Vasanthi Krishnan: వాసంతి ఏమిటిది? కాబోయే భర్తతో బిగ్ బాస్ బ్యూటీ ముద్దులాట - ఇంటర్వ్యూలో అరాచకం
Vasanthi Krishnan: 'బిగ్‌బాస్' ఫేమ్ వాసంతి కృష్ణన్ చాలా కాలం తర్వాత వార్తల్లో నిలిచింది. ఇటీవల తనకు కాబోయే భర్త పవన్ కల్యాణ్‌తో కలిసి ఓ యూట్యూబ్ ఛానెల్ ఇచ్చిన వీడియోతో వైరల్ గా మారింది.
Vasanthi Krishnan Kiss: టాలీవుడ్ నటి వాసంతి కృష్ణన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. హీరోయిన్ గా అడపా దడపా సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. బిగ్ బాస్ షోతో పాపులారిటీ సంపాదించుకుంది. అయితే చాలా రోజుల తర్వాత అమ్మడు రెండు కారణాలతో ఇప్పుడు వార్తల్లో నిలిచింది. తన ప్రియుడితో కలిసి పెళ్ళి పీటలెక్కడానికి రెడీ అయిన ఈ భామ.. పెళ్లికి ముందే ఓ ఇంటర్వ్యూలో ముద్దులాటతో రెచ్చి పోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
'బిగ్ బాస్ 6' తెలుగు సీజన్‌లో తన గ్లామర్‌తో ఆకట్టుకున్న వాసంతి.. తాను ప్రేమించిన పవన్ కళ్యాణ్ తో ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తనకు కాబోయే భర్తతో కలిసి పాల్గొన్న ఓ ఇంటర్వ్యూ కూడా వార్తల్లోకి వచ్చింది. అందరిలాగే ఏదో మాట్లాడి వచ్చేస్తే పెద్దగా ప్రాబ్లమ్ అయ్యేది కాదు కానీ, ఇంటర్వ్యూలో గేమ్ షో పేరుతో రచ్చ చేయడమే చర్చకు కారణమైంది.
వాలంటైన్స్ డే సందర్భంగా వాసంతి కృష్ణన్ తన ప్రియుడు పవన్ కల్యాణ్ తో కలిసి ఓ యూట్యూబ్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో వారి వ్యక్తిగత విశేషాలను, సినిమా సంగతులను పంచుకున్నారు. ఈ క్రమంలో యాంకర్ వారిద్దరికీ ఓ టాస్క్ ఇచ్చింది. ఒక గిన్నెలో ద్రాక్ష పళ్లను ఉంచి, చేతులతో పట్టుకోకుండా నోటితో ఒకరికొకరు తినిపించుకోవాలని సూచించింది. దీంతో ఇద్దరూ ఒకరికొకరు నోటితో ద్రాక్ష పళ్ళు తినిపించుకుంటూ, లిప్ లాక్స్ పెట్టుకున్నంత పనిచేశారు. పక్కనే ఉన్న యాంకర్ ఎంకరేజ్ చేయడంతో ఇంకా రెచ్చిపోయి సరసాలాడారు.
Also Read: ఆ హీరో వల్ల ఎక్కువ నష్టపోయింది నేనే, బచ్చాగాడిననే అలా చేశారు: విశ్వక్ సేన్
వాసంతి - పవన్ కల్యాణ్ ల ముద్దులాటకు సంబంధించిన వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. పలు రకాల కామెంట్స్ తో వాళ్ళని ఆడేసుకుంటున్నారు. ప్రేమికులైనా, కాబోయే భార్యా భార్యలైనా మీడియా ముందు ఇవేం పనులు అని ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో యూట్యూబ్ ఛానెల్స్ హద్దులు దాటి ప్రోగ్రామ్స్ చేస్తున్నాయని, వ్యూస్ కోసం ఏమైనా చేయటానికి రెడీ అవుతున్నారని విమర్శిస్తున్నారు. యూట్యూబ్ ఛానెల్స్ లో వచ్చే కంటెంట్ కు కూడా సెన్సార్ షిప్ తీసుకొస్తే ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయవచ్చని సూచిస్తున్నారు.
కాగా, తిరుపతికి చెందిన వాసంతి కృష్ణన్ మోడల్ గా కెరీర్ ప్రారంభించి, సంపూర్ణేష్ బాబు నటించిన 'క్యాలీఫ్లవర్' చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత 'వాంటెడ్ పండుగాడు' లాంటి కొన్ని సినిమాల్లో నటించింది. ఇక బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్‌గా పాల్గొని, తక్కువ సమయంలోనే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. అయినప్పటికీ తన గ్లామర్ తో ఆడియన్స్ ను ఆకట్టుకోగలిగింది. ప్రస్తుతం బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన వాసంతి.. అదే పేరున్న వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకోవడానికి రెడీ అవ్వడం విశేషం. గత ఏడాదిలో డిసెంబర్ లో వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ వారంలో పెళ్ళి చేసుకొని వివాహ బంధంలో అడుగుపెట్టబోతున్నారు.
Also Read: పద్మవిభూషణుడికి అమెరికాలో 'మెగా' సత్కారం!