాంకు వాళ్లనే అడగు.. ఏంటి ఆఫీసర్స్‌ రాజ్‌ కానీ కావ్య కానీ మీ బ్యాంకులో అప్పు చేశారా..?

బ్యాంకు ఆఫీసర్‌: లేదు చేయలేదు.

అని చెప్పగానే అందరూ  షాక్‌ అవుతారు. మరి వంద కోట్లు ఎందుకు కట్టాలి అని అడుగుతారు. దీంతో సుభాష్‌ నిజం చెప్పి తనకు రాత్రే తెలిసిందంటాడు. అయినా వినకుండా ధాన్యలక్ష్మీ, రుద్రాణి మా వాటా మాకు ఇచ్చి మీరేమైనా చేసుకోండి అంటారు. దీంతో అందరి మధ్య గొడవ జరగుతుంది. ఇంతలో సీతారామయ్య, ఇందిరాదేవి ఆపండి అంటూ వస్తారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Gundeninda Gudigantalu August 21th:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?
గుండెనిండా గుడిగంటలు:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?
Brahmamudi Serial Today August 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్: డీఎన్‌ఏ రిపోర్ట్స్‌ చూసిన భూషణ్‌ - రేఖను ఇల్లంతా పరిగెత్తించిన రాజు
‘బ్రహ్మముడి’ సీరియల్: డీఎన్‌ఏ రిపోర్ట్స్‌ చూసిన భూషణ్‌ - రేఖను ఇల్లంతా పరిగెత్తించిన రాజు
Karthika Deepam 2 Serial Today August 21st: కార్తీకదీపం 2 సీరియల్: నీకు నా మీద ప్రేమ లేదురా.. నిశ్చితార్థం వద్దు!
కార్తీకదీపం 2 సీరియల్: నీకు నా మీద ప్రేమ లేదురా.. నిశ్చితార్థం వద్దు!
Jagadhatri Serial Today August 20th : ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు

వీడియోలు

Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget