Brahmamudi Serial Today April 28th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందు చేసిన వంటలు చూసి షాకైన చలపతి – అయోమయంలో లక్కీ
Brahmamudi serial today episode April 28th: ఫంక్షన్ కోసం ఇందు చేసిన వంటలు చూసి చలపతి షాకవుతాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Brahmamudi Serial Today Episode: రాజు ఇంట్లో నందును చూసిన లక్కీ షాక్ అవుతాడు. రాజును పక్కకు తీసుకెళ్లి తిడుతుంటాడు. ఇందును మనమే కిడ్నాప్ చేశామని నందుకు తెలిస్తే మన బతుకులు జైలుకే అంటూ భయడపడుతుంటాడు.
లక్కీ: వామ్మో విలాసవంతంగా బతకాలనుకున్న మనం జైలు గోడల మధ్య మగ్గిపోవాల్సిందేనా..?
రాజు: రేయ్ నువ్వేం భయపడకురా నందుకు ఏమీ తెలియదు
లక్కీ: రేయ్ ఇప్పుడు తెలియకపోవచ్చు.. ఆసలు తను ఇందు ఫోటో పట్టుకుని తిరగడం మర్చిపోయావా..? నాకు డౌటేరా..? తను మనల్ని పట్టుకోవడానికే వచ్చి ఉంటుంది. మనమే కిడ్నాపర్లు అని తెలిసి కూడా తెలియనట్టు నటిస్తుందేమోనని నాకు డౌటుగా ఉందిరా
నందు వస్తుంది.
నందు: మీరు కిడ్నాప్ చేశారన్న విషయం నాకు తెలుసు..? ఏంటి అలా తెల్లముఖాలేసుకుని అలా చూస్తున్నారు. ఆరోజు మీరు గురకపెట్టి నిద్ర పోతుంటే నేను ఇంట్లోకి వచ్చాను
లక్కీ: నువ్వు అప్పుడు ఫోటో చూపించి వెళ్లిపోయావు కదా
నందు: ఆరోజు రాత్రి మళ్లీ తిరిగి వచ్చాను కదా
లక్కీ: ఏంటమ్మా..? మళ్లీ ఎందుకు వచ్చావు..? ఎలా తెలుసుకున్నావు
నందు: కిడ్నాప్ చేసిన అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని బయట ఆ అమ్మాయి బట్టలు ఆరేస్తే.. దొరక్కుండా ఎలా ఉంటుంది. అయినా కిడ్నాప్ అయిన అమ్మాయి దొరికినా నేనెందుకు తీసుకెళ్లలేదు అనేగా మీ డౌటు.. మా అక్కే మీ దగ్గర ఉంటానని చెప్పింది. అందుకే ఏమీ అనకుండా వెళ్లిపోయాను. ఇప్పుడు కూడా ఈ విషయం మనం మాట్లాడుకున్నట్టు మా అక్కకు చెప్పొద్దు
అంటూ వార్నింగ్ ఇచ్చి నందు వెళ్లిపోతుంది. వంటల దగ్గర ఇందు బిజీగా ఉంటుంది. రాజుకు కల్లల్లో నలక పడగానే.. ఇందు కంగారు పడుతుంది. రాజు కళ్లల్లోకి చూస్తూ ఊదేస్తుంది. అదంతా చూసిన చలపతి ఇలాంటి అమ్మాయి తమ ఇంటి కోడలు అయితే బాగుండు అని లక్ష్మీతో అంటాడు. తర్వాత రాజు డ్రెస్ తీసుకొచ్చి ఇందుకు ఇస్తాడు.
ఇందు: థాంక్స్ రాజు.. (రాజు హ్యాపీగా ఫీలవుతుంటే..) ఇదే కదా నువ్వు ఎక్స్‌ఫెక్ట్ చేసింది
రాజు: మేం ఎందుకు ఎక్స్‌ఫెక్ట్ చేస్తాము ఏం చేయలేదు..
ఇందు: సరే మీరు వెళ్లి డ్రెస్ మార్చుకోండి నిన్నటి నుంచి ఇదే డ్రెస్‌లో ఉన్నారు. వెంకీ అక్కడ వంట పనులన్నీ అయిపోయాయి. అన్ని ఒకే చోట పెట్టేసెయ్
వెంకీ: అలాగే సరే.. అన్నయ్య నువ్వు వెళ్లి ఫ్రెష్ అయి రాపో
రాజు వెళ్లిపోతాడు. ఇందు లోపలికి వెళ్లిపోతుంది. చలపతి, లక్ష్మీ వంటలు చూస్తారు. చలపతి ఆశ్చర్యపోతాడు.
చలపతి: ఇవన్నీ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్‌తోనే చేశారా..?
వెంకీ: అవును నాన్న ఎన్ని రకాల వంటకాలు తయారు చేశామో చూశారా..?
రాజు: (మనసులో) ఇన్ని రకాల వంటకాలు తయారు చేశామంటే నాకే ఆశ్చర్యంగా ఉంది
చలపతి: అద్బుతంగా ఉందమ్మా.. వచ్చే బంధువుల కన్నా ముందు నాకే తినాలనిపిస్తుంది.
ఇందు: ఆగండి ఆగండి మీరు చేసే వేరే పనులు ఉన్నాయి.. రెండు కిలోల చికెన్ ఎలా సర్దుతాను అని అడిగావు కదా ఇదిగో ఈ కప్పుల్లో సర్దుతాను
అని ఇందు చెప్పగానే.. రాజు ఆశ్చర్యంగా చూస్తుంటాడు. ఇంతలో అతిథులు వస్తారు. అందరినీ కూర్చోబెట్టి ప్రూట్ ఫంచ్ అంటూ నిమ్మరసం ఇస్తారు. నిమ్మరసం తాగిన వారందరూ చాలా బాగుందని అడిగి మరీ మళ్లీ మళ్లీ తాగుతుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
Before You Go
NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
ట్రెండింగ్ వార్తలు






















