అన్వేషించండి

chinni serial today April 28th: చిన్ని సీరియల్: ఫ్యాన్‌కి వేలాడుతున్న శ్రేయ! అసలేం జరిగింది? మ్యాడీకి నాగవల్లి ఏం చెప్పింది!

chinni serial today episode April 28th చిన్నికి దెయ్యం పట్టిందని నాగవల్లి మ్యాడీకి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode లోహిత, శ్రేయలను చిన్ని కొట్టిందని లోహిత అనడంతో వరుణ్ లోహితను లాగి పెట్టి కొడతాడు. ఏంటి వరుణ్ ఇలా కొట్టావ్ అని లోహిత అడిగితే నువ్వు చిన్ని మీద చేయి ఎత్తావ్ కదా అందుకే నీ చెంప పగల గొట్టా అని అంటాడు. ఇంతలో శ్రేయ మీదకు ఆత్మ వెళ్లి ఏయ్ వరుణ్ పెళ్లాన్ని కొడతావేంట్రా సిగ్గు లేదా.. ఇంకొక్క సారి లోహి మీద చేయి చేసుకుంటే నీ చెంప పగులుతుంది అని అంటుంది. దాంతో వసంత శ్రేయని కొడుతుంది. 

లోహిత దేవాతో ఇదంతా చిన్ని కొట్టడం వల్లే జరిగింది.. అంకుల్ మీరు తనని ఏదో ఒకటి చేసి తనకి బుద్ధి చెప్పాలి లేకపోతే నేనే ఈ  చిన్నికి బుద్ధి చెప్పాల్సి వస్తుందని అంటుంది. బుద్ధ చెప్పాల్సింది నీకు.,. నీకు కూడా అని శ్రేయని  మ్యాడీ అంటాడు. చిన్ని గురించి నాకు బాగా తెలుసు.. ఇంకెప్పుడైనా చిన్నిని ఏమైనా అంటే ఊరుకునేది లేదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. అంకుల్ చిన్నికి ఏదో దెయ్యం పట్టింది అని లోహిత, శ్రేయ చెప్తే మీరేం భయపడకండి.. నాగవల్లి ఇప్పుడే ఫోన్ చేసింది ఆ దెయ్యాన్ని వదిలేంచి వాళ్లు దొరికారంట అని అంటాడు. ఓసేయ్ కావేరి అతి తొందర్లో నీ చాప్టర్ క్లోజ్ అని మ్యాడీ అంటాడు. 

మ్యాడీ కంట్లో నలక పడుతుంది. చిన్ని చూసి కన్ను ఊదుతుంది. మ్యాడీ చిన్నినే చూస్తూ ఉంటాడు. తర్వాత చిన్ని కొంగుతో కంటికి ఆవిరి పెడుతుంది. మ్యాడీ థ్యాంక్స్ అని అంటే మొగుడు పెళ్లాల మధ్య థ్యాంక్స్‌లు ఉండకూడదు అన్నాను కదా అంటుంది. ఇక చిన్ని లోహిత, శ్రేయలు తన గది వైపు రావడం చూసి వీళ్ల పని చెప్తా అనుకుంటుంది. ఇద్దరూ వినేలా మ్యాడీ తనని వదలకుండా రొమాన్స్ చేసినట్లు ముద్దులు పెట్టినట్లు నటిస్తుంది. శ్రేయ చాలా ఫీలవుతుంది. బావ ఆ చిన్నికి ఇంత దగ్గరైపోయాడా అని తెగ ఫీలైపోతుంది. కిచెన్‌లో పని ఉంది చూసుకొని వస్తా తర్వాత నీ ఇష్టం అని చిన్ని అంటుంది. తర్వాత బయటకు వచ్చి ఏంటి మా బెడ్ రూం దగ్గర ఏం చేస్తున్నారు.. మేం ఇద్దరం ఏం మాట్లాడుకుంటున్నామో వినాలి అని వచ్చారా అని అంటుంది. ఇటు వెళ్తూ ఇలా వచ్చాం అంటుంది లోహిత. లోహితో స్నేహం చేసి అబద్ధాలు బాగా నేర్చుకున్నావ్ శ్రేయ.. నువ్వు ఈ లోహి మాటలు విని మీ బావ మీద ఆశలు పెట్టుకోవడం వేస్ట్.. మీ బావ నన్ను వదలడం కానీ నిన్ను పెళ్లి చేసుకోవడం కానీ ఈ జన్మలో జరగదు.. నా మాట విని నీ లైఫ్ నువ్వు చూసుకో.. ఈ లోహి మాటలు వింటే నాశనం అయిపోతావ్.. నీ లోహి నిజస్వరూపం నీకు తెలీదు అని అంటుంది. మీరు శ్రుతి పెంచితే మీ విషయంలో నేను లయ పెంచాల్సి వస్తుంది జాగ్రత్త అని ఇద్దరి బుగ్గలు గిల్లేసి చిన్ని వెళ్లిపోతుంది. 

నాగవల్లి ఇంటికి వచ్చే సరికి శ్రేయ ఫ్యాన్‌కి ఉరి వేసుకున్నట్లు ఉంటుంది. నాగవల్లి చూసి శ్రేయ.. శ్రేయ అని అరుస్తుంది. వసంత వచ్చి ఏమైంది అని అడిగితే శ్రేయ.. శ్రేయ అని అంటుంది. ఏం లేదు వదినా చూడండి అని వసంత అంటే ఇప్పుడు నేను చూశాను అని కంగారు పడుతుంది. ఇంతలో శ్రేయ, లోహిత వచ్చి ఏమైంది అని అడిగితే నువ్వు ఉరేసుకున్నట్లు మీ అత్తయ్యకి కల వచ్చిందనుకుంటా అని వసంత అంటుంది. బావకి ఇచ్చి నాకు పెళ్లి చేయకపోతే అదే జరుగుతుందని శ్రేయ అంటుంది. ఇంతలో నాగవల్లి లోకి కావేరి ఆత్మ దూరి శ్రేయని కోపంగా చూసి ఆవేశంగా గదిలో అన్ని వస్తువులు విసిరేసి  చంపేస్తా ఇంకోసారి చస్తా అంటే నేను చంపేస్తా.. చచ్చి ఏం సాధిస్తావ్.. చచ్చిపోతే మీ బావ నిన్ను పెళ్లి చేసుకుంటాడా చెప్పు అని శ్రేయ గొంతు పట్టుకుంటుంది. తర్వాత నాగవల్లి కళ్లు తిరిగి పడిపోతుంది. అందరూ నాగవల్లిని లేపుతారు.

గది మొత్తం చిందర వందరగా ఉండటం చూసి నాగవల్లి ఏమైంది అని అంటే మీలోకి దెయ్యం వచ్చి నన్ను చంపేస్తా అంది అత్తయ్యా అని చెప్తుంది. ఈ రోజే మ్యాడీకి ఆ దెయ్యం గురించి తెలియాలి అందుకు ఒకటే మార్గం అని నాగవల్లి లోహితకు ప్లాన్ చెప్తుంది. మ్యాడీని నాగవల్లి పిలవడంతో మ్యాడీ గదిలోకి వచ్చి చూసి ఏమైంది అని అడుగుతాడు. చిన్నిలోకి దెయ్యం వచ్చి ఇలా చేయిస్తుంది. చిన్నికి దెయ్యం పట్టింది అని నాగవల్లి చెప్తుంది. మ్యాడీ షాక్ అయిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 
 
 

 

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 4th: నిండు మనసులు: సిద్ధూని ట్రాప్‌ చేసిన గణ, ఎమ్మెల్యే! సివిల్స్‌కి ఎసరు వేస్తారా?
నిండు మనసులు: సిద్ధూని ట్రాప్‌ చేసిన గణ, ఎమ్మెల్యే! సివిల్స్‌కి ఎసరు వేస్తారా?
Karthika Deepam 2 Serial Today August 4th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ఉగ్రరూపం..! నేను అనాథని కాదే.. సూరజ్ సంచలన నిర్ణయం!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ఉగ్రరూపం..! నేను అనాథని కాదే.. సూరజ్ సంచలన నిర్ణయం!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 4th:విక్కీకి తొలిముద్దు పెట్టిన రాధ...విక్కీ మనసులో చోటు కోసం భార్యగా ప్రయత్నాలు
నువ్వులేక నేను లేను: విక్కీకి తొలిముద్దు పెట్టిన రాధ...విక్కీ మనసులో చోటు కోసం భార్యగా ప్రయత్నాలు
Podarillu Serial Today August 4th:మాధవ్‌కు పెళ్లిచూపులు...ఆడపెళ్లివారి అభ్యంతరాలు ఏంటి..?
పొదరిల్లు: మాధవ్‌కు పెళ్లిచూపులు...ఆడపెళ్లివారి అభ్యంతరాలు ఏంటి..?

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
New Fielding Coach: టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
Raw Onions Side Effects : పచ్చి ఉల్లిపాయలు తింటే కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఇవే.. వారు తినకూడదట
పచ్చి ఉల్లిపాయలు తింటే కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఇవే.. వారు తినకూడదట
Vishnu Manchu: కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
Embed widget