అన్వేషించండి

Brahmamudi Serial Today December 19th:  ‘బ్రహ్మముడి’ సీరియల్:  విషమంగానే సీతారామయ్య పరిస్థితి – పోలీస్‌  ట్రైనింగ్‌లో ఉండలేనన్న అప్పు

Brahmamudi Today Episode:  పోలీస్‌ ట్రైనింగ్‌ లో ఉండలేనని.. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడం, దూకడం తన వల్ల కావడం లేదని అప్పు చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Brahmamudi Serial Today Episode:   బ్యాంకు వాళ్లు వచ్చి ఇల్లు సీజ్‌ చేస్తామని అందరూ బయటకు వెళ్లండి అని చెప్పగానే రుద్రాణి, ధాన్యలక్ష్మీ కోపంగా సీతారామయ్యను తిడతారు. రాహుల్‌ కూడా తాతయ్యకు మతి భ్రమించి సంతకం చేశారని ఆయన చేసిన పిచ్చి పనికి మేము ఎందుకు బయటకు వెళ్లాలని నిలదీస్తాడు. మీరు బయటకు వెళ్లకపోతే పోలీసుల చేత గెంటి వేయిస్తామంటారు బ్యాంకు వాళ్లు

ధాన్యలక్ష్మీ: అయితే మేము కోర్టుకు పోతాం

రుద్రాణి: స్టే ఆర్డర్‌ తీసుకొస్తాం

రాహుల్‌: పెద్దాయన మతి స్థిమితం కోల్పోయి ఏదో రాసిస్తే మాకేంటి సబంధం.

ధాన్యలక్ష్మీ: అసలు పెద్దాయన ఇచ్చిన మాటతో కానీ రాసిచ్చిన పత్రంతో కానీ మాకెలాంటి సంబంధం లేదు.

రాజ్: అది కాదు పిన్ని తాతయ్య మాటకు మనం తల వంచాలి కదా..?

ధాన్యలక్ష్మీ: తల వంచడం కానీ తల దించడం కానీ లేదు. కావాలంటే నువ్వు మీ అమ్మ, మీ నాన్న తల వంచండి. మీ తాత మాటలకు కట్టుబడి ఉంటే అడుక్కుతినాలి. మాకేం కర్మ వారసులుగా మా ఆస్థి మేము రాబట్టుకోవడానికి కోర్టుకు వెళ్లే తీరుతాం

రుద్రాణి: అవును నా చెవి దుద్దులు, బంగారం అమ్మైనా సరే మంచి లాయర్‌ ను పెట్టుకుని కోర్టుకు వెళ్తాం

ఇందిరాదేవి: ఆపండి.. ఇన్నాళ్లు ఆయన ముందు మాట్లాడటానికే భయపడే మీరు ఇవాళ ఆస్థులు పోయాయి అనగానే ఆయనకు మతిస్థిమితం లేదంటారా..? ఇదంతా నా భర్త స్వార్జితం.. పోతే పోయింది. ఆయన ఇచ్చిన మాట, పెట్టిన సంతకం అన్ని ఆయన కోసం గౌరవించి తీరాలి.

  దీంతో రుద్రాణి, ధాన్యలక్ష్మీ కోర్టుకు వెళ్లే తీరతామంటారు. ఇందిరాదేవి ఎమోషనల్‌ అవుతుంది. ఈ విషయం ఆయనకు తెలిస్తే వెంటనే గుండె ఆగి చనిపోతారు అని ఏడుస్తూ ఇందిరాదేవి కుప్పకూలిపోతుంది. అందరూ కంగారుగా ఇందిరాదేవి దగ్గరకు వస్తారు రాజ్‌  కూడా ఉలిక్కి పడి నిద్ర లేస్తాడు. ఇదంతా కలా అనుకుని బ్యాంకు వాళ్లకు డబ్బులు కట్టకపోతే నిజం అవుతుంది అనుకుంటాడు. మరోవైపు డాక్టర్‌ సీతారామయ్యను చెక్‌ చేస్తాడు. తాతయ్యకు ఎప్పుడు బాగవుతుందని కళ్యాణ్‌ అడిగితే ఎప్పుడు అని కచ్చితంగా చెప్పలేమని.. ట్రీట్‌మెంట్‌ చేసుకుంటూ వెళ్తే ఏదో ఒకరోజు ఆయన కోమాలోంచి బయటకు వస్తారని చెప్పి వెళ్లిపోతాడు. అందరూ ఇంట్లో భోజనం చేస్తుంటారు.

ధాన్యలక్ష్మీ: ఏంటి కూరలన్నీ ఇంత చప్పగా ఉన్నాయి. ఉప్పు లేని చప్పిడి కూడు పెడుతున్నావేంటి..

అపర్ణ: ఉప్పు వేసినా ఏం లాభం అనుకున్నావా..? కావ్య. ఈ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసం కూడా వీళ్లెవరికీ లేదని ఉప్పేయడం మానేశావా..?

కావ్య: నేను సరిగ్గానే వేశాను అత్తయ్య

రుద్రాణి: సరిగ్గానే వేసిందంట ధాన్యలక్ష్మీ.. అత్తగారు వెనకేసుకొస్తున్నారు కదా..? రుచి చూసిన వాళ్లు పిచ్చోళ్లు.. నోట్లో నాలుకే లేనివాళ్లు

ధాన్యలక్ష్మీ: నడమంత్రపు సిరి బాగా తలకు ఎక్కినట్టు ఉంది

ఇంతలో పైనుంచి రాజ్‌ వస్తాడు. వస్తూనే కావ్యను డైరెక్టుగా హెల్ఫ్‌ అడిగితే చేయదని ఫస్ట్‌ కాకా పట్టాలనుకుని దగ్గరకు వస్తాడు.

రాజ్: ఏంటి కళావతి వంటలన్నీ గుమగుమలాడుతున్నాయి. వాసన చూస్తుంటేనే నోరూరుతుంది.

ఇందిరాదేవి: ఏంటి రాజ్‌  తినక ముందే పొగుడుతున్నావు.

రాజ్‌: కళావతి వంటకు వంకలు పెట్టాలా నాన్నమ్మ.. కళావతి వంటలు బాగా లేవన్న వాళ్లు ఇంటింటికి తిరుగుతూ అడుక్కుతినాలి.

ధాన్యలక్ష్మీ:  ముందు తిని తర్వాత మెచ్చుకో రాజ్‌..

రాజ్‌ తిని అబ్బా ఈరోజే వంటల్లో ఉప్పు తక్కువ కావాలా..? అని మనసులో అనుకుని బయటకు మాత్రం సూపర్బ్‌ గా ఉన్నాయి అంటాడు.  రాజ్‌ కూడా నాటకాలు చాలా బాగా ఆడుతున్నాడు.. యావదాస్తి, ఇంటి తాళాలు కావ్య దగ్గర ఉన్నాయి కదా అందుకే ఈ నటన అంటుంది రుద్రాణి. రాజ్‌ కోపంగా ఆస్తుల కోసం ఒకరిని పొగిడి భజన చేసి బతకాల్సిన కర్మ నాకేం పట్టలేదు అంటూ తినకుండా వెళ్లిపోతాడు.  ట్రైనింగ్‌ లో ఉన్న అప్పు, కళ్యాణ్‌కు ఫోన్‌ చేసి ఈ కష్టాలు నేను భరించలేను అంటూ వాపోతుంది. పోలీస్‌ ట్రైనింగ్‌ అంటే అలాగే ఉంటుంది పొట్టి అని కళ్యాణ్‌ చెప్తాడు. నీకోసమే నేను ఈ కష్టాలు భరిస్తున్నాను అంటుంది అప్పు. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today October 16: నిషిక గొంతునులిమి చంపబోయిన యువరాజు..కోడలిని కాపాడిన వైజయంతి
జగద్ధాత్రి సీరియల్: నిషిక గొంతునులిమి చంపబోయిన యువరాజు..కోడలిని కాపాడిన వైజయంతి
Podarillu Serial Today Oct 16: కేశవ్‌ స్థలం కొనడానికి అన్నదమ్ములతోపాటు మహాలక్ష్మీ సాయం..డబ్బు కళ్లకు కనిపించేసరికి జమునకు దుర్భుద్ది
పొదరిల్లు: కేశవ్‌ స్థలం కొనడానికి అన్నదమ్ములతోపాటు మహాలక్ష్మీ సాయం..డబ్బు కళ్లకు కనిపించేసరికి జమునకు దుర్భుద్ది
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 16th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: క్లూ ఇచ్చిన సిరి! సిరి మీద పెట్రోల్ పోసి తండ్రిని బెదిరించిన అంబిక! ఆస్తి రాయించుకుంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: క్లూ ఇచ్చిన సిరి! సిరి మీద పెట్రోల్ పోసి తండ్రిని బెదిరించిన అంబిక! ఆస్తి రాయించుకుంటుందా!
Nindu Manasulu Serial Today October 16th: నిండు మనసులు: కారులో పడుకున్న సిద్ధూ! కనికరించని ప్రేరణ! ప్లాన్ ఫెయిల్!
నిండు మనసులు: కారులో పడుకున్న సిద్ధూ! కనికరించని ప్రేరణ! ప్లాన్ ఫెయిల్!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget